🍀🌹 28, APRIL 2023 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 28, APRIL 2023 FRIDAY శుక్రవారం, బృగు వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 362 / Bhagavad-Gita - 362 🌹 🌴 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం / Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 24 వ శ్లోకము 🌴
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 209 / Agni Maha Purana - 209 🌹
🌻. ద్వారప్రతిష్టా ధ్వజారోహణాది విధిః - 4 / Consecration of doors of the temple and the erection of banner - 4 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 074 / DAILY WISDOM - 074 🌹
🌻 14. ఏమీ నుండి ఏమీ రాదు / 14. Nothing Can Come from Nothing 🌻
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 339 🌹
6) 🌹. శివ సూత్రములు - 76 / Siva Sutras - 76 🌹
🌻2-01. చిత్తం మంత్రః - 3 / 2-01. Cittaṁ mantraḥ - 3 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 28, ఏప్రిల్, Apirl 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : మాసిక దుర్గాష్టమి, Masik Durgashtami 🌻*
*🍀. శ్రీ మహాలక్ష్మీ సుప్రభాతం - 42 🍀*
*42. జాజ్జ్వల్యకుణ్డల విరాజితకర్ణయుగ్మే*
*సౌవర్ణకఙ్కణసు శోభితహస్తపద్మే ।*
*మఞ్జీరశిఞ్జితసు కోమలపావనాఙ్ఘ్రే*
*లక్ష్మి త్వత్వదీయ చరణౌ శరణం ప్రపద్యే ॥*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : ప్రాణమయచేతనలో కూడా విశుద్ధ ప్రేమ - ప్రాణమయ చేతనలో ప్రేమ రెండురకాలు. అందులో ఒకటి అంతరాత్మతో ప్రేమించే ప్రేమకు సన్నిహితమై, దానికి అనుబంధంగా ఉండి దివ్య ప్రేమాభివ్యక్తికి సైతం సాధనభూతం కాదగిన లక్షణం కలది. పరిపూర్ణ త్యాగానందమయమై ఎదుటి నుండి ఏమియూ నపేక్షింపక తనను దాను పూర్తిగా సమర్పణం చేసికొను స్వభావం దీనికున్నది. 🍀*
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
వసంత ఋతువు, ఉత్తరాయణం,
వైశాఖ మాసం
తిథి: శుక్ల-అష్టమి 16:02:36
వరకు తదుపరి శుక్ల-నవమి
నక్షత్రం: పుష్యమి 09:53:37
వరకు తదుపరి ఆశ్లేష
యోగం: శూల 09:39:06 వరకు
తదుపరి దండ
కరణం: బవ 16:01:36 వరకు
వర్జ్యం: 24:14:20 - 26:02:00
దుర్ముహూర్తం: 08:24:44 - 09:15:37
మరియు 12:39:09 - 13:30:02
రాహు కాలం: 10:38:19 - 12:13:43
గుళిక కాలం: 07:27:30 - 09:02:54
యమ గండం: 15:24:32 - 16:59:56
అభిజిత్ ముహూర్తం: 11:48 - 12:38
అమృత కాలం: 02:42:52 - 04:30:24
సూర్యోదయం: 05:52:06
సూర్యాస్తమయం: 18:35:20
చంద్రోదయం: 12:27:45
చంద్రాస్తమయం: 01:06:32
సూర్య సంచార రాశి: మేషం
చంద్ర సంచార రాశి: కర్కాటకం
యోగాలు: ఉత్పాద యోగం - కష్టములు,
ద్రవ్య నాశనం 09:53:37 వరకు తదుపరి
మృత్యు యోగం - మృత్యు భయం
దిశ శూల: పశ్చిమం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 362 / Bhagavad-Gita - 362 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 24 🌴*
*24. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ |*
*నతు మామభిజానన్తి తత్త్వేనాతశ్చ్యవన్తి తే ||*
🌷. తాత్పర్యం :
*నేనే సర్వయజ్ఞములకు భోక్తను మరియు ప్రభువును అయియున్నాను. కావున నా వాస్తవమైన దివ్యస్వభావమును గుర్తింపలేనివారు పతనము చెందుదురు.*
🌷. భాష్యము :
