🍀🌹 22, JULY 2023 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 22, JULY 2023 SATURDAY శనివారం, స్థిర వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹 కపిల గీత - 209 / Kapila Gita - 209🌹
🌴 5. భక్తి స్వరూపము - కాలమహిమ - 19 / 5. Form of Bhakti - Glory of Time - 19 🌴
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 801 / Vishnu Sahasranama Contemplation - 801 🌹
🌻801. అక్షోభ్యః, अक्षोभ्यः, Akṣobhyaḥ🌻
4) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 762 / Sri Siva Maha Purana - 762 🌹
🌻. దేవాసుర యుధ్ధము - 3 / The battle of the gods - 3 🌻
5) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 016 / Osho Daily Meditations - 016 🌹
🍀 16. విభజించబడిన శరీరం / 16. THE DIVIDED BODY 🍀
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 465 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 465 - 2 🌹
🌻465. 'క్షోభిణీ' - 2 / 465. 'Kshobhini' - 2 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 22, జూలై, JULY 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ శనివారం, Saturday, స్థిర వాసరే*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻*
*🍀. శ్రీ వేంకటేశ సహస్రనామ స్తోత్రం - 07 🍀*
*12. అమరామృతసంధాతా ధృతసంమోహినీవపుః |*
*హరమోహకమాయావీ రక్షస్సందోహభంజనః*
*13. హిరణ్యాక్షవిదారీ చ యజ్ఞో యజ్ఞవిభావనః |*
*యజ్ఞీయోర్వీసముద్ధర్తా లీలాక్రోడః ప్రతాపవాన్*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : ఇతరులతో సంబంధాలు - సాధకుడు తోటి సాధకులతో గాక ఇతరులతో సంబంధాలు పెట్టుకోరాదన్న నియనుమేమీ లేదు కాని సాధకుని అంతరంగంలో ఆధ్యాత్మిక జీవనం అభివృద్ధి చెందిన కొలదీ ఆ యితర సంబంధాలలో సైతం మార్పు వచ్చి, సాధకుని దృష్టి నుంచి ఆధ్యాత్మికత నలవరచుకోక తప్పదు. ఈశ్వరునికి అడ్డుగా గాని పోటీగా గాని తయారయేటట్టుగా ఏ సంబంధము నందూ సక్తత కూడదు. 🍀*
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
వర్ష ఋతువు, దక్షిణాయణం,
శ్రావణ మాసం
తిథి: శుక్ల చవితి 09:27:10 వరకు
తదుపరి శుక్ల పంచమి
నక్షత్రం: పూర్వ ఫల్గుణి 16:59:12
వరకు తదుపరి ఉత్తర ఫల్గుణి
యోగం: వరియాన 13:24:57 వరకు
తదుపరి పరిఘ
కరణం: విష్టి 09:26:10 వరకు
వర్జ్యం: 25:01:24 - 26:48:36
దుర్ముహూర్తం: 07:36:10 - 08:28:13
రాహు కాలం: 09:07:15 - 10:44:51
గుళిక కాలం: 05:52:04 - 07:29:39
యమ గండం: 14:00:03 - 15:37:39
అభిజిత్ ముహూర్తం: 11:56 - 12:48
అమృత కాలం: 09:47:00 - 11:35:00
సూర్యోదయం: 05:52:04
సూర్యాస్తమయం: 18:52:51
చంద్రోదయం: 09:25:20
చంద్రాస్తమయం: 22:02:05
సూర్య సంచార రాశి: కర్కాటకం
చంద్ర సంచార రాశి: సింహం
యోగాలు: లంబ యోగం - చికాకులు,
అపశకునం 16:59:12 వరకు తదుపరి
ఉత్పాద యోగం - కష్టములు, ద్రవ్య నాశనం
దిశ శూల: తూర్పు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. కపిల గీత - 209 / Kapila Gita - 209 🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. ప్రసాద్ భరధ్వాజ*
*🌴 5. భక్తి స్వరూపము - కాలమహిమ - 19 🌴*
