🍀🌹 28, FEBRUARY 2023 MONDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 28, FEBRUARY 2023 MONDAY, మంగళవారం, భాను వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 333 / Bhagavad-Gita -333 🌹 🌴 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం / Akshara Brahma Yoga - 23 వ శ్లోకము 🌴
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 180 / Agni Maha Purana - 180 🌹 🌻. పిండికాది లక్షణములు / The characteristics of the pedestal (piṇḍikā-lakṣaṇa) 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 045 / DAILY WISDOM - 045 🌹 🌻 14. ప్రపంచం మరియు మనము తప్ప మరేమీ లేదు / 14. The World and Ourselves, There is Nothing Else 🌻
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 310 🌹
6) 🌹. శివ సూత్రములు - 47 / Siva Sutras - 47 🌹
🌻 15. హృదయే చిత్తసంఘటాత్ దృశ్య స్వప దర్శనం - 3 / 15. Hṛdaye cittasaṃghaṭṭād dṛśyasvā padarśanam - 3 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹28, ఫిబ్రవరి, February 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు🌻*
*🍀. అపరాజితా స్తోత్రం - 8 🍀*
15. యా దేవీ సర్వభూతేషు జాతిరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
16. యా దేవీ సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : సమస్త ప్రపంచమూ చైతన్య మయమేనన్న అనుభూతి నీవు పొందడానికి, నీ యందు మనస్సుతో పాటుగా నీ భౌతిక చైతన్యం కూడా నిద్ర నుండి మేల్కొని, అన్నిటిలోనూ అనుస్యూతమైవున్న ఏకత్వాన్ని గుర్తించడం అవసరం. 🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్, శిశిర ఋతువు,
ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం
తిథి: శుక్ల-నవమి 28:20:18 వరకు
తదుపరి శుక్ల-దశమి
నక్షత్రం: రోహిణి 07:20:52 వరకు
తదుపరి మృగశిర
యోగం: వషకుంభ 16:25:04 వరకు
తదుపరి ప్రీతి
కరణం: బాలవ 15:19:46 వరకు
వర్జ్యం: 13:31:28 - 15:17:36
దుర్ముహూర్తం: 08:56:42 - 09:43:49
రాహు కాలం: 15:25:26 - 16:53:47
గుళిక కాలం: 12:28:44 - 13:57:05
యమ గండం: 09:32:02 - 11:00:23
అభిజిత్ ముహూర్తం: 12:05 - 12:51
అమృత కాలం: 03:51:52 - 05:35:56
సూర్యోదయం: 06:35:20
సూర్యాస్తమయం: 18:22:08
చంద్రోదయం: 12:24:39
చంద్రాస్తమయం: 01:11:22
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంచార రాశి: వృషభం
యోగాలు: మతంగ యోగం - అశ్వ లాభం
07:20:52 వరకు తదుపరి రాక్షస యోగం
- మిత్ర కలహం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 333 / Bhagavad-Gita - 333 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం - 23 🌴*
*23. యత్ర కాలే త్వనావృత్తిమావృత్తిం చైవ యోగిన: |*
*ప్రయాతా యాన్తి తం కాలం వక్ష్యామి భరతర్షభ ||*
🌷. తాత్పర్యం :
*ఓ భరతవంశశ్రేష్టుడా! ఏయే కాలములందు ఈ జగమును వీడుట ద్వారా యోగి వెనుకకు తిరిగి వచ్చుట జరుగనునో లేక తిరిగిరాకుండునో నీకు నేనిప్పుడు వివరించెదను.*
🌷. భాష్యము :
సంపూర్ణశరణాగతులైన అనన్యభక్తులు తమ దేహత్యాగము ఎప్పుడు జరుగునున్న విషయము గాని, ఈ విధముగా జరుగనున్నదనెడి విషయము గాని పట్టించుకొనరు. సర్వమును కేవలము శ్రీకృష్ణుని చేతులలో వదలి సులభముగా, నిశ్చింతగా, సుఖముగా వారు కృష్ణధామమును చేరుదురు. కాని అనన్యభక్తులు గాక ఆత్మానుభమునకై కర్మయోగము, జ్ఞానయోగము, హఠయోగాది పద్ధతులపై ఆధారపడెడివారు మాత్రము తగిన సమయమునందే దేహత్యాగము చేయవలసియుండును. దానిపైననే వారు ఈ జన్మ, మృత్యువులు కలిగిన జగమునాకు తిరిగి వచ్చుటయో లేక తిరిగి రాకపోవుటయో ఆధారపడియుండును.
