top of page
Writer's picturePrasad Bharadwaj

🌹 24, JUNE 2023 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు 🌹

🍀🌹 24, JUNE 2023 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు 🌹🍀

1) 🌹 24, JUNE 2023 SATURDAY శనివారం, స్థిర వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹

2) 🌹. శ్రీమద్భగవద్గీత - 389 / Bhagavad-Gita - 389 🌹

🌴10వ అధ్యాయము - విభూతి యోగం - 17 / Chapter 10 - Vibhuti Yoga - 17 🌴

3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 236 / Agni Maha Purana - 236 🌹

🌻. స్నానతర్పణాది విధి కధనము - 1 / Mode of bathing and daily worship (snāna-viśeṣa) - 1 🌻

4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 101 / DAILY WISDOM - 101 🌹

🌻 10. యోగా అనేది వాస్తవికతతో కలయికగా నిర్వచించబడింది / 10. Yoga has been Defined as Union with Reality 🌻

5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 367 🌹

6) 🌹. శివ సూత్రములు - 103 / Siva Sutras - 103 🌹

🌻 2-07. మాతృక చక్ర సంబోధః   - 6 / 2-07. Mātrkā chakra sambodhah   - 6 🌻


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 24, జూన్‌, JUNE 2023 పంచాగము - Panchagam 🌹*

*శుభ శనివారం, Saturday, స్థిర వాసరే*

*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*


*🌻. పండుగలు మరియు పర్వదినాలు : స్కంద షష్టి, Skanda Sashti 🌻*


*🍀. శ్రీ వేంకటేశ సహస్రనామ స్తోత్రం - 03 🍀*

*04. కాలయంతా కాలగోప్తా కాలః కాలాంతకోఽఖిలః |*

కాలగమ్యః కాలకంఠ వంద్యః కాలకలేశ్వరః*

05. శంభుః స్వయంభూ రంభోజనాభిః స్తంభితవారిధిః |*

*అంభోధి నందినీ జానిః శోణాంభోజ పదప్రభః*


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నేటి సూక్తి : సగుణతత్వ విశిష్టత - నిర్గుణతత్వం తార్కికబుద్ధికీ, అచలాత్మకూ సంబంధించినది కాగా, సగుణతత్వం హృదయానికీ, శక్తి విలసనకూ సంబంధించినది. సగుణ తత్వాన్ని నిర్లక్ష్యం చేసేవా రొక ముఖ్యవస్తువును విస్మరిస్తున్నారనే చెప్పాలి. విశుద్ధమైన హృదయ ఆకాంక్షలచే అన్వేషించ బడునది తార్కిక బుద్ధి గోచరమైన సత్య నిరూపణల కంటే విలువలో యేమాత్రమూ తక్కువైనది కాదు. 🍀*