*19. మద్ధర్మిణో గుణైరేతైః పరిసంశుద్ధ ఆశయః|*
*పురుషస్యాంజసాభ్యేతి శ్రుతమాత్రగుణం హి మామ్॥*
*తాత్పర్యము : ఈ విధముగా భాగవత ధర్మములను అనుష్ఠించు భక్తుని చిత్తము అత్యంత పరిశుద్ధమగును. పరమేశ్వరుని దివ్యగుణములను గూర్చి కేవలము విన్నంత మాత్రముననే అతడు అవలీలగా భగవత్ప్రాప్తిని పొందును.*
*వ్యాఖ్య : ఇలా పరిపూర్ణముగా నా ధర్మాలను, పరమాత్మను పొందడానికి కీర్తించడానికి దర్శించడానికి అన్ని ధర్మాలు ఆచరించే వారు ఈ గుణాలన్నీ కలిగి ఉంటారు. ఈ గుణాలన్నీ కలిగి ఉంటే మనసు పరిశుద్ధమవుతుంది. అలాంటి వాడు నా గుణములు విని ఎలాంటి నన్ను సాక్షాత్కరించుకోవాలని భావించాడో , అలాంటి గుణములు గల నన్ను చేరతారు. కానీ మనసుకున్న మురికి పోవాలంటే ఇవన్నీ చేయాలి. మనసు శుద్ధి అయిన తరువాత, "నేను ఇవన్నీ చేస్తున్నానని" వారికీ తెలియదు, పక్కవారికీ తెలియదు. "నేను ఇవన్నీ చేస్తున్నాను" అని చెప్పుకునే వాడు ధంభం కలవాడు. అలాంటి వారు చేసేది కొంగ జపమే.*
*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Kapila Gita - 209 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*
*🌴 5. Form of Bhakti - Glory of Time - 19 🌴*
*19. mad-dharmaṇo guṇair etaiḥ parisaṁśuddha āśayaḥ*
*puruṣasyāñjasābhyeti śruta-mātra-guṇaṁ hi mām*
*MEANING : When one is fully qualified with all these transcendental attributes and his consciousness is thus completely purified, he is immediately attracted simply by hearing My name or hearing of My transcendental quality.*
*PURPORT : In the beginning of this instruction, the Lord explained to His mother that mad-guṇa-śruti-mātreṇa, simply by hearing of the name, quality, form, etc., of the Supreme Personality of Godhead, one is immediately attracted. A person becomes fully qualified with all transcendental qualities by following the rules and regulations, as recommended in different scriptures. We have developed certain unnecessary qualities by material association, and by following the above process we become free from that contamination. To develop transcendental qualities, as explained in the previous verse, one must become free from these contaminated qualities.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 801 / Vishnu Sahasranama Contemplation - 801🌹*
*🌻801. అక్షోభ్యః, अक्षोभ्यः, Akṣobhyaḥ🌻*
*ఓం అక్షోభ్యాయ నమః | ॐ अक्षोभ्याय नमः | OM Akṣobhyāya namaḥ*
*రాగద్వేషాదిభిశ్శబ్దస్పర్శాదివిషయైరపి ।*
*త్రిదశారిభిరక్షోభ్య ఇత్యక్షోభ్య ఇతీర్యతే ॥*
*రాగము, ద్వేషము మొదలగు దోషముల చేతను; శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు అను జ్ఞానేంద్రియ విషయముల చేతను - త్రిదశుల అనగా దేవతల ఆరుల అనగా శత్రువుల చేతను కూడ క్షోభింప చేయబడడు, కలత పరచ బడడు.*
*999. అక్షోభ్యః, अक्षोभ्यः, Akṣobhyaḥ*
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 801🌹*
*🌻801. Akṣobhyaḥ🌻*