యోగియైనవాడు పూర్ణత్వమును సాధించినచో ఈ భౌతికజగమును వీడుటకు సరియైన స్థితిని, సమయమును నిర్ణయించుకొనగలడు. కాని పూర్ణుడుగాని వాని సఫలత యాదృచ్చికముగా తగిన సమయమున జరుగు అతని దేహత్యాగముపై ఆధారపది యుండును. ఏ సమయమున మరణించినచో తిరిగి వెనుకకు రావలసిన అవసరము కలుగదో అట్టి తగిన సమయములను గూర్చి శ్రీకృష్ణభగవానుడు రాబోవు శ్లోకములో వివరింపనున్నాడు. ఆచార్యులైన శ్రీ బలదేవవిద్యాభూషణుల వ్యాఖ్యానము ననుసరించి “కాలము” అను సంస్కృతపదము ఇచ్చట కాలము యొక్క అధిష్టానదేవతను సూచించుచున్నది.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 333 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 23 🌴*
*23 . yatra kāle tv anāvṛttim āvṛttiṁ caiva yoginaḥ*
*prayātā yānti taṁ kālaṁ vakṣyāmi bharatarṣabha*
🌷 Translation :
*O best of the Bhāratas, I shall now explain to you the different times at which, passing away from this world, the yogī does or does not come back.*
🌹 Purport :
The unalloyed devotees of the Supreme Lord, who are totally surrendered souls, do not care when they leave their bodies or by what method. They leave everything in Kṛṣṇa’s hands and so easily and happily return to Godhead. But those who are not unalloyed devotees and who depend instead on such methods of spiritual realization as karma-yoga, jñāna-yoga and haṭha-yoga must leave the body at a suitable time in order to be sure of whether or not they will return to the world of birth and death.
If the yogī is perfect he can select the time and situation for leaving this material world. But if he is not so expert his success depends on his accidentally passing away at a certain suitable time. The suitable times at which one passes away and does not come back are explained by the Lord in the next verse. According to Ācārya Baladeva Vidyābhūṣaṇa, the Sanskrit word kāla used herein refers to the presiding deity of time.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 180 / Agni Maha Purana - 180 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 55*
*🌻. పిండికాది లక్షణములు - 1 🌻*
హయాగ్రీవుడు చెప్పెను: బ్రహ్మదేవా! నే నిపుడు ప్రతిమల పిండికల లక్షణమును చెప్పెదను. పిండిక పొడవు ప్రతిమ పొడవుతో సమానముగా ఉండవలెను; వెడల్పు దానిలో సగముండవలెను. దాని ఎత్తు ప్రతిమ ఎత్తులో సగముండవలెను. లేదా దాని విస్తారము పొడవులో తృతీయాంశముండవలెను. దాని మూడ వంతుచే మేఖల నిర్మింపవెలను. నీరు ప్రవహించుటకై ఉన్న గర్తము కొలత, మేఖల కొలతతో తుల్యముగా నుండవలెను. ఆ గర్తము ఉత్తరమువైపు కొంచెము పల్లముగా నుండవలెను. పిండిక విస్తారములో నాల్గవవంతుతో జలము బైటకు పోవుటకై ప్రణాలము నిర్మించవలెను. మూలభాగమున దానివిస్తారము మూలముతో సమముగా నుండవలెను. పైకి పోయినకొలది సగముండవలెను. ఆ జలమార్గము పిండికా విస్తారములో మూడవవంతుగాని, సగముగాని ఉండవలెను. దాని పొడవు ప్రతిమాపొడవెంతయో అంతే ఉండవలెనని చెప్పబిడనది. లేదా ప్రతిమ పొడవు పిండిక పొడవులో సగముండవలెను. ఈ విషయము బాగుగా అర్ధముచేసికొని దానికి సూత్రపాతము చేయవలెను.