🌷🌷🌷🌷🌷


విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం,

ఆషాడ మాసం

తిథి: శుక్ల షష్టి 22:18:30 వరకు

తదుపరి శుక్ల-సప్తమి

నక్షత్రం: మఘ 07:19:09 వరకు

తదుపరి పూర్వ ఫల్గుణి

యోగం: సిధ్ధి 29:26:40 వరకు

తదుపరి వ్యతీపాత

కరణం: కౌలవ 09:06:35 వరకు

వర్జ్యం: 16:16:40 - 18:04:12

దుర్ముహూర్తం: 07:28:41 - 08:21:22

రాహు కాలం: 09:00:52 - 10:39:38

గుళిక కాలం: 05:43:20 - 07:22:06

యమ గండం: 13:57:11 - 15:35:57

అభిజిత్ ముహూర్తం: 11:52 - 12:44

అమృత కాలం: 04:37:00 - 06:25:00

మరియు 27:01:52 - 28:49:24

సూర్యోదయం: 05:43:20

సూర్యాస్తమయం: 18:53:29

చంద్రోదయం: 10:42:12

చంద్రాస్తమయం: 23:29:09

సూర్య సంచార రాశి: జెమిని

చంద్ర సంచార రాశి: సింహం

యోగాలు: పద్మ యోగం - ఐశ్వర్య

ప్రాప్తి 07:19:09 వరకు తదుపరి లంబ

యోగం - చికాకులు, అపశకునం

దిశ శూల: తూర్పు

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నిత్య ప్రార్థన 🍀*

*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*

*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*

*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*

*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*

*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*

*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీమద్భగవద్గీత - 389 / Bhagavad-Gita - 389 🌹*

*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 17 🌴*


*17. కథం విద్యామహం యోగింస్త్వాం సదా పరిచిన్తయన్ |*

*కేషు కేషు చ భావేషు చిన్త్యో(సి భగవన్మయా ||*


🌷. తాత్పర్యం :

*ఓ కృష్ణా! యోగీశ్వరా! నిన్ను సర్వదా నేనెట్లు చింతించగలను మరియు నిన్నెట్లు తెలిసికొనగలను? ఓ దేవదేవా! ఏ యే రూపములందు నున్ను స్మరింప వలెను?*


🌷. భాష్యము :

*గడచిన అధ్యాయమునందు తెలుపబడినట్లు దేవదేవుడైన శ్రీకృష్ణడు తన యోగమాయచే కప్పబడియుండును. కేవలము శరణాగతులైన మహాత్ములు మరియు భక్తులే అతనిని గాంచగలరు. ఇప్పుడు అర్జునుడు తన స్నేహితుడైన శ్రీకృష్ణుడు దేవదేవుడని సంపూర్ణముగా విశ్వసించినను, సామాన్యుడు సైతము ఏవిధముగా ఆ సర్వవ్యాపియైన భగవానుని అవగతము చేసికొనగలడో అట్టి సర్వసాధారణ పద్ధతిని తెలియగోరుచున్నాడు. యోగమాయచే కప్పబడినందున శ్రీకృష్ణుని సామాన్యజనులు (దానవులు మరియు నాస్తికులతో సహా) ఎరుగలేరు. కనుక వారి లాభము కొరకే అర్జునుడు ఈ ప్రశ్నలను అడుగుచున్నాడు. ఉన్నతుడైన భక్తుడు తన స్వీయావగాహన కొరకే గాక సమస్త మానవాళి అవగాహన కొరకై యత్నించును. కనుకనే భక్తుడును మరియు ఘనవైష్ణవుడును అగు అర్జునుడు కరుణాపూర్ణుడై తన ప్రశ్నచే భగవానుని సర్వవ్యాపకత్వమును సామాన్యుడు తెలియుటకు అవకాశమొసగుచున్నాడు. శ్రీకృష్ణుడు తనను ఆచ్చాదించియున్న యోగమాయకు ప్రభువైనందునే అర్జునుడు ఇచ్చట అతనిని “యోగిన్” అ ప్రత్యేకముగా సంబోధించినాడు.*


*అట్టి యోగమాయ కారణముననే ఆ భగవానుడు సామాన్యునకు గోచరింపకుండుట లేక గోచరించుట జరుగుచుండును. కృష్ణుని యెడ ప్రేమలేని సామాన్యమానవుడు అతనిని గూర్చి సదా చింతనను గావింపలేడు. కనుక అతడు భౌతికభావనముననే చింతింపవలసియుండును. అర్జునుడు భౌతికప్రవృత్తి కలిగిన జనుల ఆలోచనాధోరణిని పరిగణనకు తీసికొనుచున్నాడు. ఇచ్చట “కేషు కేషు చ భావేషు” అను పదములు భౌతికప్రవృతిని (భావ మనగా భౌతికవిషయములు) సూచించును. భౌతికప్రవృత్తి గలవారు శ్రీకృష్ణుని ఆధ్యాత్మికముగా అవగాహన చేసికొనలేనందున భౌతికములైనవానిపై మనస్సును కేంద్రీకరించి, భౌతికప్రాతినిధ్యముల ద్వారా ఏవిధముగా శ్రీకృష్ణుడు వ్యక్తమగుచున్నాడో గాంచవలసినదిగా ఉపదేశింపబడుదురు.*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Bhagavad-Gita as It is - 389 🌹*