*OM Akṣobhyāya namaḥ*
रागद्वेषादिभिश्शब्दस्पर्शादिविषयैरपि ।
त्रिदशारिभिरक्षोभ्य इत्यक्षोभ्य इतीर्यते ॥
*Rāgadveṣādibhiśśabdasparśādiviṣayairapi,*
*Tridaśāribhirakṣobhya ityakṣobhya itīryate.*
*Not liable to be agitated by attachment, aversion etc., by sound and other external objects by enemies of the devas.*
*999. అక్షోభ్యః, अक्षोभ्यः, Akṣobhyaḥ*
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
सुवर्णबिंदुरक्षोभ्यस्सर्ववागीश्वरेश्वरः ।महाह्रदो महागर्तो महाभूतो महानिधिः ॥ ८६ ॥
సువర్ణబిందురక్షోభ్యస్సర్వవాగీశ్వరేశ్వరః ।మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానిధిః ॥ 86 ॥
Suvarṇabiṃdurakṣobhyassarvavāgīśvareśvaraḥ,Mahāhrado mahāgarto mahābhūto mahānidhiḥ ॥ 86 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 762 / Sri Siva Maha Purana - 762🌹*
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 16 🌴*
*🌻. దేవాసుర యుధ్ధము - 3 🌻*
*దైత్యులచే పీడింపబుడచున్న దేవతల దుఃఖములు మొదలగు వాటిని నశింపచేయుటలో వజ్రము వంటి వాడా! శేషశయ్యపై పరుండు వాడవు, సూర్యచంద్రులు నేత్రములుగా గల వాడవు అగు నీకునమస్కారము (18). దయానిధీ! లక్ష్మీపతీ! శరణు పొందిన మమ్ములను రక్షించుము. జలంధరుడు స్వర్గమునుండి దేవతల నందరినీ వెళ్లగొట్టినాడు (19). సూర్యచంద్రులను, అగ్నిని, యమధర్మరాజును అతడు తమ తమ స్ధానములనుండి వెళ్లగొట్టినాడు. పాతాళమునుండి వాసుకిని తరిమివేసినాడు (20). మానవులు వలె తిరుగాడు చున్న దేవతలలో శోభ అంతరించినది. మేము నిన్ను శరణు పొందుచున్నాము. వానిని వధించు ఉపాయమును ఆలోచించుము (21).*
*సనత్కుమారుడిట్లు పలికెను - దేవతల ఈ దీనాలాపములను విని కరుణా సముద్రుడగు మధుసూదనుడు మేఘంగంభీరమగు వాక్కుతో నిట్లనెను (22).*
*విష్ణువు ఇట్లు పలికెను - ఓ దేవతలారా! భయమును విడనాడుడు. నేను యుద్ధయునకు వెళ్లి, జలందరాసురునకు నా పరాక్రమమును చూపించెదను (23). భక్త ప్రియుడు, రాక్షసశత్రువు అగు విష్ణువు ఇట్లు పలికి దయచే దుఃఖితమైన మనస్సు గలవాడై శీఘ్రముగా గరుడుని అధిష్ఠించెను (24). సముద్రపుత్రియగు లక్ష్మి దేవతలతో గూడి వెళ్లుచున్న తన భర్తను గాంచి కన్నీళ్లతో చేతులను జోడించి ఇట్లు పలికెను (25).*
*లక్ష్మి ఇట్లు పలికెను - ఓ నాథా! నేను నీకు ప్రియురాలనైనచో, నేను ఎల్లవేళలా నీకు భక్తురాలనైనచో, ఓ దయాసముద్రా! నా సోదరుని నీవు యుద్దములోఎట్లు వధించగల్గుదువు? (26).*
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 762🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *
*🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 16 🌴*
*🌻 The battle of the gods - 3 🌻*
18. O thunderbolt for the destruction of misery etc. of the gods harassed by the Asuras. Obeisance to you lying on the Serpent-bed[4]. Obeisance to the one who has sun and the moon for his eyes.
19. O lord of Lakṣmī, O ocean of mercy, save us who have sought refuge in you. All the gods have been driven out of heaven by Jalandhara.
