🍀🌹 27, JULY 2023 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 27, JULY 2023 THURSDAY గురువారం, బృహస్పతి వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 404 / Bhagavad-Gita - 404 🌹
🌴10వ అధ్యాయము - విభూతి యోగం - 32 / Chapter 10 - Vibhuti Yoga - 32 🌴
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 251 / Agni Maha Purana - 251 🌹
🌻. శివ పూజా విధి వర్ణనము - 7 / Mode of worshipping Śiva (śivapūjā) - 7 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 116 / DAILY WISDOM - 116 🌹
🌻 25. చట్టం యొక్క తత్వశాస్త్రం యొక్క పునాది / 25. The Foundation of the Philosophy of Law 🌻
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 382 🌹*
6) 🌹. శివ సూత్రములు - 118 / Siva Sutras - 118 🌹
🌻 2-07. మాతృక చక్ర సంబోధః - 21 / 2-07. Mātrkā chakra sambodhah - 21 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 27, జూలై, JULY 2023 పంచాంగము - Panchangam 🌹*
*శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*
*🌺. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌺*
*🍀. శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం - 15 🍀*
*29. నిర్వికల్పః సురశ్రేష్ఠో హ్యుత్తమో లోకపూజితః |*
*గుణాతీతః పూర్ణగుణీ బ్రహ్మణ్యో ద్విజసంవృతః*
*30. దిగంబరో మహాజ్ఞేయో విశ్వాత్మాఽఽత్మపరాయణః* |
*వేదాంతశ్రవణో వేదీ కలావాన్నిష్కలత్రవాన్*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : మానవ సంబంధాల నిస్సారతా భావం - ప్రాణకోశపు బాహ్యతల మందలి ఆశాభంగం వల్లనో, ఇతరులు తనను ప్రేమించడం మానివేసి నందువల్లనో, తనచే ప్రేమించ బడేవారు తాను మొదట్లో అనుకున్న దాని కంటే వేరు విధంగా ఉన్నట్టు తరువాత తెలుసు కున్నందు వల్లనో - ఇట్లెన్నో స్పష్టమైన కారణాలను పురస్కరించుకొని మానవ సంబంధాలను నిస్సారములుగా భావించడం ఒక్కొక్కప్పుడు
జరగవచ్చు. 🍀*
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
వర్ష ఋతువు, దక్షిణాయణం,
శ్రావణ మాసం
తిథి: శుక్ల-నవమి 15:49:33 వరకు
తదుపరి శుక్ల-దశమి
నక్షత్రం: విశాఖ 25:29:17 వరకు
తదుపరి అనూరాధ
యోగం: శుభ 13:38:49 వరకు
తదుపరి శుక్ల
కరణం: కౌలవ 15:41:33 వరకు
వర్జ్యం: 06:51:58 - 08:29:06
మరియు 29:23:30 - 30:57:18
దుర్ముహూర్తం: 10:12:54 - 11:04:45
మరియు 15:23:59 - 16:15:49
రాహు కాలం: 13:59:44 - 15:36:56
గుళిక కాలం: 09:08:06 - 10:45:18
యమ గండం: 05:53:40 - 07:30:53
అభిజిత్ ముహూర్తం: 11:57 - 12:47
అమృత కాలం: 16:34:46 - 18:11:54
సూర్యోదయం: 05:53:40
సూర్యాస్తమయం: 18:51:22
చంద్రోదయం: 13:35:23
చంద్రాస్తమయం: 00:20:00
సూర్య సంచార రాశి: కర్కాటకం
చంద్ర సంచార రాశి: తుల
యోగాలు: వర్ధమాన యోగం - ఉత్తమ
ఫలం 25:29:17 వరకు తదుపరి
ఆనంద యోగం - కార్య సిధ్ధి
దిశ శూల: దక్షిణం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 404 / Bhagavad-Gita - 404 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 33 🌴*
*32. సర్గాణామాదిరన్తశ్చ మధ్యం చైవాహమర్జున |*
*ఆధ్యాత్మవిద్యా విద్యానాం వాద: ప్రవదతామహమ్ ||*
*🌷. తాత్పర్యం : ఓ అర్జునా! సమస్తసృష్టికి ఆది, అంతము, మధ్యమము కూడా నేనే. అదే విధముగా నేను శాస్త్రములలో ఆత్మకు సంబంధించిన ఆధ్యాత్మిక శాస్త్రమును, తార్కికులలో కడపటి సత్యమును అయియున్నాను.*