*వేదవాజ్మయమునందు పలువిధములైన యజ్ఞములు నిర్దేశింపబడియున్నను, వాస్తవమునకు అవియన్నియును దేవదేవుడైన శ్రీకృష్ణుని సంతృప్తిపరచుట కొరకే నిర్దేశింపబడినవి ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. యజ్ఞముగా విష్ణువు. యజ్ఞుడు లేదా విష్ణువు ప్రీత్యర్థమే ప్రతియొక్కరు కర్మనొనరించవలెనని భగవద్గీత యందలి తృతీయాధ్యాయమున స్పష్టముగా తెలపబడినది. మానవనాగరికతకు పరిపక్వరూపమైన వర్ణాశ్రమధర్మము విష్ణుప్రీతికే ప్రత్యేకముగా ఉద్దేశింపబడినది.*
*కనుకనే శ్రీకృష్ణభగవానుడు ఇచ్చట “నేనే దివ్యప్రభువును గావున సర్వయజ్ఞములకు నేనే భోక్తను” అని పలికియున్నాడు. కాని మందమతులైనవారు ఈ సత్యమును తెలియక తాత్కాలిక లాభముల కొరకు ఇతర దేవతలను పూజింతురు. తత్కారణముగా వారు భౌతికస్థితికి పతనము నొంది ఎన్నడును మానవజన్మ యొక్క వాంఛితలక్ష్యమును సాధింపలేరు. అయినను ఎవరేని ఒక భౌతికకోరికరను కలిగియున్నచో దాని కొరకై శ్రీకృష్ణభగవానుని ప్రార్థించుట ఉత్తమము (అది శుద్ధభక్తి కానేరదు). తద్ద్వారా అతడు వాంఛితఫలమును పొందగలడు.*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 362 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 24 🌴*
*24. ahaṁ hi sarva-yajñānāṁ bhoktā ca prabhur eva ca*
*na tu mām abhijānanti tattvenātaś cyavanti te*
🌷 Translation :
*I am the only enjoyer and master of all sacrifices. Therefore, those who do not recognize My true transcendental nature fall down.*
🌹 Purport :
*Here it is clearly stated that there are many types of yajña performances recommended in the Vedic literatures, but actually all of them are meant for satisfying the Supreme Lord. Yajña means Viṣṇu. In the Third Chapter of Bhagavad-gītā it is clearly stated that one should only work for satisfying Yajña, or Viṣṇu. The perfectional form of human civilization, known as varṇāśrama-dharma, is specifically meant for satisfying Viṣṇu.*
*Therefore, Kṛṣṇa says in this verse, “I am the enjoyer of all sacrifices because I am the supreme master.” Less intelligent persons, however, without knowing this fact, worship demigods for temporary benefit. Therefore they fall down to material existence and do not achieve the desired goal of life. If, however, anyone has any material desire to be fulfilled, he had better pray for it to the Supreme Lord (although that is not pure devotion), and he will thus achieve the desired result.*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 209 / Agni Maha Purana - 209 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 61*
*🌻. ద్వారప్రతిష్టా ధ్వజారోహణాది విధిః - 4 🌻*
*లేదా దాని పొడవు శిఖరముయొక్క సగముభాగము లేదా మూడవవంతు ఎంత ఉండునో అంత ఉండవలెను. లేదా ద్వారము పొడవుకంటె రెట్టింపు పొడవు ఉండవలెను. ఆ ధ్వజదండమును దేవాలయముపై ఈశాన్యమున గాని, వాయవ్యమున గాని స్థాపింపవలెను. ధ్వజవస్త్రము (పతాక) పట్టుగుడ్డ మొదలైనవాటితో విచిత్రవర్ణముగ నుండునట్లు చేయవలెను. లేదా ఒకే రంగు ఉండునట్లు చేయవలెను. దానికి ఘంట, చామరములు, చిరుగంటలు కట్టినచో అది సర్వపాపవినాశకమగును. దండాగ్రమునుండి నేలవరకు వ్రేలాడు వస్త్రమునకు "మహాధ్వజము" అని పేరు. అది సంపూర్ణమునోరథముల నిచ్చును. దానికంటె నాల్గవ వంతు చిన్న దైనదానిని పూజించినచో సర్వమనోరథము సిద్దించును.*
