🍀🌹 25, JULY 2023 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 25, JULY 2023 TUESDAY మంగళవారం, భౌమ వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 403 / Bhagavad-Gita - 403 🌹
🌴10వ అధ్యాయము - విభూతి యోగం - 31 / Chapter 10 - Vibhuti Yoga - 31 🌴
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 250 / Agni Maha Purana - 250 🌹
🌻. శివ పూజా విధి వర్ణనము - 6 / Mode of worshipping Śiva (śivapūjā) - 6 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 115 / DAILY WISDOM - 115 🌹
🌻 24. సంపూర్ణ స్థితికి తిరిగి వచ్చే మార్గం / 24. The Path of Return to the Absolute 🌻
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 381 🌹*
6) 🌹. శివ సూత్రములు - 117 / Siva Sutras - 117 🌹
🌻 2-07. మాతృక చక్ర సంబోధః - 20 / 2-07. Mātrkā chakra sambodhah - 20 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 25, జూలై, JULY 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు. 🌻*
*🍀. శ్రీ ఆంజనేయ సహస్రనామ స్తోత్రం - 13 🍀*
*26. లంకేశనిధనస్థాయీ లంకాదాహక ఈశ్వరః |*
*చంద్రసూర్యాగ్నినేత్రశ్చ కాలాగ్నిః ప్రలయాంతకః*
*27. కపిలః కపిశః పుణ్యరాతిర్ద్వాదశరాశిగః |*
*సర్వాశ్రయోఽప్రమేయాత్మా రేవత్యాదినివారకః*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : మానవులు ప్రేమించేది ఎందుకు? - మానవ స్నేహం, ప్రేమ. అనురాగం. సానుభూతి మున్నగునవి సామాన్యంగా ప్రాణకోశమందు ప్రతిష్ఠితములై వుంటాయి. వాటి కేంద్రంలో అహంకారం తిష్ఠవేసుకొని వుంటుంది. ఇతరుల నుండి ప్రేమను తిరిగి పొందడం కోసం, ఇతరుల తోడి సంసర్గం ద్వారా అహంకారాన్ని విస్తరింప జేసుకోడం కోసం, ప్రాణకోశ ప్రవృత్తుల పరస్పర వినిమయం ద్వారా తమ వ్యక్తిత్వాన్ని పెంపొందించు కోవడం కోసం మానవులు సామాన్యంగా ఇతరులను ప్రేమిస్తూ వుంటారు. 🍀*
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
వర్ష ఋతువు, దక్షిణాయణం,
శ్రావణ మాసం
తిథి: శుక్ల-సప్తమి 15:10:24 వరకు
తదుపరి శుక్ల-అష్టమి
నక్షత్రం: చిత్ర 24:04:36 వరకు
తదుపరి స్వాతి
యోగం: సిధ్ధ 15:02:12 వరకు
తదుపరి సద్య
కరణం: వణిజ 15:04:24 వరకు
వర్జ్యం: 06:50:40 - 08:34:00
మరియు 29:55:38 - 31:36:06
దుర్ముహూర్తం: 08:28:50 - 09:20:46
రాహు కాలం: 15:37:16 - 17:14:38
గుళిక కాలం: 12:22:32 - 13:59:54
యమ గండం: 09:07:47 - 10:45:09
అభిజిత్ ముహూర్తం: 11:57 - 12:47
అమృత కాలం: 17:10:40 - 18:54:00
సూర్యోదయం: 05:53:02
సూర్యాస్తమయం: 18:52:01
చంద్రోదయం: 11:48:29
చంద్రాస్తమయం: 23:41:46
సూర్య సంచార రాశి: కర్కాటకం
చంద్ర సంచార రాశి: కన్య
యోగాలు: ధ్వాo క్ష యోగం - ధన
నాశనం, కార్య హాని 24:04:36 వరకు
తదుపరి ధ్వజ యోగం - కార్య సిధ్ధి
దిశ శూల: ఉత్తరం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 403 / Bhagavad-Gita - 403 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 31 🌴*
*31. పవన: పవతాస్మి రామ: శస్త్రభృతామహమ్ |*
*ఝషాణాం మకరశ్చాస్మి శ్రోతసామస్మి జాహ్నవీ ||*
