top of page
Writer's picturePrasad Bharadwaj

🌹 26, SEPTEMBER 2023 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🌹

Updated: Sep 26, 2023

🍀🌹 26, SEPTEMBER 2023 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🌹🍀

1) 🌹 26, SEPTEMBER 2023 TUESDAY మంగళవారం, భౌమ వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹

🍀. వామన జయంతి శుభాకాంక్షలు అందరికి, Vamana Jayanthi Good Wishes to All 🍀

2) 🌹. శ్రీమద్భగవద్గీత - 433 / Bhagavad-Gita - 433 🌹

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 19 / Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 19 🌴

3) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 794 / Sri Siva Maha Purana - 794 🌹

🌻. గణాధ్యక్షుల యుద్ధము - 5 / Description of the Special War - 5 🌻

4) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 46 / Osho Daily Meditations  - 46 🌹

🍀 47. పేదరికం / 47. POVERTY 🍀

5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 485 - 490 / Sri Lalitha Chaitanya Vijnanam - 485 - 490 🌹

🌻 485 to  490 నామములు / 485 to 490 Names 🌻


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 26, సెప్టెంబరు, SEPTEMBER 2023 పంచాంగము - Panchangam 🌹*

*శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే*

*🍀. వామన జయంతి శుభాకాంక్షలు అందరికి, Vamana Jayanthi Good Wishes to All 🍀*

*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*


*🌻. పండుగలు మరియు పర్వదినాలు : వామన జయంతి, Vamana Jayanthi 🌻*


*🍀. శ్రీ ఆంజనేయ సహస్రనామ స్తోత్రం - 22 🍀*


*44. నక్షత్రమాలీ భూతాత్మా సురభిః కల్పపాదపః |*

*చింతామణిర్గుణనిధిః ప్రజాద్వారమనుత్తమః*

*45. పుణ్యశ్లోకః పురారాతిః మతిమాన్ శర్వరీపతిః |*

*కిల్కిలారావసంత్రస్తభూతప్రేతపిశాచకః*


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నేటి సూక్తి : ఆధ్యాత్మిక విషయాల్లో మానస తర్కం ప్రమాదకరం - మానవులందరూ బ్రహ్మమే కదాయని, అందరి యెడలా ఒకే తీరుగా వ్యవహరిస్తే, ఫలితం చాలఘోరంగా తయారవుతుంది. కర్కశమైన మానసిక తర్కంలో వున్న చిక్కు ఇది. ఆధ్యాత్మిక విషయాలో మానసిక తర్కం కడు తేలికగా బోల్తా కొట్టుతుంది, శ్రద్ధ, అంతర్భోధ. ఆధ్యాత్మిక హేతుస్ఫూర్తి, ఇవే ఇచట ముఖ్యంగా ఏడుగడ కావలసినవి.🍀*


🌷🌷🌷🌷🌷


విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

వర్ష ఋతువు, దక్షిణాయణం,

భాద్రపద మాసం

తిథి: శుక్ల ద్వాదశి 25:47:37 వరకు

తదుపరి శుక్ల త్రయోదశి

నక్షత్రం: శ్రవణ 09:42:26 వరకు

తదుపరి ధనిష్ట

యోగం: సుకర్మ 11:46:42 వరకు

తదుపరి ధృతి

కరణం: బవ 15:23:09 వరకు

వర్జ్యం: 13:16:50 - 14:42:46

దుర్ముహూర్తం: 08:30:13 - 09:18:29

రాహు కాలం: 15:08:23 - 16:38:53

గుళిక కాలం: 12:07:24 - 13:37:54

యమ గండం: 09:06:25 - 10:36:54

అభిజిత్ ముహూర్తం: 11:43 - 12:31

అమృత కాలం: 00:16:04 - 01:43:08

మరియు 21:52:26 - 23:18:22

సూర్యోదయం: 06:05:25

సూర్యాస్తమయం: 18:09:22

చంద్రోదయం: 16:02:59

చంద్రాస్తమయం: 02:37:44

సూర్య సంచార రాశి: కన్య

చంద్ర సంచార రాశి: మకరం

యోగాలు: లంబ యోగం - చికాకులు,

అపశకునం 09:42:26 వరకు తదుపరి

ఉత్పాద యోగం - కష్టములు, ద్రవ్య నాశనం

దిశ శూల: ఉత్తరం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నిత్య ప్రార్థన 🍀*