వెనుక చెప్పినట్లు, ప్రతిమ ఎత్తు షోడశభాగసంఖ్యానుసారముగ చేయవలెను. ఎనిమిది భాగము క్రిందనున్న అర్ధాంగముగా చేయవలెను. దీనిపైననున్న మూడుభాగములు గ్రహించి కంఠమును నిర్మింపవలెను. మిగిలిన భాగములను ఒక్కొక్క దానిని ప్రతిష్ఠ, నిర్గమము, పట్టిక మొదలగువాటి రూపమున విభజింపవలెను. ఇది ప్రతిమాపిండికల సామాన్య లక్షణము. ప్రాసాదద్వార దైర్ఘ్యవిస్తారములనుపట్టి ప్రతిమా గృహ ద్వారముండవలెను. ప్రతిమల ప్రభలపై ఏనుగులు, సర్పములు మొదలగు వాటి మూర్తులను నిర్మింపవలెను. శ్రీహరియొక్క పిండికను గూడ యథోచిత శోభాసంపన్నముగ నుండునట్లు చేయవలెను. అన్ని దేవప్రతిమల ప్రమాణము విష్ణు ప్రతిమకు చెప్పిన ప్రమాణమువలె నుండవలెను. దేవీప్రతిమల ప్రమాణము లక్ష్మీప్రతిమకు చెప్పిన విధముననే ఉండవలెను.
శ్రీ అగ్నిమహాపురాణమునందు పిండికాది లక్షణమును ఏబదియైదవ అధ్యాయము సమాప్తము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Agni Maha Purana - 180 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *
*Chapter 55*
*🌻The characteristics of the pedestal (piṇḍikā-lakṣaṇa) - 1 🌻*
The Lord said:
I. I shall describe (the characteristics of) the pedestal of images [i.e., piṇḍikā]. They have the same length as (the height) of the image and have breadth half (the height) of (the image).
2. Or the breadth should be half or one-third of the measure of the height. The girdle should be equal to one-third of its breadth.
3. The cavity should be of the same measure and should be inclined towards the posterior part. A quarter of the breadth (should be left out) for the canal as outlet.
4. (The width) of the forepart (of the channel) should be half of the breadth of the base. The water-course should be one-third of the breadth (of the base).
5. Or else the length of the liṅga is said to be equal to half (the length) of the base or equal to the length (of the base).
6. The height (of the pedestal [i.e., piṇḍikā]) should be divided into sixteen parts as before. The lower six divisions should be made to comprise two parts. The neck should be three parts.
7. The foundation, projections, joint, seat and other remaining parts should each comprise one part. This will hold good in the case of ordinary images.
8. The door-way (leading) to the image is said to be proportionate to the door-way of the temple. The canopy over the image should be endowed with elephants and tigers.
