🍀🌹 28, JULY 2023 FRIDAYDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 28, JULY 2023 FRIDAYDAY శుక్రవారం, బృగు వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹 కపిల గీత - 212 / Kapila Gita - 212🌹
🌴 5. భక్తి స్వరూపము - కాలమహిమ - 22 / 5. Form of Bhakti - Glory of Time - 22 🌴
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 804 / Vishnu Sahasranama Contemplation - 804 🌹
🌻804. మహాగర్తః, महागर्तः, Mahāgartaḥ🌻
4) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 765 / Sri Siva Maha Purana - 765 🌹
🌻. విష్ణు జలంధర యుద్ధము - 1 / The fight between Viṣṇu and Jalandhara - 1 🌻
5) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 019 / Osho Daily Meditations - 019 🌹
🍀 19. సహజత్వం / 19. SPONTANEITY🍀
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 466 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 466 - 3 🌹
🌻 466. ‘సూక్ష్మరూపిణి’ - 3 / 466. 'Sukshmarupini' - 3 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 28, జూలై, JULY 2023 పంచాంగము - Panchangam 🌹*
*శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻*
*🍀. శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం - 02 🍀*
*03. ఈశావాస్యా మహామాయా మహాదేవీ మహేశ్వరీ ।*
*హృల్లేఖా పరమా శక్తిర్మాతృకాబీజరూపిణీ ॥*
*04. నిత్యానందా నిత్యబోధా నాదినీ జనమోదినీ ।*
*సత్యప్రత్యయనీ చైవ స్వప్రకాశాత్మరూపిణీ ॥*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : విశుద్ధ స్థాయిలో చేతనా ప్రతిష్ఠ- అంతస్సత్తయం దెచ్చటనో, అస్పష్టమైన ఆశాభంగం పొందిన హేతువు చేతనే, సామాన్యంగా అనేకులు అధ్యాత్మిక జీవనంలోనికి మళ్ళడం, లేక నెట్టబడడం జరుగుతూ వుంటుంది. కొందరిలో అది వైరాగ్యరూపం ధరించి మోక్షసాధనకై ప్రేరేపిస్తుంది కాని, పూర్ణ యోగసాధనలో ముఖ్యంగా జరుగవలసినది మాత్రం, అంతస్సత్తయందలి ఈ కలగాపులగపు స్థితి తొలగి విశుద్ధస్థాయిలో చేతన సుప్రతిష్ఠితం కావడం. 🍀*
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
వర్ష ఋతువు, దక్షిణాయణం,
శ్రావణ మాసం
తిథి: శుక్ల-దశమి 14:52:18 వరకు
తదుపరి శుక్ల-ఏకాదశి
నక్షత్రం: అనూరాధ 24:56:59
వరకు తదుపరి జ్యేష్ఠ
యోగం: శుక్ల 11:57:33 వరకు
తదుపరి బ్రహ్మ
కరణం: గార 14:45:18 వరకు
వర్జ్యం: 05:23:30 - 06:57:18
మరియు 30:13:06 - 31:43:42
దుర్ముహూర్తం: 08:29:24 - 09:21:12
మరియు 12:48:25 - 13:40:13
రాహు కాలం: 10:45:23 - 12:22:31
గుళిక కాలం: 07:31:07 - 09:08:15
యమ గండం: 15:36:46 - 17:13:54
అభిజిత్ ముహూర్తం: 11:57 - 12:47
అమృత కాలం: 14:46:18 - 16:20:06
సూర్యోదయం: 05:54:01
సూర్యాస్తమయం: 18:51:01
చంద్రోదయం: 14:35:10
చంద్రాస్తమయం: 01:03:23
సూర్య సంచార రాశి: కర్కాటకం
చంద్ర సంచార రాశి: వృశ్చికం
యోగాలు: రాక్షస యోగం - మిత్ర
కలహం 24:56:59 వరకు తదుపరి
చర యోగం - దుర్వార్త శ్రవణం
దిశ శూల: పశ్చిమం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. కపిల గీత - 212 / Kapila Gita - 212 🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. ప్రసాద్ భరధ్వాజ*
*🌴 5. భక్తి స్వరూపము - కాలమహిమ - 22 🌴*
*22. యో మాం సర్వేషు భూతేషు సంతమాత్మా నమీశ్వరమ్|*
*హిత్వార్చాం భజతే మౌఢ్యాద్భస్మన్యేవ జుహోతి సః॥*