*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*

*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*

*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*

*తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం*

*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*

*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🍀. వామన జయంతి శుభాకాంక్షలు అందరికి, Vaman Jayanthi Good Wishes to All. 🍀*

*-ప్రసాద్‌ భరధ్వాజ*


*విశ్వాయ విశ్వభవన స్థితి సంయమాయ స్వైరం గృహీత పురుశక్తి గుణాయ భూమ్నే |*

*స్వస్థాయ శశ్వదుప బృంహిత వూర్ణబోధ- వ్యాపాదితాత్మ తమసే హరయే నమస్తే ||*


*🌻. వామన జయంతి విశిష్టత 🌻*


*'ధర్మ సంస్థాపనకోసం అవసరమైన సందర్భాల్లో అవతరిస్తూనే ఉంటా'నని శ్రీమహావిష్ణువు అభయ ప్రదానం చేశాడు.*


*ఆ పరంపరలో ఆవిష్కారమైన అయిదోది వామనావతారం. భాద్రపద శుద్ధ ద్వాదశినాడు అదితి , కశ్యపుల కుమారుడిగా శ్రీహరి వామనమూర్తిగా అవతరించాడు.*


*దీన్ని వామన ద్వాదశిగా , విజయ ద్వాదశిగా వ్యవహరిస్తారు.*


*సృష్టిలోని జీవావరణంలో జీవులు సూక్ష్మరూపం నుంచి మహా భారీకాయం వరకు వైవిధ్యభరితంగా గోచరమవుతాయి. ఈ అణుత్వం , మహారూపాలు పరస్పర విరుద్ధమైనవి. కానీ, ఆ వైవిధ్యం ఆత్మ , పరమాత్మల విషయంలో లేదని వేదోక్తి. ఆత్మ అణువు కంటే సూక్ష్మమైనది , మహత్తరమైనది. అది ఎంత సూక్ష్మమైనదో , అంత స్థూలమైనదని కఠోపనిషత్తు ప్రకటించింది. వామనావతార నేపథ్యం ఇదే !*


*వామనావతార విశేషాల్ని శ్రీమద్భాగవతం , వామన పురాణాలు విశదీకరిస్తున్నాయి.*


*ఓసారి బలి చక్రవర్తి ఇంద్రుణ్ని ఓడించి , స్వర్గానికి అధిపతి అయ్యాడు. విజయగర్వంతో రాక్షసులు అనేక అకృత్యాలకు పాల్పడసాగారు. దాంతో దేవతల మాతృమూర్తి అదితి కలత చెంది , కేశవుణ్ని వేడుకుని , అనుగ్రహాన్ని పొందింది. ఫలితంగా నారాయణుడు దేవతల రక్షణార్థం వామనుడిగా అవతరించాడు.*


*అతనికి ఉపనయన సంస్కారాలు జరిగాయి. బ్రహ్మ తేజస్సు , దివ్య యశస్సులతో వెలిగే వటుడైన వామనుడు దండాన్ని , గొడుగును , కమండలాన్ని ధరించి బలి చక్రవర్తి నిర్వహించే యజ్ఞశాలలోకి ప్రవేశించాడు.*


*'స్వస్తి జగత్త్రయీ భువన శాసనకర్తకు...' `అంటూ బలిని ఆశీర్వదించాడు. సందర్భోచిత లౌక్యాన్ని ప్రదర్శించాడు. వామనుడి వర్చస్సు, వాక్చాతుర్యానికి ముగ్ధుడై బలి చక్రవర్తి ఏం కావాలో కోరుకొమ్మన్నాడు.*