*ధ్వజములో సగము ప్రమాణము గల వస్త్రముతో నిర్మించినదానికి 'పతాక' అని పేరు లేదా పతాకకు కొలత ఏదియు అవసరము లేదు. ధ్వజ విస్తారము ఇదువది అంగుళము లుండవలెను. చక్ర-దండ-ధ్వజముల అధివాసనమును దేవతామూర్తులకు వలె చేసి, స్రకలీకరణము గూడ కావించి, మండపస్నానాదికార్యములు కూడ చేయవలెను. నేత్రోన్మీలనము తప్ప వెనుక చెప్పిన కార్యము లన్నియు చేయవలెను. ఆచార్యుడు వీటి నన్నింటిని శయ్యపై ఉంచి అదివాసనము చేయవలెను. పిమ్మట విద్వాంసుడు " సహస్రశీర్షా" ఇత్యాదిసూక్తమును ధ్వజాంకితచక్రముపై న్యాసము చేసి, సుదర్శన మంత్రమును, మనస్తత్త్వమును గూడ న్యాసము చేయవలెను. అది మనోరూపమున ఆ చక్రమున సజీవీకరణము. సురశ్రేష్ఠా! పండ్రెండు ఆకులపై (అదములపై) క్రమముగ కేశవాదిమూర్తుల న్యాసము చేయవలెను. కమలముపై నృసింహుని గాని, విశ్వరూపుని గాని ఉంచవలెను.*
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Agni Maha Purana - 209 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *
*Chapter 61*
*🌻Consecration of doors of the temple and the erection of banner - 4 🌻*
31. The length of the staff is spoken as the measure of the breadth of edifice. It should be made either half of the terrace or a third part of it.
32. The staff should otherwise be made twice the length of the door. The flag staff should be planted on the north-east or the north-west of the divine edifice.
33. The flag should be made of a piece of silk cloth, of a single or variegated colours. It should be adorned with bells, chowries and small bells. (It is said to be) destroyer of sins.
34. A flag which touches the ground and measures a cubit in breadth at its extremity or has a breadth equal to one fourth of its length at its base is called a mahādhvaja. It grants all things when worshipped.
35. The banner should measure half (the dimension of) the staff. The breadth should measure twenty fingers.
36. All the rites relating to the consentration of an image should be done for (the consecration) of the disc, flag and the staff. They should be bathed in the shed.
37. The priest should duly perform all rites described earlier except that of opening the eyes. The consecration should be done in the prescribed manner leaving them in the resting position.
38. Then the learned priest should assign (mentally) the hymn (called) sahasraśīrṣā[3] in the disc. Then the sudarśana mantra and the principle of mind should be assigned.
39. It is known as imbued with life by mental formation. O excellent among gods, (the different forms of Viṣṇu such as) Keśava etc. should be assigned to the spokes.