*తాత్పర్యము : సకల ప్రాణులలో అంతర్యామిగా ఉన్నవాడు పరమేశ్వరుడే. మోహవశమున (అజ్ఞానముచే) ఈ విషయమును మరచి, ప్రాణులయెడ ఉపేక్షాభావము వహించుచు, కేవలము దైవము యొక్క అర్చా మూర్తిని సేవించుట బూడిదలో హోమము చేయుటవంటిది.*
*వ్యాఖ్య : నేను అందరిలో ఉన్నా అన్న సంగతి మరచిపోయి "నాకు మాత్రమే ఆరాధనార్హత ఉంది. నేను మాత్రమే భగవానుని పొందుతాను" అంటారు. అర్చావతారముండాలి, కానీ భాగవతోత్తములని అవమానించే భగవదారాధన చేయాలి. ఒకవేళ భగవదారాధనలో ఆచార్యులు వస్తే, భగవదారాధన ఆపి, ఆచార్యులని ఆరాధించాలి. అది పూజ ఆపినట్లు కాదు. భాగవతారాధన కూడా భగవదారాధనలో భాగమే. అది తెలుసుకోని వారి పూజ, అగ్నిహోత్రములో వేసిన బూడిద లాంటిది.*
*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Kapila Gita - 212 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*
*🌴 5. Form of Bhakti - Glory of Time - 22 🌴*
*22. yo māṁ sarveṣu bhūteṣu santam ātmānam īśvaram*
*hitvārcāṁ bhajate mauḍhyād bhasmany eva juhoti saḥ*
*MEANING : One who worships the Deity of Godhead in the temples but does not know that the Supreme Lord, as Paramātmā, is situated in every living entity's heart, must be in ignorance and is compared to one who offers oblations into ashes.*
*PURPORT : It is stated clearly herein that the Supreme Personality of Godhead, in His plenary expansion of Supersoul, is present in all living entities. The living entities have 8,400,000 different kinds of bodies, and the Supreme Personality of Godhead is living in every body both as the individual soul and as the Supersoul. Since the individual soul is part and parcel of the Supreme Lord, in that sense the Lord is living in every body, and, as Supersoul, the Lord is also present as a witness. In both cases the presence of God in every living entity is essential. Therefore persons who profess to belong to some religious sect but who do not feel the presence of the Supreme Personality of Godhead in every living entity, and everywhere else, are in the mode of ignorance. If, without this preliminary knowledge of the Lord's omnipresence, one simply attaches himself to the rituals in a temple, church or mosque, it is as if he were offering butter into ashes rather than into the fire. One offers sacrifices by pouring clarified butter into a fire and chanting Vedic mantras, but even if there are Vedic mantras and all conditions are favorable, if the clarified butter is poured on ashes, then such a sacrifice will be useless.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 804 / Vishnu Sahasranama Contemplation - 804🌹*
*🌻804. మహాగర్తః, महागर्तः, Mahāgartaḥ🌻*
*ఓం మహాగర్తాయ నమః | ॐ महागर्ताय नमः | OM Mahāgartāya namaḥ*
గర్తవదస్య మహతీ మాయా విష్ణోర్దురత్యయా ।
ఇతి సోఽయం మహాగర్త ఇతి సఙ్కీర్త్యతే బుధైః ॥
మాయా దురత్యయేతి శ్రీకృష్ణేన స్వయమీరణాత్ ।
నైరుక్తైర్వా గర్తశబ్దో రథపర్యాయ ఇష్యతే ॥
మహారథో మహాగర్త ఇతి తస్మాత్‍స ఉచ్యతే ।
అస్య మహార్థత్వం తు ప్రసిద్ధం భారతాదిషు ॥
