🍀🌹 29, JULY 2023 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 229, JULY 2023 SATURDAY శనివారం, స్థిర వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 405 / Bhagavad-Gita - 405 🌹
🌴10వ అధ్యాయము - విభూతి యోగం - 33 / Chapter 10 - Vibhuti Yoga - 33 🌴
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 252 / Agni Maha Purana - 252 🌹
🌻. శివ పూజా విధి వర్ణనము - 8 / Mode of worshipping Śiva (śivapūjā) - 8 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 117 / DAILY WISDOM - 117 🌹
🌻 26. ప్రపంచానికి సర్వశక్తిమంతుడి నాయకత్వం అవసరం / 26. The World Needs the Leadership of a Superman 🌻
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 383 🌹*
6) 🌹. శివ సూత్రములు - 119 / Siva Sutras - 119 🌹
🌻 2-08. శరీరం హవిః - 1 / 2-08. śarīram havih - 1 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 29, జూలై, JULY 2023 పంచాంగము - Panchangam 🌹*
*శుభ శనివారం, Saturday, స్థిర వాసరే*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : పద్మినీ ఏకాదశి, Padmini Ekadashi 🌻*
*🍀. శ్రీ వేంకటేశ సహస్రనామ స్తోత్రం - 08 🍀*
*14. దండకాసురవిధ్వంసీ వక్రదంష్ట్రః క్షమాధరః |*
*గంధర్వశాపహరణః పుణ్యగంధో విచక్షణః*
*15. కరాలవక్త్రః సోమార్కనేత్రః షడ్గుణవైభవః |*
*శ్వేతఘోణీ ఘూర్ణితభ్రూర్ఘుర్ఘురధ్వనివిభ్రమః*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : విశుద్ధ స్థాయిలో చేతనా ప్రతిష్ఠ అంటే - విశుద్ధస్థాయిలో చేతన సుప్రతిష్ఠితం కావాలన్నప్పుడు; కేవలం అంతర్ఘృదయ చేతనయే కాదు, దేహ, ప్రాణ, మన్యకోశము లందలి చేతన సైతం విశుద్ధస్థాయి నందు కోవలసినదేయని అర్థం. మానవ ప్రేమ యందలి కలగాపులగపు స్థితి అపుడంతరించి, ఏకత్వానందం ఆత్మయందు అనుభూతం కావడమే గాక, వివిధ ప్రకృతి విభాగములద్వారా నైతం విశుద్ధరూపంలో అభివ్యక్త మయ్యే స్థితి ఏర్పడుతుంది. 🍀*
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
వర్ష ఋతువు, దక్షిణాయణం,
శ్రావణ మాసం
తిథి: శుక్ల-ఏకాదశి 13:06:06
వరకు తదుపరి శుక్ల ద్వాదశి
నక్షత్రం: జ్యేష్ఠ 23:35:51 వరకు
తదుపరి మూల
యోగం: బ్రహ్మ 09:34:35 వరకు
తదుపరి ఇంద్ర
కరణం: విష్టి 13:00:06 వరకు
వర్జ్యం: 06:13:52 - 07:44:24
మరియు 30:54:20 - 32:22:12
దుర్ముహూర్తం: 07:37:48 - 08:29:34
రాహు కాలం: 09:08:23 - 10:45:26
గుళిక కాలం: 05:54:18 - 07:31:20
యమ గండం: 13:59:31 - 15:36:34
అభిజిత్ ముహూర్తం: 11:57 - 12:47
అమృత కాలం: 15:17:04 - 16:47:36
సూర్యోదయం: 05:54:18
సూర్యాస్తమయం: 18:50:40
చంద్రోదయం: 15:38:49
చంద్రాస్తమయం: 01:53:28
సూర్య సంచార రాశి: కర్కాటకం
చంద్ర సంచార రాశి: వృశ్చికం
యోగాలు: ముసల యోగం - దుఃఖం
23:35:51 వరకు తదుపరి గద యోగం
- కార్య హాని , చెడు
దిశ శూల: తూర్పు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 405 / Bhagavad-Gita - 405 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 33 🌴*
*33. అక్షరాణా మకారోస్మి ద్వన్ద్వ: సామాసికస్య చ |*
*అహమేవాక్షయ: కాలో ధాతాహం విశ్వతోముఖ: ||*
*🌷. తాత్పర్యం : నేను అక్షరములలో ఆకారమును, సమాసములలో ద్వంద్వసమాసమును, శాశ్వతమైన కాలమును, సృష్టికర్తలలో బ్రహ్మను అయి యున్నాను.*
*🌻. భాష్యము : సంస్కృత అక్షరములలో తొలి అక్షరమైన ‘అ’ కారము వేదవాజ్మయమునకు ఆదియై యున్నది. ‘అ’ కారము లేకుండా ఏదియును ధ్వనింపదు గనుక, అది ధ్వనికి ఆదియై యున్నది. సంస్కృతమున అనేక సమాసపదములు గలవు. అందు “రామకృష్ణులు” వంటి ద్వంద్వపదము ద్వంద్వసమాసమనబడును. ఈ సమాసమున రాముడు మరియు కృష్ణుడు అను పదములు రెండును ఒకే రూపమును కలిగియున్నందున అది ద్వంద్వసమాసముగా పిలువబడినది.*
*కాలము సమస్తమును నశింపజేయును కావున సంహరించువారిలో అది చరమమైనది. రాబోవు కాలములో సృష్ట్యాంతమున గొప్ప అగ్ని ఉద్భవించి, సర్వమును నశింపజేయును కనుక కాలము శ్రీకృష్ణుని ప్రాతినిధ్యము వహించును. సృష్టి కార్యము కావించు జీవులలో చతుర్ముఖుడైన బ్రహ్మదేవుడు ముఖ్యుడు. కనుక అతడు దేవదేవుడైన శ్రీకృష్ణుని ప్రాతినిధ్యము వహించును.*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 405 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 10 - Vibhuti Yoga - 33 🌴*