*🌷. తాత్పర్యం : నేను పవిత్రమొనర్చువానిలో వాయువును, శస్త్రధారులలో శ్రీరాముడను, జలజంతువులలో మకరమును, నదులలో గంగానదిని అయి యున్నాను.*
*🌻. భాష్యము : అతిపెద్దవైన జలజంతువులలో మకరము ఒకటి. అది నిక్కముగా మానవునకు ప్రమాదకరమైనది. అట్టి మకరము శ్రీకృష్ణునకు ప్రాతినిధ్యము వహించును.*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 403 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 10 - Vibhuti Yoga - 31 🌴*
*31. pavanaḥ pavatām asmi rāmaḥ śastra-bhṛtām aham*
*jhaṣāṇāṁ makaraś cāsmi srotasām asmi jāhnavī*
*🌷 Translation : Of purifiers I am the wind, of the wielders of weapons I am Rāma, of fishes I am the shark, and of flowing rivers I am the Ganges.*
*🌹 Purport : Of all the aquatics the shark is one of the biggest and is certainly the most dangerous to man. Thus the shark represents Kṛṣṇa.*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 250 / Agni Maha Purana - 250 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 74*
*🌻. శివ పూజా విధి వర్ణనము - 6 🌻*
*అమృత (ధేను) ముద్ర ప్రదర్శించి, తన ఆసనముపై పుష్ప ముంచి, లలాటముపై తిలకము ధరించి, మూల మంత్రముతో దేవతకు పుష్పము అర్పించవలెను. సాధకుడు - స్నాన - దేవతాపూజా - హోమ - భోజన - యజ్ఞా - నుష్ఠాన - యోగ సాధన - ఆవశ్యక జపసమయములందు, స్థిరబుద్ధి యై మౌనముగా ఉండవలెను, నాదపర్యంతము ప్రణవోచ్చారణముచేయుచు మంత్రశోధనము చేయవలెను. ఉత్తమసంస్కారముక్తుడై దేవపూజా ప్రారంభము చేయవలెను.*
*మూలగాయత్రి చేత గాని, రుద్ర గాయత్రిచేత గాని అర్ఘ్యపూజనము చేసి ఆ సామాన్యార్ఘ్యమును దేవతకు సమర్పింపవలెను. బ్రహ్మపంచకము (పంచగవ్యములు, కుశోదకముతో చేసిన బ్రహ్మకూర్చము) సిద్ధముచేసికొని, శివలింగమునుండి పుష్పనిర్మాల్యమును తీసివేసి, ఈశాన్యము నందు ''చండాయ నమః'' అని చెప్పుచు చుండునకు సమర్పించవలెను. బ్రహ్మపంచకముతో పిండికా శివలింగములకు స్నానము చేయించి, 'ఫట్' అని ఉచ్చరించుచు, మరల ఉదకముతో స్నానము చేయించవలెను. ''నమో నమః'' అని ఉచ్చరించుచు అర్ఘ్యపాత్రగతజలముతో ఆ శివలింగమునకు అభిషేకము చేయవలెను. ఇది లింగశోధన విధానము.*
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Agni Maha Purana - 250 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *
*Chapter 74*
*🌻 Mode of worshipping Śiva (śivapūjā) - 6 🌻*
38-39. After having shown the amṛtā mudrā (formation with fingers denoting non-decay) and putting flower on its seat and a mark on the forehead consecrated by the principal mantra (of the god) a bold man should remain perfectly silent at the time of bathing, worship of the god, (offering) oblation unto fire, eating, practising yoga and repetition of necessary (mantras).
40. The mantra should be purified by pronouncing the nāda (oṃ) at the end. That purified mantra should then be used in the worship along with the gāyatrī (mantra) and the general water of oblation should be offered.