*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*


*🌴 Chapter 10 - Vibhuti Yoga - 17 🌴*


*17. kathaṁ vidyām ahaṁ yogiṁs tvāṁ sadā paricintayan*

*keṣu keṣu ca bhāveṣu cintyo ’si bhagavan mayā*


🌷 Translation :

*O Kṛṣṇa, O supreme mystic, how shall I constantly think of You, and how shall I know You? In what various forms are You to be remembered, O Supreme Personality of Godhead?*


🌹 Purport :

*As it is stated in the previous chapter, the Supreme Personality of Godhead is covered by His yoga-māyā. Only surrendered souls and devotees can see Him. Now Arjuna is convinced that his friend, Kṛṣṇa, is the Supreme Godhead, but he wants to know the general process by which the all-pervading Lord can be understood by the common man. Common men, including the demons and atheists, cannot know Kṛṣṇa, because He is guarded by His yoga-māyā energy. Again, these questions are asked by Arjuna for their benefit. The superior devotee is concerned not only for his own understanding but for the understanding of all mankind. So Arjuna, out of his mercy, because he is a Vaiṣṇava, a devotee, is opening for the common man the understanding of the all-pervasiveness of the Supreme Lord. He addresses Kṛṣṇa specifically as yogin because Śrī Kṛṣṇa is the master of the yoga-māyā energy, by which He is covered and uncovered to the common man.*


*The common man who has no love for Kṛṣṇa cannot always think of Kṛṣṇa; therefore he has to think materially. Arjuna is considering the mode of thinking of the materialistic persons of this world. The words keṣu keṣu ca bhāveṣu refer to material nature (the word bhāva means “physical things”). Because materialists cannot understand Kṛṣṇa spiritually, they are advised to concentrate the mind on physical things and try to see how Kṛṣṇa is manifested by physical representations.*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 236 / Agni Maha Purana - 236 🌹*

*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*

*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*

*ప్రథమ సంపుటము, అధ్యాయము - 72*


*🌻. స్నానతర్పణాది విధి కధనము - 1 🌻*


*పరమేశ్వరుడు చెప్పెను: స్కందా! ఇపుడు నిత్యనైమిత్తికాది స్నానమును గూర్చియు, సంధ్యను గూర్చియు, ప్రతిష్ఠాసహితపూజను గూర్చియు చెప్పెదను, కత్తితో (లేదా 'ఫట్‌' అను అస్త్రమంత్రముతో) ఎనిమిది అంగుళముల లోతునుండి మట్టి త్రవ్వి, దానిని పూర్తిగా పైకి తీసికొని వచ్చి, ఆ మంత్రముతోడనే పూజించి, 'స్వాహా' మంత్రముతో ఆ మృత్తి కనుతటముపై ఉంచి, అస్త్రమంత్రముచే శోధింపవలెను. 'వషట్‌' మంత్రముచే దానినుండి తృణాదికమును తొలగించి 'హుమ్‌' అను మంత్రముచే దానిన మూడుభాగములు చేయవలెను. మొదటి భాగపు మట్టిని జలసహిత మైనదానిని నాభినుండి పాదములవరకు అవయవములకు పూయవలెను. దానిని కడిగివేసి, అస్త్రమంత్రముచే అభిమంత్రిత మగు రెండవభాగమునందలి, కాంతి గల మట్టితో మిగిలిన శరీరము నంతయు పూసి, రెండు చేతులతో చేవులు, ముక్కు మొదలగు ఇంద్రయరంధ్రములను మూసికొని, ఊపిరి బిగపట్టి, మనస్సులో కాలాగ్నితుల్య మగు తేజోమయాస్త్రమును ధ్యానించుచు నీటిలో మునకలు వేసి స్నానము చేయవలెను. దీనికి మలస్నాన మని పేరు.*