*33. akṣarāṇām a-kāro ’smi dvandvaḥ sāmāsikasya ca*
*aham evākṣayaḥ kālo dhātāhaṁ viśvato-mukhaḥ*
*🌷 Translation : Of letters I am the letter A, and among compound words I am the dual compound. I am also inexhaustible time, and of creators I am Brahmā.*
*🌹 Purport : A-kāra, the first letter of the Sanskrit alphabet, is the beginning of the Vedic literature. Without a-kāra, nothing can be sounded; therefore it is the beginning of sound. In Sanskrit there are also many compound words, of which the dual word, like rāma-kṛṣṇa, is called dvandva. In this compound, the words rāma and kṛṣṇa have the same form, and therefore the compound is called dual.*
*Among all kinds of killers, time is the ultimate because time kills everything. Time is the representative of Kṛṣṇa because in due course of time there will be a great fire and everything will be annihilated. Among the living entities who are creators, Brahmā, who has four heads, is the chief. Therefore he is a representative of the Supreme Lord, Kṛṣṇa.*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 252 / Agni Maha Purana - 252 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 74*
*🌻. శివ పూజా విధి వర్ణనము - 8 🌻*
*ఆసనముపై ఆసీనుడై యున్న శివుని దివ్యమూర్తి ముప్పదిరెండు లక్షణములతో ప్రకాశించుచున్నదని చింతనము చేయుచు, శివస్మరణము చేయుచు, ''ఓం హాం హాం హాం శిమూర్తయే నమః'' అను మంత్ర ముచ్చరించుచు నమస్కారము చేయవలెను, బ్రహ్మాది కారణ త్యాగ పూర్వకముగు మంత్రమును శివుని యందు ప్రతిష్ఠితము చేయవలెను. లలాట మధ్య భాగమున చంద్రుడు వలె ప్రకాశించుచున్న బిందు రూప పరమ శివుడు హృదయాదు లగు ఆరు అంగములతో సంయుక్తుడై పుష్పాంజలిలోనికి దిగి వచ్చి నట్లు భావన చేసి ఆయనను పూజింపనున్న మూర్తియందు స్థాపించవలెను. పిమ్మట ఆవాహనీముద్రతో ''ఓం హాం హౌం శివాయ నమః'' అను మంత్ర ముచ్చరించుచు, మూర్తిపై శివుని ఆవాహనము చేయవలెను. స్థాపనీముద్రచే స్థాపనము చేసి, సంనిధాపనీముద్రతో సన్నిహితుని చేసి, సంనిరోధనీముద్రతో ఆ మూర్తి పై కదల కుండు నట్లు చేయవలెను. పిమ్మట ''నిష్ఠురాయై కాలకల్యాయై ఫట్'' అను మంత్రము ఉచ్చరించుచు ఖడ్గముద్రతో భయమును చూపుచు విఘ్నములను పారద్రోలవలెను.*
*పిమ్మట లింగముద్రను చూపి నమస్కారము చేయవలెను. 'నమః' అని అవగుంఠనము చేయవలెను. ఇష్టదేవతను తన వైపునకు అభిముఖముగ నున్నట్లు చేయుటయే ఆవాహనము. దేవతను అర్చా విగ్రహముపై కూర్చుండబెట్టుట స్థాపనము, ''ప్రభూ! నేను నీవాడను'' అని పలుకుచు భగవంతునితో అతి సన్నిహిత సంబంధము నేర్పరచుకొనుటయే సంనిధానము''. శివపూజకు సంబంధించిన కర్మకాండ అంతయు పూర్తి అగువరకు భగవత్సంనిధాన ముండునట్లు చేయుట ''నిరోధము'' భక్తులు కాని వారికి శివతత్త్వము తెలియకుండు నట్లు చేయుట అవగుంఠనము. పిమ్మట సకలీకరణము చేసి 'హృదయాయ నమః' ఇత్యాదిమంత్రములతో హృదయాద్యంగములకు అంగులతో ఏకత్వమును స్థాపించుటయే 'అమృతీకరణము' చైతన్య శక్తి శంకరుని హృదయము, ఎనిమిది విధములైన ఐశ్వర్యము శిరస్సు, వశిత్వము శిఖ, అభేద్యమగు తేజస్సు కవచము, దుస్సహమైన ప్రతాపమే సమస్త విఘ్నములను నివారించు అస్త్రము హృదయముతో ప్రారంభించి ''నమః, స్వధా, స్వాహా, వౌషట్ అనునవి ఉచ్చరించుచు పాద్యాదులను నివేదించవలెను.*
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Agni Maha Purana - 252 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *
*Chapter 74*
*🌻 Mode of worshipping Śiva (śivapūjā) - 8 🌻*
