top of page
Writer's picturePrasad Bharadwaj

🌹 24, FEBRUARY 2023 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు 🌹

🍀🌹 24, FEBRUARY 2023 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు 🌹🍀

1) 🌹 24, FEBRUARY 2023 FRIDAY, శుక్రవారం, బృగు వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹

2) 🌹. శ్రీమద్భగవద్గీత - 331 / Bhagavad-Gita -331 🌹 🌴 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం / Akshara Brahma Yoga - 21 వ శ్లోకము 🌴

4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 178 / Agni Maha Purana - 178 🌹 🌻. లింగమానాదివ్యక్తావ్యక్త లక్షణములు - 5 / The dimensions of different varieties of the Liṅga - 5 🌻

4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 043 / DAILY WISDOM - 043 🌹 🌻 12. ప్రతి ఒక్కరూ ఏదో ఒక అసంపూర్ణతతోనే వెళతారు. / 12. Everyone Goes with Something Left Incomplete 🌻

5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 307 🌹

6) 🌹. శివ సూత్రములు - 45 / Siva Sutras - 45 🌹

🌻 15. హృదయే చిత్తసంఘటాత్‌ దృశ్య స్వప దర్శనం - 1 / 15. Hṛdaye cittasaṃghaṭṭād dṛśyasvā padarśanam - 1 🌻


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹




*🌹24, ఫిబ్రవరి, February 2023 పంచాగము - Panchagam 🌹*

*శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday*

*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*


*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు🌻*


*🍀. శ్రీ మహాలక్ష్మీ సుప్రభాతం -33 🍀*


33. నమో ఆదిలక్ష్మి నమో జ్ఞానలక్ష్మి నమో ధాన్యలక్ష్మి నమో భాగ్యలక్ష్మి ।

మహాలక్ష్మి సన్తానలక్ష్మి ప్రసీద నమస్తే నమస్తే నమో శాన్తలక్ష్మి ॥


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నేటి సూక్తి : భౌతిక వస్తువులను అతిస్వల్ప కాలంలోనే నిర్లక్ష్యంగా పాడు చేయడం, చిందరవందర గావించడం, ఇంద్రియోద్వేగంచే గాని, తామసిక జడత్వంచే గాని భౌతిక వస్తువులను, సేవలను దుర్వినియోగం చెయ్యడం, దుబారా చెయ్యడం - ఈ లక్షణాలు అభ్యుదయానికి ప్రతిబంధకాలై లక్ష్మిని వెడల గొటుతాయి. 🍀*


🌷🌷🌷🌷🌷


శుభకృత్‌, శిశిర ఋతువు,

ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం

తిథి: శుక్ల పంచమి 24:32:52 వరకు

తదుపరి శుక్ల షష్టి

నక్షత్రం: అశ్విని 27:28:16 వరకు

తదుపరి భరణి

యోగం: శుక్ల 18:47:06 వరకు

తదుపరి బ్రహ్మ

కరణం: బవ 13:01:54 వరకు

వర్జ్యం: 23:30:00 - 25:04:48

దుర్ముహూర్తం: 08:58:29 - 09:45:21

మరియు 12:52:49 - 13:39:41

రాహు కాలం: 11:01:31 - 12:29:23

గుళిక కాలం: 08:05:46 - 09:33:38

యమ గండం: 15:25:08 - 16:53:00

అభిజిత్ ముహూర్తం: 12:06 - 12:52

అమృత కాలం: 20:20:24 - 21:55:12

సూర్యోదయం: 06:37:54

సూర్యాస్తమయం: 18:20:52

చంద్రోదయం: 09:32:06

చంద్రాస్తమయం: 22:24:47

సూర్య సంచార రాశి: కుంభం

చంద్ర సంచార రాశి: మేషం

యోగాలు: వజ్ర యోగం - ఫల ప్రాప్తి

27:28:16 వరకు తదుపరి ముద్గర

యోగం - కలహం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నిత్య ప్రార్థన 🍀*

*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*

*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*

*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*

*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*

*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*

*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీమద్భగవద్గీత - 331 / Bhagavad-Gita - 331 🌹*