*'కేవలం నా పాదాలకే పరిమితమైన మూడు అడుగుల భూమిని మాత్రం నాకివ్వు చాలు' అన్నాడు వామనుడు.*


*ఆ వటుడి రూపంలాగానే అతడి కోరిక కూడా కురచగానే ఉందని బలి భావించాడు. భూ దానానికి సమాయత్తమైన బలిని అతడి గురువు శుక్రాచార్యుడు నిలువరించాడు.*


*అయినా బలి శుక్రుడి మాట వినకుండా, వామనుడికి ఉదకపూర్వకంగా భూమిని దానం చేశాడు. త్రివిక్రముడిగా వామనుడు విరాట్‌ రూపాన్ని సంతరించుకుని, ఓ పాదంతో భూమినీ, మరో పాదంతో స్వర్గాన్నీ ఆక్రమించి, మూడోపాదం బలి శిరస్సుపై ఉంచి, అతణ్ని రసాతలానికి అణగదొక్కాడు.*


*బలి సర్వ సమర్పణా భావానికి ప్రసన్నుడైన వామనుడు సుతల లోక రాజ్యాన్ని అనుగ్రహించాడు. ఇంద్రుడికి తిరిగి స్వర్గలోకాధిపత్యాన్ని కల్పించాడు.*


*వామన పురాణంలో ఇదే గాథను పోలిన మరో వృత్తాంతం గోచరమవుతుంది.*


*దుంధుడు అనే దానవుడు దేవతలపై దండెత్తే బలాన్ని సమకూర్చుకోవడానికి దేవికా నదీ తీరాన అశ్వమేధ యాగం చేయసాగాడు. దుంధుణ్ని యుక్తితో జయించాలని, శ్రీహరి వామన రూపంలో దేవికానదిలో ఓ దుంగలాగా తేలుతూ కొట్టుకుపోసాగాడు. దుంధుడు, అతడి అనుచరులు ఆ బాలుణ్ని రక్షించారు. తన పేరు గతి భానుడనీ, తాను మరుగుజ్జు నైనందువల్ల ఆస్తి వివాదాల్లో తనను దాయాదులు నదిలో పడవేశారని చెప్పాడు.*


*అతడి దీనగాథను విని దుంధుడు ఏం కావాలో కోరుకొమ్మన్నాడు.*


*మూడడుగుల నేల కోరిన వామనుడు ఆ సంవిధానంలోనే దుంధుణ్ని భూమిలోకి తొక్కి సమాధి చేశాడని పురాణగాథ.*


*వామనావతారం ఆత్మ తత్వాన్ని అద్భుతంగా ప్రకటించింది. జీవుడు తనలో ఉన్న ఆత్మ, విశ్వాంతరాళంలో ఉన్న పరమాత్మ ఒక్కటేనని జ్ఞానపూర్వకంగా గుర్తించాలి. ఆ స్పృహ ఏర్పడే కొద్దీ వామనరూపం అనూహ్యంగా పెరిగి పెద్దదై, విశ్వవ్యాప్తమై, పరమాత్మ తత్వమై భాసిల్లుతుంది.*


*యజ్ఞయాగాదులనేవి పేరుకోసం చేయవద్దనీ, నేను ప్రభువును, నేను గొప్ప దాతనని గర్వించడం తగదని భగవద్గీత హెచ్చరించింది.*


*పరుల ధనాన్నీ, భూమిని ఆక్రమించడం, దానం చేయడం, నేను కర్తను, భోక్తను అని విర్రవీగేవారు అజ్ఞానులని ఈశావాస్య ఉపనిషత్తు చెబుతోంది.*


*ఈ నేపథ్యమే బలి పతనానికి దారి తీసింది. మనిషి బిందు స్థితిలో బీజప్రాయంగా నిద్రాణంగా ఉన్న శక్తిని ఆత్మవిశ్వాసంతో గుర్తించాలి. దీని ద్వారా మనిషి మహనీయుడిగా ఎదగవచ్చని వామనావతారం సందేశమిస్తుంది.*