*ఈ స్నానము చేసిన పిదప నీటినుండి బైటకు వచ్చి, సంధ్య చేసిన పిమ్మట విధిస్నానము చేయవలెను. హృదయమంత్రముచే (నమః) అంకుశముద్రతో సరస్వత్యాది తీర్థములలో ఏదో ఒక తీర్థమును ఆకర్షించి, సంహారముద్రతో, దానిని తన సమీపమున నున్న జలాశయములో స్థాపింపవలెను. పిమ్మట మూడవభాగము మట్టి తీసికొని నాభి వరకు జలములో మునిగి, ఉత్తరాభిముఖుడై, ఎడమచేతిలో దానిని మూడు భాగములు చేయవలెను. దక్షిణ భాగమునం దున్న మట్టిని అంగన్యాస మంత్రములచే ఒక మారు అభిమంత్రించి, తూర్పున నున్న మట్టిని ''అస్త్రాయ ఫట్‌'' అని ఏడు పర్యాయములు జపించి అభిమంత్రించి, ఉత్తరభాగము మట్టిని ''ఓం నమః శివాయ'' అను మంత్రము పది పర్యాయములు జపించి అభిమంత్రించవలెను. పిమ్మట ఈ మృత్తికలనుండి కొంచెము కొంచెము గ్రహించి ''అస్త్రాయ హుం ఫట్‌'' అనుచు అన్ని దిక్కులందును చిమ్మవలెను. పిమ్మట ''ఓం నమః శివాయ'' అను శివమంత్రమును, ''ఓం సోమాయస్వాహా'' అను సోమమంత్రమును జపించుచు, నీటిలో తన భుజములు త్రిప్పి, దానిని శివతీర్థస్వరూపముము చేయవలెను; అంగన్యాస మంత్రములను జపించుచు దానిని శిరస్సునుండి పాదముల వరకు, మొత్తము శరీరముపై పూసికొనవలెను.*


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Agni Maha Purana - 236 🌹*

*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *


*Chapter 72*

*🌻 Mode of bathing and daily worship (snāna-viśeṣa) - 1 🌻*


The God said:

1. O Skanda! I shall describe the modes of bathing [snāna] and worship [pūja] after the installation [pratiṣṭhā ] everyday. Having bathed one should dig up eight fingers of earth with the sword.


2. The pit should be filled with the earth thus removed and it should be carried to the river bed and placed there. It should then be purified with the weapon.


3-5. The grass should be lifted up with the śikhā (tuft) (mantra) and divided into three with the armour (mantra). Having washed upto the navel and foot with one part of them, the other part should be burnt with the astra mantra and sprinkled all over the body. Having pressed the eyes with the hands one should remain immersed in the water for some time after controlling the. breath. One should contemplate in the heart, the weapon, radiant like the deadly fire. Having finished the mud bath [i.e., mala-snāna] in this way one should rise up from waters.


6-7. Having worshipped the astrasandhyā (the union of weapon), one should bathe according to the injunctions laid down [i.e., vidhi-snāna]. The sacred waters of the rivers Sarasvatī and others should be drawn into the heart with the (formation of) aṅkuśa-mudrā (a formation with the fingers resembling the goad). Having established it (there), one should collect the remaining mud formulating the saṃhāramudrā (posture with the fingers indicating destruction) and enter the navel-deep water.