*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం - 21 🌴*


*21. అవ్యక్తోక్షర ఇత్యుక్తస్తమాహు: పరమాం గతిమ్ |*

*యం ప్రాప్య న నివర్తన్తే తద్ధామ పరమం మమ ||*


🌷. తాత్పర్యం :

*వేదాంతులు దేనిని అవ్యక్తము, అక్షరమని వర్ణింతురో, ఏది పరమగమ్యస్థానముగా తెలియబడుచున్నదో, ఏ స్థానమును పొందిన పిమ్మట మనుజుడు వెనుకకు తిరిగిరాడో అదియే నా దివ్యధామము.*


🌷. భాష్యము :

దేవదేవుడైన శ్రీకృష్ణుని దివ్యధామము సర్వకోరికలు ఈడేరునటువంటి “చింతామణి” ధామముగా బ్రహ్మసంహిత యందు వర్ణింపబడినది. గోలోకబృందావనముగా తెలియబడు ఆ శ్రీకృష్ణదామము చింతామణి భరితమైన సౌధములతో అలరారుచుండును.


కోరిన ఎత్తి భక్ష్యమునైనను సమకూర్చు కల్పవృక్షములను మరియు అక్షయముగా పాలనొసగు సురభినామ గోవులను కలిగియుండెడి ఆ ధామమున శ్రీకృష్ణుడు లక్షలకొలది లక్ష్ములచే సేవించబడుచుండును. ఆదిదేవుడును మరియు సర్వకారణకారణుడును అగు గోవిందునిగా అచ్చట అతడు పిలువబడును.


మధురముగా వేణువునూదును (వేణుంక్వణన్తమ్) అతని దివ్యరూపము సర్వజగన్మోహనమై యుండును. అతని కన్నులు కలువపూల రెక్కలను బోలి, దేహఛాయ నీలమేఘవర్ణమును బోలియుండును.


పరమాకర్షకుకుడైన అతని సౌందర్యము వేలాది మన్మథులను అతిశయించునంత మనోహారముగా నుండును. పీతాంబారమును ధరించియుండు ఆ భగవానుడు మెడలో దివ్యమైన పూమాలను, శిరమున పింఛమును దాల్చియుండును.


ఆధ్యాత్మికజగమున అత్యంత ఉన్నతమైన తన ధామము (గోలోకబృందావనము) గూర్చి శ్రీకృష్ణుడు భగవద్గీత యందు ఇచ్చట సూచనగా మాత్రమే తెలిపియున్నాడు. దాని విస్తృతవివరణము బ్రహ్మసంహిత యందు ఒసగబడినది.


భగవద్ధామమునకు పరమైనది వేరొకటి లేదనియు, అదియే పరమగమ్యస్థానమనియు వేదవాజ్మయము (కఠోపనిషత్తు 1.3.11) తెలియజేయుచున్నది (పురుషాన్నపరం కిఞ్చిత్ సా కాష్టా పరమా గతి:).


దానిని పొందినవాడు ఈ భౌతికజగమునకు తిరిగిరాదు. ఒకే లక్షణములను కలిగియున్నందున ఆ ధామమును మరియు శ్రీకృష్ణునకు ఎట్టి భేదము లేదు.

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Bhagavad-Gita as It is - 331 🌹*

*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*


*🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 21 🌴*


*21 . avyakto ’kṣara ity uktas tam āhuḥ paramāṁ gatim*

*yaṁ prāpya na nivartante tad dhāma paramaṁ mama*


🌷 Translation :

*That which the Vedāntists describe as unmanifest and infallible, that which is known as the supreme destination, that place from which, having attained it, one never returns – that is My supreme abode.*


🌹 Purport :

The supreme abode of the Personality of Godhead, Kṛṣṇa, is described in the Brahma-saṁhitā as cintāmaṇi-dhāma, a place where all desires are fulfilled. The supreme abode of Lord Kṛṣṇa, known as Goloka Vṛndāvana, is full of palaces made of touchstone.


There are also trees, called “desire trees,” that supply any type of eatable upon demand, and there are cows, known as surabhi cows, which supply a limitless supply of milk.