52-54. The image of Śiva possessing thirty-two characteristics (should be installed) at the centre. Hāṃ, haṃ, hāṃ (salutations) to the image of Śiva. After having meditated upon the self-luminant Śiva, the mantra should be led to the spot sacred to Śiva after leaving below the place sacred to Brahmā. Then (the worshipper) having meditated upon that Supreme form of Śiva, effulgent with the splendour of the moon, as a luminous point at the middle of the forehead and being invested with the six constituents, with flowers in folded palms, should deposit (those flowers) on the form of (Goddess) Lakṣmī.
55-57. Oṃ, hāṃ, hauṃ salutations to Śiva. (The deity) should be invoked with the invoking hṛd (mantra). Having established Śiva with the sthāpanī (mudrā)[3], and placed near (that) should be checked with Niṣṭhurā and Kālakāntī concluding with phaṭ. After having removed obstructions by sending them away and making obeisance by (showing) the liṅgamudrā, it should be covered with the hṛd (mantra). The invocation should follow it. Then standing in front of the image he-should repeat. “Let you be located and firmly established. O lord! I am in your presence.”
58. The (rite of) avaguṇṭhana signifies the presence and supervision of the God and the exhibition of one’s devotion (to the God) from the commencement to the end of the act.
59. After having done the accomplishing act with the six mantras, the (rite of) amṛtīkaraṇa should be performed by mentioning different parts of the body along with the body.
60-61. The worshipper should permeate his heart with the energy of consciousness of Śambhu (Śiva). Similarly, (he should. contemplate) the tuft of hair of Śiva as formed of the eightfold glories. The worshipper should contemplate the invincible energy of God as forming his armour, the unbearable prowess of God which removes all impediments (and the words) salutations, svadhā, svāhā and vauṣaṭ (should be appended) in. order.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 117 / DAILY WISDOM - 117 🌹*
*🍀 📖 . ఆత్మ యొక్క ఆరోహణ నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🌻 26. ప్రపంచానికి సర్వశక్తిమంతుడి నాయకత్వం అవసరం 🌻*
*అద్భుతమైన నాయకత్వ లక్షణాలు ఉన్న, మరియు విశ్వ శక్తులను సమీకరించే సామర్థ్యం కలిగిన మేధావి యొక్క నాయకత్వం ఇప్పుడు అవసరం. ఈ విశ్వ శక్తులు అంటే ఆధ్యాత్మికం లేని భౌతికం లేదా భౌతికం లేని ఆధ్యాత్మికం కాకుండా రెండూ సమంగా ఉన్న కలయిక. సత్యం ఆత్మ మరియు పదార్థం యొక్క కలియిక. దైవం మరియు లోకం యొక్క కలయిక. మనిషి ఈ జ్ఞానాన్ని సంపాదిస్తే తప్ప తనకి ఇహపర లోకాల్లో శాంతిని పొందలేడు. ఈ జ్ఞానాన్ని పొందకపోతే అతనికి కావల్సింది ఎప్పటికీ దొరకదు.*
*ప్రపంచానికి ఒక సర్వశక్తిమంతుడి నాయకత్వం అవసరం. అతని దృష్టి దేవుణ్ణి మరియు ప్రపంచాన్ని ఒకే సమయంలో చూడగలగాలి, అతని వ్యక్తిత్వం దైవ మరియు మానవ విషయాల్లో రెండిటిలో పాల్గొనగనగాలి. మానవాళి సంక్షేమానికి తక్షణ అవసరం అని మనం చెప్పిన లక్షణాలు కలిగిన గొప్ప రాజనీతిజ్ఞుడు శ్రీ కృష్ణుడు. అతనిలో ఈ ప్రపంచం మనం పైన చెప్పిన మేధావిని చూసింది.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 117 🌹*
*🍀 📖 The Ascent of the Spirit 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
*🌻 26. The World Needs the Leadership of a Superman 🌻*
*The leadership of a tremendous genius and capacity for mustering in universal forces is called for. And these forces are neither material ones minus the spiritual, nor the spiritual minus the material. Truth is a fusion of both spirit and matter, of divinity and humanity, of God and the world. Will man be able to awaken this vision of himself? Then, there is hope for him, and then there can be peace, not only on Earth but also in heaven and everywhere. Else, the object sought for is far to seek, and difficult to find.*