20. The sun has been dislodged from his post. Similarly the moon and the fire too have been removed. The Serpent-king has been removed from Pātāla and Dharmarāja has been dispossessed.
21. While men freely move about, the gods do not shine. We have sought refuge in you. Let measures for his annihilation be thought of.
Sanatkumāra said:—
22. On hearing these piteous entreaties of the gods, Viṣṇu the slayer of Madhu, the ocean of mercy, spoke in a thundering voice.
Viṣṇu said:—
23. “O gods, cast off your fear. I shall come to the battle-ground. I shall show my valour to Jalandhara.”
24. Having said this with distressed mind, Viṣṇu the enemy of the Asuras got up quickly. The god Viṣṇu who is favourably disposed to his devotees immediately mounted his vehicle Garuḍa.
25. On seeing her lord departing along with the gods, Lakṣmī, the daughter of the ocean, spoke with palms joined in reverence and tears welling up in the eyes.
26. “O lord, I am your beloved. If I am always devoted to you, O storehouse of mercy, how does my brother’s death be at your hands.
Continues....
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
.
*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 16 / Osho Daily Meditations - 16 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🍀 16. విభజించబడిన శరీరం 🍀*
*🕉. ఆదిమ సమాజంలో మొత్తం శరీరం అంగీకరించ బడుతుంది. ఖండించడం లేదు. ఏదీ తక్కువ కాదు ఏదీ ఎక్కువ కాదు. ప్రతిదీ కేవలం ఉంది. 🕉*
*శరీరాన్ని అంగీకరించడంలో యోగా అంత దూరం వెళ్లదు. ఇది మిమ్మల్ని చాలా నియంత్రణలో ఉంచుతుంది అయితే ప్రతీ నియంత్రణ ఒక విధమైన అణచివేత. కాబట్టి మీరు అణచివేసి, అణచివేత గురించి మరచిపోతారు. ఇవి కడుపులోకి వెళ్లి డయాఫ్రాగమ్ దగ్గర అణచివేయబడిన వస్తువులన్నీ సేకరిస్తాయి. మీరు వస్తువులను విసిరివేయగలిగే ఏకైక స్థలం కడుపు; మరెక్కడా ఖాళీ లేదు. మీ నియంత్రణ పేలిన రోజు, మీరు చాలా స్వేచ్ఛగా, సజీవంగా ఉంటారు. మీరు పునర్జన్మ అనుభూతి చెందుతారు, ఎందుకంటే ఇది మీ విభజించబడిన శరీరాన్ని కలుపుతుంది. డయాఫ్రాగమ్ అనేది శరీరం ఎగువ మరియు దిగువ మధ్య విభజించబడిన ప్రదేశం.*
*పాత మత బోధనలన్నింటిలో, దిగువది ఖండించబడింది మరియు పైభాగం ఉన్నతమైనదిగా, పవిత్రమైనదిగా చూడబడుతుంది. అది కాదు. శరీరం ఒకటి, మరియు ఈ విభజన ప్రమాదకరమైనది; అది మిమ్మల్ని విడిపోయేలా చేస్తుంది. మీరు జీవితంలో చాలా విషయాలను తిరస్కరించారు. మీ జీవితం నుండి మీరు దేనిని మినహాయించినా ఏదో ఒక రోజు దానికి ప్రతీకారం తీర్చుకుంటుంది. ఇది ఒక వ్యాధిగా వస్తుంది. ఇప్పుడు కొందరు వైద్య పరిశోధకులు క్యాన్సర్ అనేది లోపల చాలా ఒత్తిడి తప్ప మరొకటి కాదు. క్యాన్సర్ చాలా అణచివేయబడిన సమాజాలలో మాత్రమే ఉంటుంది. ఎంత నాగరికత, సంస్కారవంతమైన సమాజం ఉంటే అంత క్యాన్సర్ సాధ్యమవుతుంది. ఆదిమ సమాజంలో ఇది ఉనికిలో ఉండదు, ఎందుకంటే ఆదిమ సమాజంలో మొత్తం శరీరం అంగీకరించబడుతుంది. ఖండించడం లేదు. ఏదీ తక్కువ కాదు, ఏదీ ఎక్కువ కాదు. ప్రతిదీ కేవలం ఉంది.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Osho Daily Meditations - 16 🌹*
📚. Prasad Bharadwaj
*🍀16. THE DIVIDED BODY 🍀*
*🕉 In a primitive society the whole body is accepted. There is no condemnation. Nothinq is lower and nothing is higher. Everything simply is. 🕉*