In this abode, the Lord is served by hundreds of thousands of goddesses of fortune (Lakṣmīs), and He is called Govinda, the primal Lord and the cause of all causes. The Lord is accustomed to blow His flute (veṇuṁ kvaṇantam).


His transcendental form is the most attractive in all the worlds – His eyes are like lotus petals, and the color of His body is like the color of clouds. He is so attractive that His beauty excels that of thousands of Cupids.


He wears saffron cloth, a garland around His neck and a peacock feather in His hair. In the Bhagavad-gītā Lord Kṛṣṇa gives only a small hint of His personal abode, Goloka Vṛndāvana, which is the supermost planet in the spiritual kingdom.


A vivid description is given in the Brahma-saṁhitā. Vedic literatures (Kaṭha Upaniṣad 1.3.11) state that there is nothing superior to the abode of the Supreme Godhead, and that that abode is the ultimate destination (puruṣān na paraṁ kiñcit sā kāṣṭhā paramā gatiḥ).


When one attains to it, he never returns to the material world. Kṛṣṇa’s supreme abode and Kṛṣṇa Himself are nondifferent, being of the same quality.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 178 / Agni Maha Purana - 178 🌹*

*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*

*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*

*ప్రథమ సంపుటము, అధ్యాయము - 54*


*🌻. లింగమానాదివ్యక్తావ్యక్త లక్షణములు - 5 🌻*


మూర్ధాన్తభాగము భూతభాగేశ్వరునిది. వ్యక్త-అవ్యక్తలింగములన్నింటికిని ఇదే పద్ధతి. ఐదులింగముల ఏర్పాటున్న శివలింగమునకు గుండ్రముగ చేయవలెను. ఈ గోలాకారము ఛత్రమువలె నుండవచ్చును, కోడిగుడ్డువలె నుండవచ్చును, లేదా నవోదితచంద్రువలె ఉండవచ్చును. కామ్యభేదమును పట్టి నాలుగువిధములగు ఫలభేదములను చెప్పుచున్నాను. లింగము శిరోవిస్తారము ఎన్ని అంగుళములుండునో ఆ సంఖ్యను ఎనిమిదిచే భాగించవలెను. ఈ విధముగ శిరస్సును ఎనిమిదిభాగములుగ విభజించి మొదటి నాలుగుభాగములును విస్తార-ఔన్నత్యముల ననుసరించి గ్రహింపవలెను. ఒక భాగమును తీసివేయగా ''పుండరీకము'' అను లింగము, రెండుభాగములను తీసివేయగా, 'విశాలము' అనులింగము, మూడు భాగమునులను తీసివేయగా ''శ్రీవత్సము'' అనులింగము, నాలుగుభాగములను తీసివేయగా ''శత్రుకారలింగము'' ఏర్పడును. అన్ని ప్రక్కలనుండియు శిరోభాగము సమముగనున్నది శ్రేష్ఠము. దేవపూజ్య లింగము నందు లింగశిరోభాగము కుక్కుటాండమువలె గోలాకారమున నుండవలెను.


చతుర్భాగాత్మక లింగమునందు పై రెండు భాగములను తొలగించగా ''త్రపుష'' మను లింగ మేర్పడును. ఇది అనాఢ్యమను శివలింగముయొక్క శిరస్సుగా చెప్పబడుచున్నది. ఇపుడు అర్ధచంద్రాకార శిరస్సు గూర్చి వినుము. శివలింగ ప్రాంతభాగమునందు ఒక అంశమును నాలుగు అంశములచేసి ఒక అంశమును విడిచినచో దానికి ''అమృతాక్షరము'' అని పేరు. రెండవ- మూడవ- నాల్గవ అంశములను తొలగింపగా క్రమముగ వాటికి ''పూర్ణేందు'' ''బాలేన్దు'' ''కుముద''ము లని పేర్లు. ఇవి క్రమముగ చతుర్ముఖ- త్రిముఖ-ఏకముఖములు. ఈ మూడింటికి "ముఖలింగము" లని కూడ పేర్లు.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Agni Maha Purana - 178 🌹*

*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *


*Chapter 54*

*🌻The dimensions of different varieties of the Liṅga - 5 🌻*


34. (From the navel) upto the head is the part of Śiva. Similarly, it is in the case of distinct and indistinct forms. In the liṅga of five parts, the head part is said to be circular.