*మరుసటి రోజు వామన ద్వాదశి ముందు రోజు ఏకాదశినాడు ఉపవసించి, జాగారం చేసి, వామన విగ్రహాన్ని పూజిస్తారు. శుక్ర ద్వాదశి, వామన ద్వాదశి, శ్రవణ ద్వాదశి, మహా ద్వాదశి, అనంత ద్వాదశి, కల్కి ద్వాదశి అన్న పేర్లూ ఈ పర్వదినానికున్నాయి.*

🌹 🌹 🌹 🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీమద్భగవద్గీత - 433 / Bhagavad-Gita - 433 🌹*

*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 19 🌴*


*19. అనాదిమధ్యాన్తమనన్తవీర్యమ్ అనన్తబాహుం శశిసూర్యనేత్రమ్ |*

*పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రమ్ స్వతేజసా విశ్వమిదం తపన్తమ్ ||*


*🌷. తాత్పర్యం : నీవు ఆదిమధ్యాంత రహితుడవై యున్నావు. నీ వైభవము అపరిమితమై యున్నది. అసంఖ్యాకములుగా భుజములను కలిగిన నీవు సూర్యచంద్రులను నేత్రములుగా కలిగియున్నావు. ముఖము నుండి తేజోమయమైన అగ్ని బయల్వెడలుచుండ స్వతేజముతో ఈ సమస్త విశ్వమును తపింపజేయుచున్నట్లుగా నిన్ను గాంచుచున్నాను.*


*🌷. భాష్యము : శ్రీకృష్ణభగవానుని షడ్గుణైశ్వర్యములకు పరిమితి లేదు. ఈ సందర్భమున మరియు పెక్కు ఇతరచోట్ల పునరుక్తి జరిగియున్నది. కాని శాస్త్రరీత్యా శ్రీకృష్ణుని వైభములను పునరుక్తి సారస్వతలోపము కాదు. సంభ్రమము, ఆశ్చర్యము లేదా పారవశ్యము కలిగినపుడు పదముల పునరుక్తి కలుగుచుండుననియు, అది దోషమేమియును కాదనియు తెలుపబడినది.*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Bhagavad-Gita as It is - 433 🌹*

*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*


*🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 19 🌴*


*19. anādi-madhyāntam ananta-vīryam ananta-bāhuṁ śaśi-sūrya-netram*

*paśyāmi tvāṁ dīpta-hutāśa-vaktraṁ sva-tejasā viśvam idaṁ tapantam*


*🌷 Translation : You are without origin, middle or end. Your glory is unlimited. You have numberless arms, and the sun and moon are Your eyes. I see You with blazing fire coming forth from Your mouth, burning this entire universe by Your own radiance.*


*🌹 Purport : .There is no limit to the extent of the six opulences of the Supreme Personality of Godhead. Here and in many other places there is repetition, but according to the scriptures, repetition of the glories of Kṛṣṇa is not a literary weakness. It is said that at a time of bewilderment or wonder or of great ecstasy, statements are repeated over and over. That is not a flaw.*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 . శ్రీ శివ మహా పురాణము - 794 / Sri Siva Maha Purana - 794 🌹*

*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 21 🌴*


*🌻. గణాధ్యక్షుల యుద్ధము - 5 🌻*


*భూమికి, స్వర్గమునకు మధ్యలోగల ఆకాశము జలంధరుని బాణములచే పొగమంచు తునకలతో వలె కప్పివేయబడెను (33). ఆతడు నందిని అయిదు, గణశుని అయిదు, మరియు వీరభద్రుని ఇరవై బాణములతో కొట్టి మేఘధ్వనితో సింహనాదమును చేసెను (34). అపుడు వెంటనే మహావీరుడు, రుద్రపుత్రుడు అగు కుమారస్వామి జలంధరాసురుని శక్తితో కొట్టి సింహనాదమును చేసెను (35).*