*🌻. భాష్యము : భౌతికతత్త్వముల సృష్టి యనునది సృష్టులలో ఆదియైనది. పూర్వము వివరింపబడినట్లు విశ్వము మహావిష్ణువుచే (గర్భోదకశాయివిష్ణువు మరియు క్షీరోదకశాయివిష్ణువు) సృష్టినొంది, పోషింపబడి, పిదప శివునిచే లయమొందింపబడును. బ్రహ్మదేవుడు వాస్తవమునకు గౌణసృష్టికర్త. విశ్వపు ఈ సృష్టి, స్థితి, లయకారకులందరును కృష్ణుని భౌతిక గుణావతారములు. కనుకనే శ్రీకృష్ణభగవానుడు సర్వసృష్టులకు ఆది, మధ్యము, అంతమునై యున్నాడు. ఉన్నతవిజ్ఞానము కొరకు నాలుగువేదములు, షడంగములు, వేదాంత సూత్రములు, తర్కశాస్త్రములు, ధర్మశాస్త్రములు, పురాణములు ఆది పలుగ్రంథములు గలవు.*
*మొత్తము మీద ఉన్నతవిజ్ఞానము కొరకు పదునాలుగు విభాగముల గ్రంథములు కలవు. వీటిలో ఆధ్యాత్మిక విద్యను ఒసగునట్టి గ్రంథము (ముఖ్యముగా వేదాంతసూత్రము) శ్రీకృష్ణుని ప్రాతినిధ్యము వహించును. తార్కికుల నడుమ వివిధములైన వాదములు జరుగుచుండును. నిదర్శనముతో తన వాడమునే బలపరచువాదము జల్పమనవడును. ప్రతిపక్షమును ఓడించుటయే ప్రధానముగా భావించి చేయబడు వాదము వితండము. కాని వాస్తవతత్త్వ నిర్ణయమే నిజమైన వాదము. అట్టి కడపటి సత్యము శ్రీకృష్ణుని ప్రాతినిధ్యము వహించును.*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 404 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 10 - Vibhuti Yoga - 32 🌴*
*32. sargāṇām ādir antaś ca madhyaṁ caivāham arjuna*
*adhyātma-vidyā vidyānāṁ vādaḥ pravadatām aham*
*🌷 Translation : Of all creations I am the beginning and the end and also the middle, O Arjuna. Of all sciences I am the spiritual science of the self, and among logicians I am the conclusive truth.*
*🌹 Purport : Among the created manifestations, the first is the creation of the total material elements. As explained before, the cosmic manifestation is created and conducted by Mahā-viṣṇu, Garbhodaka-śāyī Viṣṇu and Kṣīrodaka-śāyī Viṣṇu, and then again it is annihilated by Lord Śiva. Brahmā is a secondary creator. All these agents of creation, maintenance and annihilation are incarnations of the material qualities of the Supreme Lord. Therefore He is the beginning, the middle and the end of all creation.*
*For advanced education there are various kinds of books of knowledge, such as the four Vedas, their six supplements, the Vedānta-sūtra, books of logic, books of religiosity and the Purāṇas. So all together there are fourteen divisions of books of education. Of these, the book which presents adhyātma-vidyā, spiritual knowledge – in particular, the Vedānta-sūtra – represents Kṛṣṇa. Among logicians there are different kinds of argument. Supporting one’s argument with evidence that also supports the opposing side is called jalpa. Merely trying to defeat one’s opponent is called vitaṇḍā. But the actual conclusion is called vāda. This conclusive truth is a representation of Kṛṣṇa.*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 251 / Agni Maha Purana - 251 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 74*