8-9. (The remaining mud) should be made into three parts on the left palm facing the north. One part of it on the south once with the aṅga mantras, the next part with the (previous mantra) seven times and the one on the north with the Śiva mantra ten times and duly thus the parts should be sanctified. After having recited the mantra for the weapon ending with huṃ phaṭ, the first part (of the earth) should be scattered in all directions.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 101 / DAILY WISDOM - 101 🌹*

*🍀 📖 . ఆత్మ యొక్క ఆరోహణ నుండి 🍀*

*✍️. ప్రసాద్ భరద్వాజ*


*🌻 10. యోగా అనేది వాస్తవికతతో కలయికగా నిర్వచించబడింది 🌻*


*యోగం అనేది లోపల మరియు వెలుపల రెండు విభిన్న స్థాయిల వాస్తవికతల కలయికగా నిర్వచించబడింది. ఈ విధంగా, వర్ణ మరియు ఆశ్రమ నియమాలు మరియు క్రమశిక్షణల ద్వారా జీవితంలో విధులను నెరవేర్చడం ద్వారా, ఒక వ్యక్తి క్రమంగా బయటి నుండి లోపలికి, బాహ్య రూపాల నుండి విషయాల యొక్క లోతైన అర్థానికి, స్థూలం నుండి సూక్ష్మానికి, మరియు సూక్ష్మం నుండి ఉనికి యొక్క అంతిమ సారాంశం వరకు చేరుకుంటాడు.*


*ఇదే అనేక దశలలో: ధర్మ, అర్థ, కామ మరియు మోక్షం అనే నాలుగు పురుషార్థాలుగా; ఆధ్యాత్మిక, రాజకీయ, ఆర్థిక మరియు భౌతిక అధికారాన్ని కలిగి ఉన్న సమాజంలోని నాలుగు వర్ణాలుగా; అధ్యయనం మరియు క్రమశిక్షణ, వ్యక్తిగతంగా మరియు సామాజికంగా విధి నిర్వహణ, వైరాగ్యం, మరియు అత్యున్నత వాస్తవికతతో సహవాసం( సన్యాసం) అనే నాలుగు ఆశ్రమాలుగా వ్యక్తమైంది. ఈ విధంగా అన్నిటినీ కలుపుకుని, దేనినీ వదలకుండా ఒక పూర్తి జీవితం సంగ్రహించబడింది. వీటిని బాహ్య పరిణామ ప్రక్రియలో ఎదగడానికి నిరంతరం మనపై ఉండే ఒత్తిడి వల్ల ఏర్పడిన జీవిత స్థాయిలుగా చెప్పవచ్చు.*


*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 DAILY WISDOM - 101 🌹*

*🍀 📖 The Ascent of the Spirit 🍀*

📝 Swami Krishnananda

📚. Prasad Bharadwaj


*🌻 10. Yoga has been Defined as Union with Reality 🌻*


*Yoga has been defined as union with Reality in its different degrees of manifestation, both within and without. Thus, by the fulfilment of one’s functions in life through the laws and disciplines of varna and ashrama, one moves gradually from the outer to the inner—from the external forms to the deeper meaning of things—and rises upward, from the gross to the subtle, and from the subtle to the ultimate essence of existence.*


*The concepts of the four purusharthas, dharma, artha, kama and moksha; of the four varnas, the classes of society wielding spiritual, political, economic and manual power; of the four ashramas, the stages of study and discipline, performance of duty individually as well as socially, withdrawal from attachment to perishable things, and communion with the Supreme Reality; these sum up the total structure of life in its integrality, excluding nothing, and including everything in its most comprehensive gamut. The stages are the orders of life necessitated by the progressive emphasis which it receives in outward evolution.*


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 367 🌹*

*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*


*🍀. వాస్తవానికి, కల్పనకు మధ్య తేడా అంతగా లేదు. ప్రాచ్యం సత్యానికి సంబంధించిన నిర్వచనాన్ని కాలరహితంగా చేస్తుంది. ప్రపంచ వాస్తవం ప్రదర్శన మాత్రమే. 🍀*