*శక్తిచే చీల్బడిన దేహము గల ఆ రాక్షసుడు కన్నులు తిరుగుటచే నేలప్తె బడెను. కాని మహాబలశాలి యగుటచే వెంటనే లేచి నిలబడెను (36). అపుడు రాక్షసశ్రేష్ఠుడగు జలంధరుడు క్రోధముతో నిండిన మనస్సు గలవాడై కుమారస్వామిని గదతో వక్షస్థ్సలముప్తె కొట్టెను (37). శంకరపుత్రుడగు ఆ కుమారస్వామి వరముగా నీయబడిన ఆ గద ప్రభావశాలి యనియు, వరరము పఫలమనియు నిరూపించుటకై వెంటనే నేలప్తె బడెను (38). అదే విధముగా మహావీరుడు, శత్రువులను సంహరించువాడు అయిననూ నంది కొంత కల్లోలమును పొందిన మనస్సు గలవాడై గదచే కొట్టబడి నేలపై బడెను (39).*


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 SRI SIVA MAHA PURANA - 794 🌹*

*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *


*🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 21 🌴*


*🌻 Description of the Special War - 5 🌻*


33. The space between heaven and the earth became enveloped by the many arrows discharged by Jalandhara as if by floating masses of mist.


34. Hitting Nandin and Gaṇeśa with five arrows each and Vīrabhadra with twenty he roared like thunder.


35. Kārttikeya the heroic son of Śiva then swiftly hit the Daitya Jalandhara with his spear and roared.


36. With the body pierced through by the spear, the Daitya fell on the ground with eyes rolling. But the powerful Asura swiftly stood up.


37. Then Jalandhara the infuriated leader of the Daityas hit Kārttikeya in his chest with his mace.


38. O Vyāsa, plainly exhibiting the successful efficiency of the Mace secured as a favour from Brahmā Kārttikeya fell on the ground suddenly.


39. Similarly, struck by the mace Nandin too fell on the ground, He was distressed a little although he was a great hero and a destroyer of enemies.


Continues....

🌹🌹🌹🌹🌹



🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 47 / Osho Daily Meditations  - 47 🌹*

*✍️. ప్రసాద్ భరద్వాజ*


*🍀 47. పేదరికం 🍀*


*🕉. త్వరలోనే బాహ్య పేదరికం అంతరించి పోతుంది-- ఇప్పుడు దానిని తుడిచి వేయడానికి మనకు తగినంత సాంకేతికత ఉంది అప్పుడు అసలు సమస్య తలెత్తుతుంది. 🕉*


*ప్రేమను కోల్పోయిన వారు నిజంగా పేదవారు; మరియు భూమి అంతా ప్రేమకు అలమటిస్తున్న పేదలతో నిండి ఉంది. త్వరలోనే బాహ్య పేదరికం అదృశ్యమవుతుంది - ఇప్పుడు దానిని తుడిచివేయడానికి మనకు తగినంత సాంకేతికత ఉంది - అప్పుడు అసలు సమస్య తలెత్తుతుంది. అసలు సమస్య అంతర్గత పేదరికం. ఏ సాంకేతికత సహాయం లేదు. మనం ఇప్పుడు ప్రజలకు ఆహారం ఇవ్వగలము-కాని ఆత్మ, ఆత్మకు ఎవరు ఆహారం ఇస్తారు? సైన్స్ ఆ పని చేయలేదు. ఇంకేదైనా కావాలి, దానినే నేను మతం అంటాను. అప్పుడు సైన్స్ తన పనిని పూర్తి చేసింది; అప్పుడే నిజమైన మతం ప్రపంచంలోకి ప్రవేశిస్తుంది. ఇప్పటి వరకు మతం అనేది ఒక విచిత్రమైన విషయం--ఎప్పుడో ఒక బుద్ధుడు, కృష్ణుడు కనిపిస్తాడు.*