*🌻. శివ పూజా విధి వర్ణనము - 7 🌻*
*ఆత్మ - ద్రవ్య - మంత్రలింగ శుద్ధులు చేసిన పిమ్మట సకల దేవతలను పూజించవలెను. వాయువ్యమునందు, ''ఓం హాం గణపతయే నమః'' అని ఉచ్చరించుచు గణపతిని పూజించవలెను. ఈశాన్యమునందు ''ఓం హాం గురుభ్యో నమః'' అని చెప్పుచు గురు - పరమగురు - పరాత్పరగురు - పరమేష్ఠిగురువులను గురుపరంపరను పూజించవలెను. కూర్మరూప మగు శిలపై ఉన్న అంకురతుల్య మగు ఆధారశక్తిని పూజించి, బ్రహ్మశిలపై కూర్చున్న శివుని ఆసనమైన అనంతదేవుని ''ఓం హాం అనన్తాయ నమః'' అను మంత్రముతో పూజింపవలెను. శివుని సింహాసనముగా నున్న మంచమునకు నాలుగు కోళ్ళు ఉండును. వాటి ఆకారము సింహాకారమున విచిత్రముగా నుండును. ఈ సింహములు మండలాకారమున నిలచి ఎదుట నున్నదాని పృష్ఠభాగమును చూచు చుండును. ఇవి సత్య - త్రేతా - ద్వాపర - కలియుగములకు ప్రతీకములు. పిమ్మట శివుని ఆసనపాదుకలను పూజించవలెను. పిమ్మట ఆగ్నేయాది విదిశలలో నున్న ధర్మ - జ్ఞాన - వైరాగ్య - ఐశ్వర్యములను పూజింవలెను. వీటి రంగులు వరుసగ కర్పూర - కుంకుమ - సువర్ణ - కజ్జలము (కాటుక)లతో సమానముగ నుండును. వీటి నాలుగు కాళ్ళకును పూజ చేసి ఆసనముపై నున్న అష్టదలకమలము నందలి క్రింది దళములను, పై దళములను మొత్తము కలమలమును పూజించి, ''ఓం హాం కర్షికాయై నమః'' అను మంత్రముతో కర్ణికామధ్య భాగమును పూజించవలెను.*
*ఆ కమలము యొక్క ఎనిమిది పూర్వాది దళములందును, మధ్యభాగమునందును తొమ్మండుగురు శక్తులను పూజించవలెను. ఆ శక్తులు హస్తములలో చామరములు ధరించి యుందురు. వరద - అభయముద్రలు కూడ ఉండును. వామా-జ్యేష్ఠా-రౌద్రీ-కాలీ-కలవికారిణీ - బలవికారిణీ - బలప్రమథనీ - సర్వభూతదమనీ - మనోన్మనీ ఆను ఎనమండుగురు శక్తులను అష్టదలముల పైనను. మనోన్మని యను శక్తిని కమలకేసరములందును ''హాం కామాయై నమః'' ఇత్యాది మంత్రము లుచ్చరించుచు పూజించవలెను. పిమ్మట పృథివ్యాద్యష్టమూర్తులను, విశుద్ధవిద్యాదేహమును భావించుచు పూజ చేయవలెను. శుద్ధవిద్యను, తత్త్వవ్యాపక ఆసనమును పూజించవలెను. ఆ సింహాసనముపై కర్పూరము వలె తెల్లగా ఉన్నవాడును, సర్వవ్యాపియు, ఐదు ముఖములు గలవాడును అగు మహాదేవుని ప్రతిష్ఠ చేయవలెను. ఆయనకు పది భుజము లుండును. శిరస్సున అర్ధచంద్రు ఉండును. కుడి చేతులలో శక్తి - ఋష్టి - శూల - ఖట్వాంగ - వరదముద్ర లుండును. ఎడమ చేతులలో డమరు - బీజపూర - సర్పన - అక్షసూత్ర - నీలకమలము లను ధరించి యుండును.*
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Agni Maha Purana - 251 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *
*Chapter 74*
*🌻 Mode of worshipping Śiva (śivapūjā) - 7 🌻*
44-45. One should worship the goddess of the seat (of the god) in the kūmaśilā (the tortoise form on the stone) as possessing complexion of the tender shoots and the seat of Śiva known as ananta (endless) should be worshipped as seated on the brahmaśilā along with the attendants of the god such as Vicitra-keśa, Kṛta and Tretā who form the seat and shoes as they were of divinity.
46. Then the worshipper should worship righteousness, knowledge, detachment and prosperity, towards the south-east as possessing the hues of camphor, saffron, gold and collyrium respectively.