*In accepting the body, yoga does not go far enough. It makes you very controlled, and every sort of control is a sort of repression. So you repress and then you forget all about the repression. It moves into the stomach, and near the diaphragm all those repressed things collect. The stomach is the only space where you can go on throwing things; nowhere else is there any space. The day your control explodes, you will feel so free, so alive. You will feel reborn, because it will connect your divided body. The diaphragm is the place where the body is divided between the upper and lower.*
*In all the old religious teachings, the lower is condemned and the upper is made to be something high, something superior, something holier. It is not. The body is one, and this bifurcation is dangerous; it makes you split. By and by you deny many things in life. Whatever you exclude from your life will take its revenge some day. It will come as a disease. Now some medical researchers say that cancer is nothing but too much stress inside. Cancer only exists in very repressed societies. The more civilized and cultured a society, the more cancer is possible. It cannot exist in a primitive society, because in a primitive society the whole body is accepted. There is no condemnation. Nothing is lower and nothing is higher. Everything simply is.*
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 465 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 465 - 2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 96. సుముఖీ, నళినీ, సుభ్రూః, శోభనా, సురనాయికా ।*
*కాలకంఠీ, కాంతిమతీ, క్షోభిణీ, సూక్ష్మరూపిణీ ॥ 96 ॥ 🍀*
*🌻465. 'క్షోభిణీ' - 2 🌻*
*జీవులకు జీవుల రూపముననే క్షోభ కలిగించును. కర్మానుభవము కలిగించుటకు శ్రీమాత క్షోభిణి రూపమున తీరుబడి లేక పనిచేయుచున్న దనిపించును. పీత నుండి జగత్పిత వరకందరిని కార్యోన్ముఖులను చేయుచు మత్తు గలవారిని శిక్షించుచు, ప్రమత్తులైన వారిని మేల్కొలుపుచు, అప్రమత్తులైన వారిని ప్రోత్సహించుచు సృష్టికార్యము జీవుల కొరకు నిర్వర్తించుచుండును. శ్రీమాత కలత పెట్టుటలోను, కలవర పరచుటలోను, క్షోభ కలిగించుటలోను జీవహితమై యున్నదని తెలియవలెను. ఆమె అందించు శిక్షకూడ శిక్షణ కొఱకే. తల్లి విధించు దండన బిడ్డ బాగు కొఱకే కదా! బిడ్డలకు అప్పుడప్పుడు తల్లి క్షోభ కలిగించినట్లు కనిపించును గాని, నిజమునకు క్షోభ కలిగించదు. అట్లే శ్రీమాత క్షోభ కూడను. ఆమె క్షోభకు ఎవ్వరునూ అతీతులు కారు.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 465 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*
*🌻 96. Sumukhi nalini subhru shobhana suranaeika*
*Karikanti kantimati kshobhini sukshmarupini ॥ 96 ॥ 🌻*
*🌻465. 'Kshobhini' - 2 🌻*
*She causes distress to living beings in the form of living beings only. Srimata Ksobhini appears to work relentlessly to cause karmanubhava. From the crab to Jagatpitha, she makes all of them work hard, punishes the intoxicated, wakes up the sleepy, encourages the alert, and performs the work of creation for the sake of living beings. It should be known that Sri Mata is fond of upsetting, disturbing and causing trouble for the sake of training. The punishment imposed by the mother is for his own benefit! Sometimes the mother seems to cause distress to the children, but in reality it does not cause distress. Same is the case with sri Mata. No one is immune to her misery.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
Commentaires