*వీరు అసాధారణ వ్యక్తులు; వారు మానవత్వానికి ప్రాతినిధ్యం వహించరు. వారు కేవలం ఒక అవకాశాన్ని, భవిష్యత్తును తెలియజేస్తారు. కానీ ఆ భవిష్యత్తు మరింత దగ్గరవుతోంది. శాస్త్రం పదార్థం యొక్క సంభావ్య శక్తులను విడుదల చేసిన తర్వాత మరియు మానవులు భౌతికంగా సంతృప్తి చెందాక-ఆశ్రయం కలిగి ఉంటారు, తగినంత ఆహారం కలిగి ఉంటారు, తగినంత విద్యను కలిగి ఉంటారు-అప్పుడు వారు మొదటిసారిగా ఇప్పుడు కొత్త ఆహారం అవసరమని చూస్తారు. ఆ ఆహారం ప్రేమ, పైగా సైన్స్ దానిని అందించలేదు. అది మతం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. మతం ప్రేమ యొక్క శాస్త్రం.*


*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Osho Daily Meditations  - 47 🌹*

📚. Prasad Bharadwaj


*🍀 47. POVERTY  🍀*


*🕉.  Sooner or later the outer poverty is going to disappear-- We now have enough technology to make it disappear and the real problem is going to arise. 🕉*


*The really poor people are those who are missing love; and the whole earth is full of those poor people who are starved. Sooner or later the outer poverty is going to disappear-we now have enough technology to make it disappear-and the real problem is going to arise. The real problem will be inner poverty. No technology can help. We are capable of feeding people now-but who will feed the spirit, the soul? Science cannot do that. Something else is needed, and that is what I call religion. Then science has done its work; only  then can true religion enter the world. Up to now religion has been only a freak phenomenon--once in a while a Buddha,  a Krishna appears.*


*These are exceptional people; they don't represent humanity. They simply herald a possibility, a future. But that future is coming closer. Once science has released the potential powers of matter and human beings are physically satisfied-have shelter, have enough food, have enough education-then for _the first time they will see that now a new food is needed. That food is love, and science cannot provide it. That can only be done by religion. Religion is the science of love.*


Continues...

🌹 🌹 🌹 🌹 🌹



🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 485 - 490 / Sri Lalitha Chaitanya Vijnanam  - 485 - 490 🌹*

*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*

*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*

*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*


*🍀  100. అనాహతాబ్జ నిలయా, శ్యామాభా, వదనద్వయా ।

దంష్ట్రోజ్జ్వలా, అక్షమాలాధిధరా, రుధిర సంస్థితా ॥ 100 ॥ 🍀*


*🌻 485 to  490 నామములు 🌻*


*485. 'అనాహతాబ్ద నిలయా' - అనాహత పద్మము నందుండునది శ్రీమాత అని అర్థము.*

*486. ‘శ్యామాభా’ - శ్యామల వర్ణము కలది శ్రీమాత అని అర్థము.*

*487. 'వదనద్వయా’ - రెండు ముఖములు కలది శ్రీమాత అని అర్థము.*

*488. 'దంఫ్రోజ్వలా' - దంతములతో ప్రకాశించునది శ్రీమాత అని అర్థము.*

*489. 'అక్షమాలాధిధరా’ - అక్షమాల మొదలగు ఆయుధములు ధరించునది శ్రీమాత అని అర్థము.*

*490. ‘రుధిర సంస్థితా' - రక్త మందుండునది శ్రీమాత అని అర్థము.*


*సశేషం...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 485 to 490 🌹*

*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*

*✍️ Prasad Bharadwaj*


*🌻100. Anahatabjanilaya shyamabha vadanadvaya

danshtrojvalakshamaladi dhara rudhira sansdhita॥ 100 ॥ 🌻*


*🌻 485 to 490 Names. 🌻*


*485. 'Anahatabda Nilaya' - Sri Mata resides in Anahata Padma.*

*486. 'Shyamabha' - means Sri Mata is dark complexioned.*

*487. 'Vadanadwaya' - has two faces.*

*488. 'Damfrojvala' - Srimata is shining with teeth.*

*489. 'Akshamaladhidhara' - Sri Mata wears weapons like Akshamala.*

*490. 'Rudhira sanstita' - Sri Mata resides in the blood.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Join and Share

🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹

Comments


bottom of page