47-48. At the centre of the lotus-shaped diagram and in its petals in the east etc. one should worship the energy goddesses—Vāmā, Jyeṣṭhā, Raudrī, Kālī, Kālavikariṇī, Balavikaraṇī and Balapramathanī in order as holding the chowries and as conferring boons and offering protection.
49. One should worship (the goddesses)—Hāṃ, (salutations) to Sarvabhūtadamanī, (salutations) to Manonmanī, to Kṣiti, to Śuddhavidyā at the extremities of the petals (of the lotus diagram) as also the seat as spread over the component parts of the universe.
50-51. The lord of white complexion, possessing five faces and ten arms, all-pervasive, bearing the crescent moon and carrying weapons—spear, sword, lance, and staff in the right hands and a drum, citron, blue lotus, a string and a waterlily in the left hands should be located on the lion-seat.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 116 / DAILY WISDOM - 116 🌹*
*🍀 📖 . ఆత్మ యొక్క ఆరోహణ నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🌻 25. చట్టం యొక్క తత్వశాస్త్రం యొక్క పునాది 🌻*
*ధర్మం అనేది ఒక అతీతమైన శక్తి. ఇది సంపూర్ణత యొక్క పరాకాష్టకు చేరుకునే వరకు చైతన్యం యొక్క క్రమబద్ధమైన ఏకీకరణను కోరుతుంది. ఈ విధంగా, ధర్మం అనేది వివిధ దశల్లో, సంపూర్ణత స్థాయిల్లో విశ్వం పని చేసే విధానం. ఇది సమగ్ర విశ్వ ఏకత్వం నుంచి అణు సముదాయ కదలికల వరకు పని చేస్తుంది. కాబట్టి సామాజిక చట్టాలు మరియు రాజకీయ పరిపాలనా వ్యవస్థల పట్ల ధర్మం పని చేయకుండా పోదు.*
*విశ్వాన్ని నడిపించే ఈ ధర్మం మాత్రమే వ్యక్తులకు వారి చర్యలు మరియు ప్రతిచర్యలకు తగిన ప్రతిఫలాన్ని, శిక్షని ఇస్తుంది. మానవ ప్రవర్తనలన్నింటికీ ఇదే ఆధారం. మానవులు పరస్పర ప్రేమ మరియు సహకారం కోసం పరితపిస్తూనే తోటివారి పట్ల అపనమ్మకంతో, దాడి చేయడానికి సిద్ధంగా ఉండే అర్థంకాని ప్రవర్తనకు కారణం ఇదే. ఇక్కడ మనకు, బహుశా, చట్టం యొక్క తత్వశాస్త్రం యొక్క పునాది ఉంది. నీతి మరియు నైతికతకు ధర్మం వల్ల విలువ ఉంది. ధర్మానికి ఒక అర్థం ఉంది. అది తనకు మించిన సత్యాన్ని సూచిస్తుంది.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 116 🌹*
*🍀 📖 The Ascent of the Spirit 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
*🌻 25. The Foundation of the Philosophy of Law 🌻*
*Law is a transcendent, connotative significance or force which demands a gradational integration of consciousness, both in quantity and quality simultaneously, until it reaches its culmination, which is known as the Absolute. Law is, thus, an operation of the system of the Absolute, in different evolutionary degrees of comprehensiveness and perfection, right from the Ultimate Causality of the universe down to the revolution of an atom or the vibration of an electron. Social laws and political systems of administration cannot, therefore, be separated from the requisitions necessitated by the law of the Absolute.*
*It is just this Universal Transcendent Principle that either rewards or punishes individuals by its gradational actions and reactions, and it is this, again, that is the basis of all human behaviour, looking so inscrutable, and this is the explanation as to why individuals strive for mutual love and cooperation, and, at the same time, keep themselves ready with a knife hidden in their armpits. Here we have, perhaps, the foundation of the philosophy of law. Ethics and morality have, thus, a necessary value. Law has a meaning, and it points to a truth beyond itself.*
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 382 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. ప్రార్ధన అంటే అనంతాన్ని ప్రేమించడం. అనంత విశ్వం పట్ల ప్రేమ, వృక్షాలతో, రాళ్ళతో, నదుల్తో, పర్వతాల్తో, నక్షత్రాల్తో స్నేహంగా వుండడం. 🍀*
*స్నేహంలో ఆధ్యాత్మికత వుంది. ప్రేమ శరీర సంబంధి. స్నేహం ఆధ్యాత్మికం. ప్రేమ స్నేహంగా మారకుంటే దాని గుండా అతను బాధపడాల్సి వుంటుంది. ఆనందం కన్నా అతను బాధల్ని ఎక్కువ పొందుతాడు. దానికి కారణం ప్రేమ శక్తిలో లేదు. ప్రేమ స్వచ్ఛంగా మార్చక పోవడంలో వుంది. కళాత్మకంగా లేకపోవడంలో వుంది. అది నీకు అందిందని అనుకోవడంలో వుంది.