9. The pedestal of (the image of) Hari also should always be made beautiful. The measures (laid down) for the images of Viṣṇu shall apply to (the images of) all gods. Those measures set forth for the image of Lakṣmī shall apply to all (images of) the goddesses.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 45 / DAILY WISDOM - 45 🌹*
*🍀 📖. యోగా యొక్క తత్వశాస్త్రం నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🌻 14. ప్రపంచం మరియు మనము తప్ప మరేమీ లేదు 🌻*
*ఈ ప్రపంచంలో మనం చూసేది రెండు విషయాలు మాత్రమే: ప్రపంచం మరియు మనం. ఇంకేమీ లేదు. మనం చుట్టూ చూస్తే, ఖగోళ మరియు భౌగోళిక విస్తరణ యొక్క విస్తారమైన ప్రపంచాన్ని చూస్తాము. ఈ శక్తివంతమైన ప్రపంచంలో మనం చిన్న వ్యక్తులుగా ఉన్నాము. మనం ఇంకా ఏమి చూడగలం? 'నేను ఇక్కడ ఉన్నాను మరియు ప్రపంచం అక్కడ ఉంది.' వ్యక్తి మరియు ప్రపంచం- ఇవే వాస్తవాలు. బహుశా, మనం రెండు వాస్తవాలను కలిగి ఉన్నామని చెప్పవచ్చు. ఇదే సత్యం అయితే, మరియు మనం సత్యాన్ని అన్వేషిస్తున్నట్లైతే, ఈ నిర్వచనం నుండి మనం ప్రపంచాన్ని అన్వేషిస్తున్నామని లేదా మనల్ని మనం అన్వేషించుకుంటున్నామని మని అర్థం చేసుకోవచ్చు.*
*సహజంగానే, అది ఇలాగే ఉండాలి. ఎందుకంటే మేము చెప్పినట్లుగా రెండు విషయాలు మాత్రమే ఉన్నాయి: మేము అక్కడ ఉన్నాము మరియు ప్రపంచం ఇక్కడ ఉంది. మనం వాస్తవమైతే, లేదా ఈ ప్రపంచం వాస్తవమైతే, మనం మనల్నిగానీ, ప్రపంచాన్ని గానీ, లేదా రెండింటినీ వెతుకుతున్నాము. కానీ, వాస్తవానికి, మనం ఈ రెండింటినీ కనుగొనలేదు. మనం ప్రపంచాన్ని అన్వేషిస్తున్నట్లు అనిపించినా, ప్రపంచం మన ఆధీనంలో లేదు.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 45 🌹*
*🍀 📖 Philosophy of Yoga 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
*🌻 14. The World and Ourselves, There is Nothing Else 🌻*
*There are only two things that we see in this world: the world and ourselves. There is nothing else. If we look around, we see the vast world of astronomical phenomena and geographical extension, and we are there as small individuals in this mighty world. What else can we see? “I am here, and the world is there.” The individual and the world are the realities. Perhaps we may say, in a general manner, that we conceive two realities. If this is our concept of what is real, and we are certainly in search of what is real, it would follow from this answer or definition that we are in search of the world, or we are in search of ourselves.*
*Naturally, this should be so, because there are only two things, as we said: We are there, and the world is there. If we are there as a reality, or the world is there as a reality, we are in search of either of these, or both of them. But, actually, we have not found either of these. Though we seem to be in search of the world, the world is not under our possession.*
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 310 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. విలువైన దాన్ని అందుకోవడమన్నది ఉన్నత లక్ష్యం. కొంతమందే నిలుపుకుంటారు. కొంత మంది ఖాళీ చేతుల్తో వస్తారు. ఖాళీ చేతుల్తో వెళతారు. అందుకు సిగ్గుపడాలి. 🍀*