*సత్యానికి నిర్వచనం శాశ్వతమైనది, అది శాశ్వతం కాదు, కేవలం వాస్తవం. సత్యం కాదు. నిజానికి వాస్తవానికి, కల్పనకు మధ్య తేడా అంతగా లేదు. క్షణకాలం సైతం వాస్తవం కల్పనగా వుండవచ్చు. ఇప్పుడు వాస్తవం కావచ్చు. అది కాల్పనిక సత్యం కావచ్చు. సత్య కల్పన కావచ్చు. అందుకనే తూర్పు దేశాలు చరిత్ర గురించి బాధపడవు. పట్టించుకోవు.*


*ఎందుకంటే చరిత్ర వాస్తవాల ఆధారంగా కలిగింది. పాశ్చాత్యం వాస్తవాల ఆధారంగా వున్నది. పాశ్చాత్య మనసు కాల స్పృహతో వుంటుంది. కాబట్టి ప్రాచ్యం సత్యానికి సంబంధించిన నిర్వచనాన్ని కాలరహితంగా చేస్తుంది. ప్రపంచ వాస్తవం ప్రదర్శన మాత్రమే. సినిమా ప్రొజెక్షన్ లాంటిది. తెర ఒక్కటే అక్కడ వాస్తవం. తెర దేవుడు. దానిపై సినిమా కదిలిపోతుంది. సినిమా క్షణికం. తెర శాశ్వతం.*


*సశేషం ...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శివ సూత్రములు - 103 / Siva Sutras - 103 🌹*

*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*

*2వ భాగం - శక్తోపాయ*

*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*


*🌻 2-07. మాతృక చక్ర సంబోధః   - 6 🌻*

*🌴. ఒక గురువు సహాయంతో, యోగి మాతృక చక్ర జ్ఞానాన్ని మరియు మంత్ర శక్తులను స్వీయ-శుద్ధి మరియు స్వీయ-సాక్షాత్కారం కోసం ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటాడు. 🌴*


*అతని అత్యున్నత స్థాయి చైతన్యం సంస్కృత వర్ణమాల యొక్క మొదటి అక్షరం అ (అ) ద్వారా సూచించబడుతుంది. అతని అత్యున్నత స్థాయి చైతన్యం యొక్క తుది ఫలితం అయిన ఆనంద స్థితిని ఆ (ఆ) ద్వారా సూచిస్తారు. అతని చైతన్యం యొక్క ఈ అసమానమైన స్థాయిని అనుత్తర అని కూడా పిలుస్తారు, ఇది ఆనందతో ముగుస్తుంది. ఇప్పుడు, శివ రెండు ముఖ్యమైన కదలికలు చేస్తాడు. ఈ రెండు కదలికలు అతని ఆనందకరమైన స్థితి చివరిలో జరుగుతాయి. ఈ రెండు కదలికలలో మొదటిది అతని సూక్ష్మ సంకల్పం లేదా ఇచ్ఛ. కానీ, గుణాలకు అతీతుడు కాబట్టి శివుడు ఈ దశలో దేనినీ కాంక్షించడు.*


*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Siva Sutras  - 103 🌹*

*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*

Part 2 - Śāktopāya.

*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*


*🌻 2-07. Mātrkā chakra sambodhah   - 6 🌻*

*🌴. With the help of an guru, a yogi gains the knowledge of matruka chakra and how to harness the mantra shaktis, for self-purification and self-realization.  🌴*


*His highest level of consciousness is represented by the first letter of Sanskrit alphabet a (अ) and the state of bliss that is the end result of His highest level of consciousness is represented by ā (आ). This unparalleled level of his consciousness is also known as anuttara, which culminates in ānanda. Now, Śiva makes two significant moves. These two moves happen at the end of His blissful state. The first of these two moves is His subtle will or the icchā. But, Śiva does not desire for anything at this stage, as He is beyond qualities.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Join and Share

🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹

Comments


bottom of page