41. After having repeated the brahmapañcaka[2], (the worshipper) should collect the garland from the liṅga and offer it to Caṇḍa in the north-eastern direction.
42. The purification of the liṅga consists in the washing of the pedestal and the liṅga with the water (consecrated) by the mantra of weapon and hṛdmantra and sprinkle with the water (for washing) from the vessel of arghya.
43. All the celestials should be worshipped for the purification of the self, the materials, the mantra and the liṅga. Hāṃ, Salutations to God Gaṇapati in the north-western direction. One should pay obeisance to the preceptor in the north-east.
44-45. One should worship the goddess of the seat (of the god) in the kūmaśilā (the tortoise form on the stone) as possessing complexion of the tender shoots and the seat of Śiva known as ananta (endless) should be worshipped as seated on the brahmaśilā along with the attendants of the god such as Vicitra-keśa, Kṛta and Tretā who form the seat and shoes as they were of divinity.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 115 / DAILY WISDOM - 115 🌹*
*🍀 📖 . ఆత్మ యొక్క ఆరోహణ నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🌻 24. సంపూర్ణ స్థితికి తిరిగి వచ్చే మార్గం 🌻*
*చైతన్యం యొక్క శాశ్వతత్వం దేశ కాల పరిస్థితుల్లో స్వీయ-సంరక్షణ మరియు స్వీయ-పునరుత్పత్తిగా వ్యక్తమవుతుంది. అవరోహణ అనేది మూడు పరిధుల్లో జరుగుతుంది. అవి మానసిక స్వీయ-ధృవీకరణ, భౌతిక స్వీయ-ధృవీకరణ మరియు శాశ్వతత కోసం తపన. ఈ మూడు ప్రవృత్తులు ఏకకాలంలో పనిచేస్తాయి. కానీ అనుకూలమైన పరిస్థితులలో ఒక నిర్దిష్ట సమయంలో మాత్రమే నిర్దిష్ట దశ వ్యక్తపరచబడుతుంది. తద్వారా మానసిక, భౌతిక ధృవీకరణ మరియు లైంగిక కోరిక వ్యక్తీకరణ అన్ని వాటి వాటి అనుకూల సమయాల్లో వ్యక్తీకరించబడతాయి.*
*ఇక్కడ సానుకూల పరిస్థితులు అనే విషయం గుర్తుంచుకోవాలి. మట్టిలోనికి విసిరిన విత్తనం మొలకెత్తడానికి అనుకూలమైన పరిస్థితులు కాలక్రమేణా వ్యక్తీకరించ బడినప్పుడు మాత్రమే అది మొలకెత్తుతుంది. ఇక్కడ చెప్పబడిన ఈ కీలకమైన అంశాన్ని ప్రత్యేకించి తమ జీవితాలను సంపూర్ణంగా ఆరోహణ మార్గంలో నడపడానికి అంకితం చేసిన వారు తప్పక గమనించాలి. ఈ విషయంపై కొంచెం అవగాహన అవసరం.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 115 🌹*
*🍀 📖 The Ascent of the Spirit 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
*🌻 24. The Path of Return to the Absolute 🌻*
*Self-preservation and self-reproduction are the spatio-temporal forms taken by the absolute character of the eternity of Consciousness. The ‘fall’ is a single act with the threefold downward pressure of psychic self-affirmation, physical self-affirmation and the urge for self-perpetuation. The threefold instinct acts simultaneously, only manifesting a particular phase at a particular time attended with favourable circumstances, so that the psychophysical affirmation and the sex urge, though they are present in the individual at all times hiddenly or expressedly.*