40. The priest should assign twenty-five principles at the navel, and each of the arcs of the lotus. The form of Nṛsiṃha (the man-lion form of Viṣṇu) representing the universe should be assigned to the middle of the lotus.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 74 / DAILY WISDOM - 74 🌹*
*🍀 📖. బృహదారణ్యక ఉపనిషత్తు నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🌻 14. ఏమీ నుండి ఏమీ రాదు 🌻*
*సృష్టిలో, కొత్త వస్తువు ఏదీ సృష్టించబడదు, ఎందుకంటే శూన్యం నుండి ఏమీ రాదు. ఒక కొత్త వస్తువు సృష్టించబడాలంటే, అది శూన్యం నుండి వచ్చి ఉండాలి. ‘శూన్యం’ ‘సృష్టి’ని ఎలా తయారు చేస్తుంది? ఇది అశాస్త్రీయం. ప్రభావం ఏదో ఒక కారణ స్థితిలో ఉండి ఉండాలి. ఈ కారణం విశ్వంపదార్ధం. ఇప్పుడు, అసలు కారణ స్థితికి భిన్నంగా సృష్టించబడిన విశ్వం యొక్క విలక్షణమైన గుర్తు ఏమిటి? ఏ విధంగా ప్రభావం కారణం నుండి వేరు చేయబడుతుంది?*
*ప్రభావంలో ఉన్న ప్రతిదీ కారణంలో ఉంటే, విలక్షణమైన లక్షణం ఏమిటి, కారణం నుండి ప్రభావాన్ని వేరు చేసే విశిష్ట గుర్తు ఏమిటి? ప్రభావం కారణం నుండి పూర్తిగా భిన్నంగా ఉన్నట్లయితే, కారణం ఉనికిలో లేనందున మనం ఒక కారణాన్ని అస్సలు సూచించలేము. కారణం ఉనికిలో లేకుంటే, ప్రభావం కూడా ఉనికిలో ఉండదు. కాబట్టి, కారణం తప్పనిసరిగా ఆదిమ స్థితిలో ప్రభావాన్ని కలిగి ఉండాలి; అందువల్ల, కారణంలో లేనిది ప్రభావంలో దృశ్యమానం చేయబడలేదు.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 74 🌹*
*🍀 📖 The Brihadaranyaka Upanishad 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
*🌻 14. Nothing Can Come from Nothing 🌻*
*In creation, a new thing is not created, because nothing can come from nothing. If a new thing is to be created, it must have been produced out of nothing. How can ‘nothing’ produce ‘something’? This is illogical. The effect must have existed in some causal state. This causal state is the substance of the universe. Now, what is actually the distinctive mark of the universe that is created, as different from the original causal condition? In what way does the effect get differentiated from the cause?*
*If everything that is in the effect is in the cause, what is the distinctive feature, what is the distinguishing mark, which separates the effect from the cause? If the effect is entirely different from the cause, we cannot posit a cause at all, because the cause is non-existent. If the cause is non-existent, the effect also would be non-existent. So, the cause must have contained the effect in a primordial state; and, therefore, nothing can be visualised in the effect which could not have been in the cause.*
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 339 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. మనం యాంత్రికత నించీ బయటపడాలి. ప్రతిపనిలో కొంత నెమ్మదించాలి. మెలకువతో వుండాలి. ప్రతిదీ నెమ్మదిగా నిర్వహించు. శాంతంగా, దయాన్వితంగా చేయి. అప్పుడు ప్రతిదీ చైతన్యవంతమయిన ధ్యానమవుతుంది. 🍀*