*చాలా వీలవుతుంది. ఐతే దాన్ని సాధ్యం చేయాలి. దానికి చైతన్యంతో పని చేయాలి. అదెలాంటిదంటే నీ దగ్గర కావలసినంత భూమి వుంది. కావలసినంత నీరు, కావలసినన్ని గింజలు వున్నాయి. కానీ నువ్వు పొలంలో విత్తనాలు వెయ్యలేదు. పూలు పూయవు, భూమి ఎడారిగానే వుంటుంది. గడ్డి పెరుగుతుంది. చెట్లు పెరుగుతాయి. పనికిమాలినవి అడ్డదిడ్డంగా పెరుగుతాయి. విలువైన దాన్ని అందుకోవడమన్నది ఉన్నత లక్ష్యం.*
*నువ్వేమీ చెయ్యకపోతే అడ్డదిడ్డంగా చెట్లు పెరుగుతాయి. అక్కడ గులాబీ పూలకోసం వెతికి లాభం లేదు. అందరూ గొప్ప హామీలతో వస్తారు. కొంతమందే నిలుపుకుంటారు. కొంత మంది ఖాళీ చేతుల్తో వస్తారు. ఖాళీ చేతుల్తో వెళతారు. అందుకు సిగ్గుపడాలి. కానీ నా సన్యాసులు పూర్తిగా సంతృప్తిగా వుంటారు. వాళ్ళు హామీలు నెరవేరుస్తారు. నిలుపుకుంటారు.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శివ సూత్రములు - 047 / Siva Sutras - 047 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*1- శాంభవోపాయ*
*✍️. ప్రసాద్ భరధ్వాజ*
*🌻 15. హృదయే చిత్తసంఘటాత్ దృశ్య స్వప దర్శనం - 3 🌻*
*🌴. మనస్సును దాని కేంద్రములో ఉంచడం ద్వారా అవగాహన చేసుకొను శూన్యతను గ్రహించవచ్చు.🌴*
*యోగి విషయానికొస్తే, అతను మెలకువగా ఉన్నప్పుడు కూడా ఈ దశలను చేరుకోగలడు. అతను మెలకువగా ఉన్నప్పుడు కూడా తన మనస్సును వస్తుమయ ప్రపంచం నుండి వేరు చేయగలడు. దానిని చైతన్యంతో ఏకం చేయగలడు. అతను ఇప్పుడు విశ్వజనీనత మరియు ఏకత్వం యొక్క స్ఫూర్తిని అర్థం చేసుకున్నాడు. అతను ఇంద్రియాల ప్రభావాన్ని విస్మరించగలడు.*
*ఇక్కడ ప్రస్తావించబడిన శూన్యత ఆత్మ యొక్క స్థానం అయిన హృదయంలో ఉంది. ఒక వ్యక్తి తన మనస్సు మరియు ఆత్మ మధ్య సంబంధాన్ని ఏర్పరచుకున్నప్పుడు, అతని చైతన్యం విశ్వవ్యాప్త చైతన్యంగా మారుతుంది. ఒక వ్యక్తి లోపల చూడటం ద్వారా దీన్ని చేయగలిగినప్పుడు (లోపలికి చూడటం అనేది అతని ఆత్మ మరియు అతని మనస్సును అనుసంధానించే ప్రక్రియ. రెండూ అతని అంతరంగంలో అందుబాటులో ఉంటాయి), అతను లోపలికి చూడడమే కాదు, మొత్తం విశ్వాన్ని తనదిగా చూస్తాడు. అతని చైతన్యం ఇప్పుడు శివ చైతన్యానికి వాహనం అవుతుంది.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Siva Sutras - 047 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 1 - Sāmbhavopāya
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*
*🌻 15. Hṛdaye cittasaṃghaṭṭād dṛśyasvā padarśanam - 3 🌻*
*🌴. By fixing the mind on its core one can comprehend perceivable emptiness.🌴*
*In the case of a yogi, he is able to reach these stages even when he is awake. He is able to disconnect his mind from the objective world even while he is awake and unites it with the essence of consciousness. He now understands the spirit of Universality and Oneness. He is able to discard the influence of senses.*
*The void that is referred here is within the heart, the seat of soul. When one establishes a connection between his mind and soul, his consciousness transforms into universal consciousness. When one is able to do this by looking within (looking within is the process of connecting his soul and his mind, both of them are available within his inner self), he not only looks within, but also looking at the entire universe as his own. His consciousness now becomes the vehicle of Shiva consciousness.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages
Join and Share
Comments