35. The images (may be) of the shape of an umbrella, cock or crescent moon. I shall describe the merits of the four varieties. in each (class) differing on account of one’s option.


36. The head portion (of the liṅga) should be divided into eight parts. The first part of the longitudinal portion should be divided into four parts.


37- 39. There (should be) four lines successively drawn in order to divide into parts. We have by one part the lotus, the one called viśāla by cutting off, the śrīvatsa by thinning out and the śatrukṛt by elision of the fourth part. In the sarvasama class the top portion is the excellent and the cock-shaped in the sura class among the liṅga of four parts. The top portion of the anādi has been described. You lisṭen to (the characteristics of) the crescent of the top.


40. At a corner of a part (there should be) the charming axis (represented) by four parts deficient by one part. By the elision of two, three and four parts in order, (one gets) the full, crescent moon and lotus shape.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 43 / DAILY WISDOM - 43 🌹*

*🍀 📖. యోగా యొక్క తత్వశాస్త్రం నుండి 🍀*

*✍️. ప్రసాద్ భరద్వాజ*


*🌻 12. ప్రతి ఒక్కరూ ఏదో ఒక అసంపూర్ణతతోనే వెళతారు. 🌻*


*చాలా సార్లు, మనం ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్తున్నప్పుడు ఏదో ఒక నిరాశతోనే వెళ్తామని అనిపిస్తుంది. మానవుల మానసిక చరిత్ర అంటూ ఒకటి ఉంటే, అది మనం చదివితే, ఎక్కడో అత్యంత పుణ్యాత్ములు తప్ప ఈ ప్రపంచాన్ని సంతృప్తి తో విడిచి వెళ్లిన వారు నూటికోకోటికో ఒక్కరు ఉంటారు. ఏదో ఒక అసంతృప్తి, పూర్తి చేయాల్సిన పని, అందరికీ మిగిలిపోతుంది.*


*ప్రతి ఒక్కరూ ఏదో ఒక అసంపూర్ణతతోనే వెళతారు. ఇది ఎప్పటికీ పూర్తికాదు. ఇది భౌతిక జీవితం యొక్క బాధాకరమైన పార్శ్వం. భౌతిక జీవితం అంటే మనకు చిత్రీకరించబడిన చిత్రం ఇదే. కానీ మన లోపల మనకు ఓదార్పు ను సంతృప్తిని కలిగించే ఒక మూలం ఉంది. దీని ఆభాస మనకు అంత తరచుగా రాదు. మనలో ప్రతి ఒక్కరిలో ఏదో ఉంది, అది మన దృష్టిగోచరం కాకుండా ఉంటోంది.*


*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 DAILY WISDOM - 43 🌹*

*🍀 📖 Philosophy of Yoga 🍀*

📝 Swami Krishnananda

📚. Prasad Bharadwaj


*🌻 12. Everyone Goes with Something Left Incomplete 🌻*


*It looks, many a time, that we have to pass away from this world in despair with everything. If we read the history of the minds of human beings, if there is any such thing as a history of psychology of human nature as such, we will be surprised to observe that it is impossible to pinpoint even one individual who has left this world with genuine satisfaction, save those few who are the salt of the Earth. There has always been a gap, an unfinished something with which the person had to quit.*


*Everyone goes with something left incomplete. It will never be finished. This is the seamy side of things, the unhappy facet of life, which seems to be the outer picture of this world painted before us. But we have also a peculiar solacing and satisfying inner core, which always eludes our grasp. There is something in us, in each one of us, which escapes our notice.*


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 308 🌹*

*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*


*🍀. జీవితం అర్థరహితం కాదు. అసాధారణమయిన విలువ కలిగింది. కానీ దాన్ని మనం కనిపెట్టాలి. ధ్యానం కిటికీలు తెరిచి దేవుణ్ణి చూపిస్తుంది. కాంతి నిస్తుంది. 🍀*