*The world needs the leadership of a superman, whose eyes can see God and world at the same time, whose personality will be at once the sacred temple of the Almighty and the active thoroughfare of human business. The world did see the realisation of such an ideal in the personality of Sri Krishna, who was an outstanding specimen of the world’s greatest statesman in the sense we have defined above as an urgent need for the welfare of mankind.*
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 383 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. ఇది నాది కాదు, ఇది నాది కాదు. ఏదీ దాచకుండా అన్నిట్నీ వదిలిపెట్టడం. అప్పుడు ఏమీ లేనితనమనే పద్మం వికసిస్తుంది. అక్కడ నువ్వు వుండవు. ఈ వైరుధ్య అనుభవమే జీవితానికి సంబంధించిన గొప్ప అనుభవం. 🍀*
*అహాన్ని పూర్తిగా విడిచిపెట్టాలి. నువ్వేదో సాధించిన వాడివి కాదు. నీకు అవసరమైంది ఎప్పుడో యివ్వ బడింది. పరిస్థితి అది. నువ్వు చెయ్యాల్సిందల్లా దాని అభివృది. నీ ప్రయత్నం అక్కడ వుండాలి. నువ్వు దాగిన వాటిని బయటకు తీసుకు రావాలి. దాగిన వ్యతిరేక కోణాల్ని బయటికి తీసుకు రావాలి. ప్రాచీన మార్మికుల బోధనల సారాంశమది. బుద్ధుల వుద్దేశమది. దాన్ని 'నేతి, నేతి' అన్నారు. ఇది నాది కాదు, ఇది నాది కాదు, అట్లా ఏదీ దాచకుండా అన్నిట్నీ వదిలిపెట్టడం. అప్పుడు ఏమీ లేనితనమనే పద్మం వికసిస్తుంది. అక్కడ నువ్వు వుండవు. ఈ వైరుధ్య అనుభవమే జీవితానికి సంబంధించిన గొప్ప అనుభవం.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శివ సూత్రములు - 119 / Siva Sutras - 119 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*2వ భాగం - శక్తోపాయ*
*✍️. ప్రసాద్ భరధ్వాజ*
*🌻 2-08. శరీరం హవిః - 1 🌻*
*🌴. ఆత్మ శుద్ధి అనే యాగంలో దేహమే నైవేద్యంగా ఉంటుంది, అందులో పాల్గొనే శక్తులకు నైవేద్యంగా మనస్సు మరియు శరీరం యొక్క మలినాలను జ్ఞాన అగ్నిలో పోస్తారు. 🌴*
*శరీరం - శరీరం; హవిః - నైవేద్యము. ఈ సూత్రంలో, శరీరం అంటే యోగి యొక్క శరీరం, దీని లక్షణాలు మునుపటి సూత్రాలలో చర్చించబడ్డాయి. యోగి తన వ్యక్తిగత చైతన్యాన్ని సార్వత్రిక చైతన్యంతో ఏకం చేయగల వ్యక్తి. పూర్తిగా అహంకారం లేని వ్యక్తి యోగి. మానవులందరికీ స్థూల, సూక్ష్మ, అతిసూక్ష్మ అనే మూడు రకాల శరీరాలు ఉంటాయి. స్థూలము అంటే భౌతిక శరీరం, సూక్ష్మ శరీరాన్ని మనస్సు యొక్క పరిధిలోని శరీరంగాను, మరియు మూడింటిలో సూక్ష్మమైనది లోపల ఉన్న ఆత్మ అని వివరించవచ్చు.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Siva Sutras - 119 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 2 - Śāktopāya.
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*
*🌻 2-08. śarīram havih - 1 🌻*
*🌴. The body is the oblation in the sacrifice of self-purification in which the impurities of the mind and body are poured in to the fire of knowledge as an offering to the shaktis who participate in it. 🌴*
*Śarīraṁ - body; haviḥ - oblation. In this sūtra, body means the body of a yogi whose qualities have been discussed in the previous aphorisms. Yogi is a person who is able to unite his individual consciousness with universal consciousness. A person totally devoid of ego is a yogi. All human beings have three types of bodies, gross, subtle and subtlest. Gross is the physical body, subtle body can be explained as the body conceived in the arena of mind and the subtlest of the three is the soul within.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
Comments