*Assume special emphasis under given conditions alone, even as a seed thrown into the soil germinates only when the conditions suited to its sprouting manifest themselves in the course of time. Here is a crucial point which has to be taken notice of particularly by those who have dedicated their lives to tread the ‘path of return’ to the Absolute, on which subject a little dilation of understanding is called for.*
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 381 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. కొంత మంది మాత్రమే హృదయంలో ధైర్యంగా జీవిస్తారు. వాళ్ళు మార్మికులు. వాళ్ళు చాలా దగ్గరి కొచ్చారు. ఒక్క పెద్ద అంగ వేస్తే అవ్యక్త స్థితికి చేరుతారు. 🍀*
*సమాజం 'తల' నించీ సృష్టింపబడింది. హృదయం వున్న మనుషులు సమాజంతో వినిమయం కలిగి వుండరు. సంబంధం కలిగి వుండరు. వాళ్ళను సమాజం పిచ్చి వాళ్ళంటుంది వాళ్ళ సమస్య అల్లా ప్రపంచంలోని తక్కిన వాళ్ళ కన్నా వాళ్ళలో 'స్థలం' ఎక్కువగా వుంటుంది. అది కళ్ళు లేని వాళ్ళ మధ్య కళ్ళున్న వాళ్ళు. వాళ్ళు నిరంతరం కష్టాల్లో వుంటారు. వాళ్ళ మాట ఎవరూ వినరు. వాళ్ళను ఎవరూ అర్థం చేసుకోరు. తప్పుగా అర్థం చేసుకుంటారు.*
*కాబట్టి కొంత మంది మాత్రమే హృదయంలో ధైర్యంగా జీవిస్తారు. వాళ్ళు మార్మికులు. వాళ్ళు చాలా దగ్గరికొచ్చారు. ఒక్క పెద్ద అంగవేస్తే అవ్యక్త స్థితికి చేరుతారు. ఆ అవ్యక్త స్థితి హృదయం కాదు, మనసు కాదు. శరీరం కాదు. వాటన్నిటిని దాటింది దాన్ని వివరించడానికి మాటలు చాలవు.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శివ సూత్రములు - 117 / Siva Sutras - 117 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*2వ భాగం - శక్తోపాయ*
*✍️. ప్రసాద్ భరధ్వాజ*
*🌻 2-07. మాతృక చక్ర సంబోధః - 20 🌻*
*🌴. ఒక గురువు సహాయంతో, యోగి మాతృక చక్ర జ్ఞానాన్ని మరియు మంత్ర శక్తులను స్వీయ-శుద్ధి మరియు స్వీయ-సాక్షాత్కారం కోసం ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటాడు. 🌴*
*ఒక వ్యక్తి యొక్క జ్ఞానం సాధారణంగా అతని శరీరం ద్వారా ప్రసరిస్తుంది మరియు శివునికి కూడా అదే సూత్రం వర్తిస్తుంది. అతని జ్ఞానం కారణంగా, అతను మహిమాన్వితుడు అవుతాడు. అతని వైభవం సాటిలేనిది. ఈ సమయంలో, మొత్తం పదహారు అచ్చులు, ఇరవై ఐదు హల్లులు మరియు ఎనిమిది ఉభాయాక్షరములు, మొత్తం నలభై తొమ్మిది అక్షరాల గురించి చర్చించబడుతుంది. ఈ అక్షరాల స్థానాన్ని మాతృక చక్రం అని పిలుస్తారు, ఇది తల్లి యొక్క చక్రం, ఆమె అన్ని వర్ణమాలలను కలిగి ఉండటమే కాకుండా పోషిస్తుంది కూడా.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Siva Sutras - 117 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 2 - Śāktopāya.
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*
*🌻 2-07. Mātrkā chakra sambodhah - 20 🌻*
*🌴. With the help of an guru, a yogi gains the knowledge of matruka chakra and how to harness the mantra shaktis, for self-purification and self-realization. 🌴*
*A person’s knowledge is generally radiated through his body and the same principle applies to Śiva. Because of His knowledge, He becomes grandeur. His splendour is of incomparable magnitude. At this point of discussion, all the sixteen vowels, twenty five consonants and eight semi-vowels, totalling to forty nine letters have been dealt with. The positioning of these letters is known as mātṛkā cakra, the wheel of the Mother, who not only owns but also nourishes all the alphabets.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
Comments