*మనిషి సాధారణంగా 'రోబోట్' లాగా జీవిస్తాడు. పనులు చేస్తూ పోతాడు కానీ అతడు అక్కడ వుండడు. తింటాడు. నడుస్తాడు. మాట్లాడతాడు, వింటాడు. కానీ అక్కడ వుండదు. మనసు ప్రపంచమంతా చక్కర్లు కొడుతూ వుంటుంది. బయట టేబుల్ దగ్గర కూచుని నువ్వు టిఫెన్ చేస్తూ వుండవచ్చు, కానీ లోపల నువ్వు చంద్రుడి మీద వుంటావు. లేదా యింకో పనికి మాలిన చోట వుంటావు. అక్కడ వుండకూకడదని కాదు. ఎక్కడయినా వుండవచ్చు. ఒకటి మాత్రం కచ్చితం. కానీ నువ్వు టుబుల్ దగ్గరయితే మాత్రం లేవు. యాంత్రికంగా వున్నావు. మనం యాంత్రికత నించీ బయటపడాలి. ప్రతిపనిలో కొంత నెమ్మదించాలి. మెలకువతో వుండాలి.*
*నువ్వు నడిస్తే పాత స్థలంలో వెనకటికి నడిచినట్లే నడవకు. నెమ్మదిగా నడువు. జాగ్రత్తగా నడువు. లేకుంటే వెనకట్లా నడుస్తావు. ప్రతిదీ నెమ్మదిగా నిర్వహించు. శాంతంగా, దయాన్వితంగా చేయి. అప్పుడు ప్రతిదీ చైతన్యవంతమయిన ధ్యానమవుతుంది. మన చర్యల్ని ధ్యానంగా పరివర్తింప చేయొచ్చు. ఉదయం నించీ సాయంత్రం దాకా జీవితం ధ్యానం గుండా సాగవచ్చు. ఆ నిద్ర లేస్తునే ఆ స్పృహతో వుండు. మెల్లమెల్లగా నీ తలుపు తట్టిన శబ్దం వినిపిస్తుంది. నీకు రహస్యపు తాళం చెవి అందుతుంది. అది చాలా ముఖ్యమయిన విషయం. అది చాలా ముఖ్యమయిన విషయం.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శివ సూత్రములు - 076 / Siva Sutras - 076 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*2వ భాగం - శక్తోపాయ*
*✍️. ప్రసాద్ భరధ్వాజ*
*🌻 01. చిత్తం మంత్రః - 3 🌻*
*🌴. స్వీయ-సాక్షాత్కారమైన యోగి యొక్క చైతన్యమే (చిత్తం) మంత్రం. శక్తిని ఆవాహన చేసే మరియు వ్యక్తీకరించే సిద్ధి.🌴*
*ఆధ్యాత్మిక అన్వేషణల ప్రారంభ దశలో, మనస్సును నియంత్రించడం అంత సులభం కాదు. నిరంతర సాధన ద్వారానే మనస్సుపై సమర్థవంతమైన నియంత్రణ సాధ్యమవుతుంది. మంత్రం యొక్క ప్రధాన లక్ష్యం తన మనస్సుకు ఏకాగ్రత కలిగించడం. ఒక ఉప ఉత్పత్తిగా, అతను ఆధ్యాత్మిక మార్గాన్ని అతిక్రమించకుండా కూడా రక్షించబడతాడు. అభ్యాసకుడు, మంత్రం మరియు దైవం మధ్య సరైన అమరిక కుదరకపోతే ఏ మంత్రం ఫలించదు. ఇక్కడే చైతన్యానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. అటువంటి అమరిక మనస్సు యొక్క స్వచ్ఛమైన రూపంలో మాత్రమే జరుగుతుంది. ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించేటప్పుడు ఆలోచన మరియు మనస్సు యొక్క స్వచ్ఛత చాలా ముఖ్యం. అందుకే మంత్రాలను గొంతుతో కాకుండా మానసికంగా పఠిస్తారు.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Siva Sutras - 076 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 2 - Śāktopāya.
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*
*🌻 01. Cittaṁ mantraḥ - 3 🌻*
*🌴. The consciousness (chitta) of a self-realized yogi is mantra, with the power to invoke and manifest the shaktis.🌴*
*In the initial stages spiritual pursuits, it is not easy to control the mind. An effective control of the mind can be achieved only by persistent practice. Mantra’s main objective is to tune his mind to concentrate. As a byproduct, he is also protected from transgressing spiritual path. No mantra will fructify if proper alignment is not made between the practitioner, mantra and the deity. This is where consciousness assumes greater significance. Such alignment can happen only in the purest form of the mind. Purity of thought and mind is very important while pursuing spiritual path. That is why, mantra-s are recited mentally and not vocally.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
Comments