*గోయి వలె మిగుల లోతయినది, చాల పెద్దది అగు మాయ ఎవ్వనిదియో అట్టివాడు. 'మమ మాయా దురత్యయ' (భగవద్గీత 7.14) - నా మాయ దాటరానిది అను భగవద్వచనము ఇట ప్రమాణముగా గ్రహించబడగియున్నది. లేదా 'గర్త' శబ్దమునకు 'రథము' అను అర్థము కలదని నిరుక్త కారులు చెప్పియున్నారు. అందువలన గొప్పదియగు రథము ఎవనికి కలదో అట్టివాడు. ఈతడు అట్టి మహారథము కల వీరుడను విషయము భారతాదులయందు ప్రసిద్దమే.*
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 804🌹*
*🌻804. Mahāgartaḥ🌻*
*OM Mahāgartāya namaḥ*
गर्तवदस्य महती माया विष्णोर्दुरत्यया ।
इति सोऽयं महागर्त इति सङ्कीर्त्यते बुधैः ॥
माया दुरत्ययेति श्रीकृष्णेन स्वयमीरणात् ।
नैरुक्तैर्वा गर्तशब्दो रथपर्याय इष्यते ॥
महारथो महागर्त इति तस्मात्स उच्यते ।
अस्य महार्थत्वं तु प्रसिद्धं भारतादिषु ॥
Gartavadasya mahatī māyā viṣṇorduratyayā,
Iti so’yaṃ mahāgarta iti saṅkīrtyate budhaiḥ.
Māyā duratyayeti śrīkrṣṇena svayamīraṇāt,
Nairuktairvā gartaśabdo rathaparyāya iṣyate.
Mahāratho mahāgarta iti tasmātˈsa ucyate,
Asya mahārthatvaṃ tu prasiddhaṃ bhāratādiṣu.
*Like a great chasm, His māya or illusionary force is difficult to get over. So, He is Mahāgartaḥ vide the Lord's assertion*
*'मम माया दुरत्यय / Mama māyā duratyaya' (Bhagavadgīta 7.14) - My māya is difficult to get over.*
*Lexicographers say that garta is a synonym of ratha or chariot. So Mahāgartaḥ means Mahārathah - a great charioteer. That He is a great charioteer is celebrated in the great epic Mahābhārata and other works. Mahārathah is the highest distinction of the general of an army.*
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
सुवर्णबिंदुरक्षोभ्यस्सर्ववागीश्वरेश्वरः ।महाह्रदो महागर्तो महाभूतो महानिधिः ॥ ८६ ॥
సువర్ణబిందురక్షోభ్యస్సర్వవాగీశ్వరేశ్వరః ।మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానిధిః ॥ 86 ॥
Suvarṇabiṃdurakṣobhyassarvavāgīśvareśvaraḥ,Mahāhrado mahāgarto mahābhūto mahānidhiḥ ॥ 86 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 765 / Sri Siva Maha Purana - 765🌹*
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 17 🌴*
*🌻. విష్ణు జలంధర యుద్ధము - 1 🌻*
*సనత్కుమారుడిట్లు పలికెను - అపుడు మహావీరులగు రాక్షసులు భయముతో కల్లోలపడిన మనస్సు గల దేవతల నందరినీ శూలములతో, గొడ్డళ్లతో, పట్టిశములతో హింసించ మొదలిడిరి (1). రాక్షసుల ఆయుదములచే కొట్టబడిన దేహములు గల ఇంద్రాది దేవతలు అందరు భయముచే కల్లోల పడిన మనస్సులు గలవారై యుద్ధరంగమునుండి పరుగులెత్తిరి (2). ఇంద్రియములకు ప్రభువగు విష్ణువు పారిపోవుచున్న దేవతలను గాంచి గరుడుని అధిష్ఠించిన వాడై వెంటనే యుద్ధమునకు ముందునకురికెను (3). భక్తులకు అభయమునిచ్చు విష్ణువు అంతటా ప్రకాశించే కాంతులు గల సుదర్శన చక్రముతో విరాజిల్లు, పద్మము వంటి హస్తము గలవాడై ప్రకాశించెను (4).*
*శంఖమును, ఖడ్గమును, గదను, శార్‌ఙ్గమను ధనస్సును ధరించిన వాడు, బయంకరమగు అస్త్రములు గలవాడు, మహావీరుడు, అన్ని విధముల యుద్ధమునందు నిపుణుడు అగు విష్ణువు మిక్కిలి కోపించెను (5). విష్ణువు శార్‌ఙ్గధనస్సుపై బాణము నెక్కుపెట్టి సింహనాదమును చేసెను. ఓ మునీ! ఆ గొప్ప నాదముచు ముల్లోకములు నిండెను (6). దుఃఖముచే కల్లోలమైన మనస్సు గల విష్ణుభగవానుడు శారఞ్గధనస్సు నుండి బయల్వెడలిన బానములతో కోట్ల సంఖ్యలో రాక్షసుల తలలు తెగవేసెను (7).*
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 765🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *
*🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 17 🌴*
*🌻 The fight between Viṣṇu and Jalandhara - 1 🌻*
Sanatkumāra said:—
1. Then the heroic Asuras hit and struck the gods distressed and terrified, with the spears, axes and clubs.
2. With their bodies cut and pierced by the weapons of the Asuras, the gods including Indra became distressed in mind by fear and they fled from the battle.
3. On seeing the gods fleeing, Viṣṇu hastened to the battle ground seated on his vehicle Garuḍa.
4. By means of his discus Sudarśana he diffused his splendour all round. He shone with the brilliant lotus in his hand and offered fearlessness to his devotees.
5. Holding the conch, sword, mace and the bow, the heroic deity was very furious. He was efficient in the battle using fierce weapons.
6. He produced the twanging sound from his bow and roared aloud. O sage, all the three worlds were filled with its loud sound.
7. The lord Viṣṇu who was highly infuriated cut off the heads of countless Asuras by means of the arrows discharged from his bow.
Continues....
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 19 / Osho Daily Meditations - 19 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🍀 19. సహజత్వం 🍀*
*🕉. మీరు ఏది చేసినా, వీలైనంత పూర్తిగా చేయండి. మీరు నడకను ఆస్వాదిస్తే, మంచిది! అకస్మాత్తుగా 'మీకు ఇకపై కదలాలనే కోరిక లేదా కోరిక లేదని మీరు గ్రహిస్తే, వెంటనే కూర్చోండి; నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఒక్క అడుగు కూడా వేయకూడదు. 🕉*
*ఏది జరిగినా, అంగీకరించి ఆనందించండి; మరియు దేనినీ బలవంతం చేయవద్దు. మీకు మాట్లాడాలని అనిపిస్తే మాట్లాడండి. మీరు నిశ్శబ్దంగా ఉండాలని భావిస్తే, మౌనంగా ఉండండి కేవలం భావనతో కదలండి. ఒక్క క్షణం కూడా బలవంతం చేయవద్దు, ఎందుకంటే ఒకసారి మీరు దేనినైనా బలవంతం చేస్తే మీరు రెండుగా విభజించబడి సమస్యను సృష్టిస్తారు, అప్పుడు మీ జీవితం మొత్తం విడిపోతుంది. మానవాళి మొత్తం దాదాపుగా స్కిజోఫ్రెనిక్‌గా మారింది, ఎందుకంటే మనకు బలవంతం చేయడం నేర్పించబడింది.*
*నవ్వాలని కోరుకునే భాగం మరియు మిమ్మల్ని నవ్వనివ్వని భాగం వేరు, ఆపై మీరు విభజించబడ్డారు. మీరు టాప్ డాగను మరియు అండర్ డాగ్‌ని సృష్టించారు, కాబట్టి సంఘర్షణ ఉంది. సంఘర్షణ సృష్టించే చీలిక మరింత పెద్దదిగా మరియు పెద్దదిగా మారుతుంది. కాబట్టి సమస్య ఏమిటంటే ఆ చీలికను ఎలా తగ్గించాలి మరియు ఇకపై దానిని ఎలా సృష్టించకూడదు. జెన్‌లో వారికి చాలా అందమైన సామెత ఉంది: కూర్చోండి, కూర్చోండి. వాకింగ్, కేవలం నడవండి. అన్నింటికంటే మించి, చలించకండి.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Osho Daily Meditations - 19 🌹*
📚. Prasad Bharadwaj
*🍀 19. SPONTANEITY 🍀*
*🕉 Whatever you do, just do it as totally as possible. if you enjoy walking, good! if suddenly "you realize that you no longer have the urge or desire to move, then sit down immediately; not even a single step should be taken against your will. 🕉*