*ప్రేమ దేవుడికి సంబంధించిన అంతిమ అనుభవం. అస్తిత్వం అర్థరహితం కాదని ప్రేమ నిరూపిస్తుంది. జీవితం అర్థవంత మయిందని చూపిస్తుంది. ప్రేమను అనుభవానికి తెచ్చుకోని వ్యక్తి జీవితం అర్థరహిత మనుకుంటాడు. యాదృచ్ఛిక మనుకుంటాడు. అజ్ఞాత, అచేతనమయిన సహజశక్తుల దయాదాక్షిణ్యాలు అనుకుంటాడు. భౌతికవాదులు జీవితాన్ని చూసే విధానమది. కేవలం పదార్థాల సమ్మేళనం అనుకుంటారు.*


*అప్పుడు జీవితం అర్థరహితం. అర్థరహితమైన, ప్రాముఖ్యత లేని జీవితం పాట పాడలేదు. నాట్యమాడలేదు. అర్థవంతం కాని జీవితాన్ని పిరికివాళ్ళు మాత్రమే బతుకుతారు. జీవితం అర్థరహితం కాదు. అసాధారణమయిన విలువ కలిగింది. కానీ దాన్ని మనం కనిపెట్టాలి. ప్రేమ నీకు మార్గాల్ని చూపిస్తుంది. కాంతి నిస్తుంది. ధ్యానపు ఛాయల్ని ప్రదర్శిస్తుంది. ధ్యానం కిటికీలు తెరిచి దేవుణ్ణి చూపిస్తుంది.*


*సశేషం ...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శివ సూత్రములు - 045 / Siva Sutras - 045 🌹*

*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*

*1- శాంభవోపాయ*

*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*


*🌻 15. హృదయే చిత్తసంఘటాత్‌ దృశ్య స్వప దర్శనం - 1 🌻*

*🌴. మనస్సును దాని కేంద్రములో ఉంచడం ద్వారా అవగాహన చేసుకొను శూన్యతను గ్రహించ వచ్చు.🌴*


*హృదయే - అవగాహన లేదా చైతన్యం యొక్క సారాంశం; చిత్త - మనస్సు; సంఘట్త- సంగత్వము; దృశ్య - కనిపించే ప్రపంచం; స్వప - కలలు కనే స్థితి (సూత్ర 9); దర్శనం - ప్రదర్శన ద్వారా కనిపించడం.*


*చైతన్యంతో మనస్సు కలిసి ఉన్నప్పుడు, కనిపించే ప్రపంచం స్వప్న స్థితిలో ఉన్నట్లుగా కనిపిస్తుంది, ఇక్కడ వస్తుమయ ప్రపంచం ఉనికిలో ఉండదు అని సూత్రం చెబుతుంది. అత్యున్నత స్థాయి చైతన్యంలో, సాధకుడు శూన్య స్థితిలో ఉన్నట్లుగా వస్తుమయ ప్రపంచం అదృశ్యమవుతుంది. శూన్యం అనేది మిగతావాటన్నిటినీ తిరస్కరించే స్థితి. ఇంద్రియాల నుండి ఉద్భవించిన ఆలోచనలతో మనస్సు కలవరపడకుండా ఉంటేనే అలాంటి స్థితి సాధ్యమవుతుంది.*


*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Siva Sutras - 045 🌹*

*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*

Part 1 - Sāmbhavopāya

*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*


*🌻 15. Hṛdaye cittasaṃghaṭṭād dṛśyasvā padarśanam - 1 🌻*

*🌴. By fixing the mind on its core one can comprehend perceivable emptiness.🌴*


*Hṛdaye - the essence of awareness or consciousness; citta - mind; saṃghaṭṭa - union; dṛśya - visible, the visible world; svāpa - the dreaming state (sūtrā 9); darśana - becoming visible through appearance.*


*The sūtrā says that when the mind is in conjunction with the essence of consciousness, the visible world appear as if in a dream state, where the objective world does not exist. In the highest level of consciousness, the objective world disappears as if the aspirant is in a state of nothingness. Nothingness or void is a state where everything else is negated. Such a state becomes possible only if the mind is not afflicted with thoughts originated from the senses.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

#నిత్యసందేశములు #DailyMessages

Join and Share

Comments


bottom of page