నీ ప్రేమ స్నేహంగా వుండనీ. నీ ప్రేమ ప్రార్థనగా వుండనీ.*
*అక్కడ రెండు అవకాశాలున్నాయి. నువ్వు స్నేహంగా వున్న వ్యక్తి పట్ల ప్రేమగా వుంటే నువ్వు ఎందర్నో ప్రేమించగలవు. నీ సరిహద్దు విస్తరిస్తుంది. విశాలమవుతుంది. దాని వల్ల నువ్వు ప్రేమతో యితర్లని అంటుకుపోవడం అంటూ జరగదు. ప్రార్ధన అంటే అనంతాన్ని ప్రేమిస్తుంది. అనంత విశ్వం పట్ల ప్రేమ, వృక్షాలతో, రాళ్ళతో, నదుల్తో, పర్వతాల్తో, నక్షత్రాల్తో స్నేహంగా వుండడం. అట్లా వుంటే ప్రార్థన అన్నది మతమవుతుంది.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శివ సూత్రములు - 118 / Siva Sutras - 118 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*2వ భాగం - శక్తోపాయ*
*✍️. ప్రసాద్ భరధ్వాజ*
*🌻 2-07. మాతృక చక్ర సంబోధః - 21 🌻*
*🌴. ఒక గురువు సహాయంతో, యోగి మాతృక చక్ర జ్ఞానాన్ని మరియు మంత్ర శక్తులను స్వీయ-శుద్ధి మరియు స్వీయ-సాక్షాత్కారం కోసం ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటాడు. 🌴*
*ఆ విధంగా, సృష్టించబడిన సృష్టికి తాను విశ్వం అని గ్రహించగలిగే చైతన్యంతో నింపబడాలి. ఇది సాధకుడికి అహం ఇదమ్ అని చెప్పుకునేలా చేస్తుంది, అంటే నేను ఇది, ఇక్కడ ఇది అంటే విశ్వం. శివ సంకల్పం అయిన శక్తి యొక్క అభివ్యక్తి వలన ఆధ్యాత్మిక అన్వేషకుడు ఈ దశను పొందుతాడు. ఈ చర్చ శివుడు మరియు శక్తి స్వతంత్రంగా కనిపించినప్పటికీ, వాస్తవానికి అవి ఒకే అస్తిత్వం అని కూడా నిరూపిస్తుంది. నిజమైన ఆధ్యాత్మిక అభిలాషిలో, ఈ వ్యక్తీకరణలన్నీ అతని కుండలినీ శక్తి ద్వారా జరుగుతాయి, ఇది నేను శివుడిని అని ధృవీకరించే ముగింపుకు అతన్ని నడిపిస్తుంది.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Siva Sutras - 118 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 2 - Śāktopāya.
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*
*🌻 2-07. Mātrkā chakra sambodhah - 21 🌻*
*🌴. With the help of an guru, a yogi gains the knowledge of matruka chakra and how to harness the mantra shaktis, for self-purification and self-realization. 🌴*
*Thus, the creation having been made is to be infused with consciousness that is capable of making one realise that he is the universe. This makes the aspirant to say aham idam, which means I am this, where this means the universe. A spiritual seeker attains this stage because of the manifestation of Śaktī, the will of Śiva. This discussion also goes to prove that Śiva and Śaktī, though appear to be independent, in reality They are single entity. In a true spiritual aspirant, all these manifestations happen through his kuṇḍalinī energy, which leads him to the logical conclusion of affirming I am Śiva.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
Comments