*Whatever happens, accept and enjoy it; and don't force anything. If you feel like talking, talk. If you feel like being silent, be silent just move with the feeling. Don't force in any way, not even for a single moment, because once you force anything you are divided in twoand that creates the problem, then your whole life becomes split. The whole of humanity has become almost schizophrenic, because we have been taught to force, things.*
*The part that wants to laugh and the part that doesn't allow you to laugh become separate, and then you are divided. You create a top dog and an underdog, so there is conflict. The rift that the conflict creates can become bigger and bigger and bigger. So the problem is how to bridge that rift, and how not to create it anymore. In Zen they have a very beautiful saying: Sitting, just sit. Walking, just walk. Above all, don't wobble.*
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 466 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 466 - 3 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 96. సుముఖీ, నళినీ, సుభ్రూః, శోభనా, సురనాయికా ।*
*కాలకంఠీ, కాంతిమతీ, క్షోభిణీ, సూక్ష్మరూపిణీ ॥ 96 ॥ 🍀*
*🌻 466. ‘సూక్ష్మరూపిణి’ - 3 / 466. 'Sukshmarupini' - 3🌻*
*ఆరోహణ క్రమమున మరల స్థూలము నుండి సూక్ష్మమునకు పరిణామము చెందుచుండును. ఆవిరి నీరు అగుట, నీరు మంచుగడ్డ అగుట, మరల మంచుగడ్డ నీరగుట, నీరు ఆవిరి యగుటగా ప్రకృతి సూక్ష్మము నుండి స్థూలమునకు, స్థూలము నుండి సూక్ష్మమునకు మార్పు చెందుచుండును. జీవులు దేహధారణము చేయుటకు ముందు సూక్ష్మరూపులే. దేహధారణమున స్థూల రూపులగుదురు. మరల స్థూల దేహముల నుండి సూక్ష్మమునకు చనుచుందురు. జీవునకు స్థూలదేహము విడచుటయే యుండును గాని మరణించుట యుండదు. అట్లే నిజమునకు జన్మించుట కూడ యుండును. ఇట్టి జీవ రూపములు కూడ శ్రీమాతయే. శ్రీమాత చేయు ఏడు లోకముల సృష్టిని స్థూలముగను, స్థూల సృష్టిగాను, సూక్ష్మ సృష్టిగను, కారణ సృష్టిగను, తదతీతమైన స్థితిగను జ్ఞానులు దర్శింతురు. సూక్ష్మము, స్థూలమున కాధారము. ఒక పాదము స్థూలమై యుండగ మూడు పాదములు దివ్యమై అమృతమై యున్నవని పురుష సూక్తము కీర్తించును.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 466 - 3 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*
*🌻 96. Sumukhi nalini subhru shobhana suranaeika*
*Karikanti kantimati kshobhini sukshmarupini ॥ 96 ॥ 🌻*
*🌻 466. 'Sukshmarupini' - 3 🌻*
*In the ascending order it again evolves from the gross to the subtle. Steam turns into water, water turns into ice, ice turns into water, water turns into steam, and nature changes from the gross to the subtle, from the subtle to the gross. Living beings are subtle forms before taking on a body. They take a gross body when they take form. They again move from the gross bodies to the subtle. A living being has the concept of leaving a gross body but does not have death. In the same way, there is no birth either. These living forms are also Sri Mata. The creation of the seven worlds by Srimata is seen by the sages as gross, the gross creation, the subtle creation, the causal creation and the transcendent state. Subtle is dependency for the gross. The Purusha sukta extols that one foot is gross while three feet are divine and eternal.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
Comments