top of page
Writer's picturePrasad Bharadwaj

🌹 29, MAY 2023 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🌹

🍀🌹 29, MAY 2023 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🌹🍀

1) 🌹 29, MAY 2023 MONDAY సోమవారం, ఇందు వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹

2) 🌹. శ్రీమద్భగవద్గీత - 377 / Bhagavad-Gita - 377 🌹 🌴10వ అధ్యాయము - విభూతి యోగం - 05 / Chapter 10 - Vibhuti Yoga - 05 🌴

4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 224 / Agni Maha Purana - 224 🌹

. సభాగృహ స్థాపనము. - 3 / The building of pavilions in front of the temples (sabhā-sthāpana) - 3 🌻

4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 089 / DAILY WISDOM - 089 🌹

🌻 29. ధర్మశాస్త్రం / 29. The Law of Dharma 🌻

5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 354 🌹

6) 🌹. శివ సూత్రములు - 91 / Siva Sutras - 91 🌹

🌻 2-05. విద్యాసముత్థానే స్వభావికే ఖేచరీ శివావస్తా - 3 / 2-05. vidyāsamutthāne svābhāvike khecarī śivāvasthā - 3 🌻


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 29, మే, May 2023 పంచాగము - Panchagam 🌹*

*శుభ సోమవారం, Monday, ఇందు వాసరే*

*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*


*🌻. పండుగలు మరియు పర్వదినాలు : మహేశ నవమి, Mahesh Navami🌻*


*🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 34 🍀*


*67. ఆశ్రమస్థః క్రియావస్థో విశ్వకర్మమతిర్వరః |విశాల శాఖస్తామ్రోష్ఠో హ్యంబుజాలః సునిశ్చలః*

*68. కపిలః కపిశః శుక్లః ఆయుశ్చైవ పరోఽపరః | గంధర్వో హ్యదితిస్తార్క్ష్యః సువిజ్ఞేయః సుశారదః*


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నేటి సూక్తి : ఏకత్వానంద లీల - ఏకత్వం, ఆనందం. ఇవి రెండూ పరమసత్యపు ముఖ్య లక్షణాలు. ఏకత్వము, ఆనందముల సహజశక్తియే ప్రేమ. కనుక, ఏకత్వానంద లీలా విశేషములకు ప్రేమ ఏడుగడ కావడం అవసరం. ఈ లీలా విశేషములు ఒకే విధమైనవి గాక, అనేక విధములైనవి కావచ్చు. 🍀*


🌷🌷🌷🌷🌷


విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం,

జ్యేష్ఠ మాసం

తిథి: శుక్ల-నవమి 11:50:39 వరకు

తదుపరి శుక్ల-దశమి

నక్షత్రం: ఉత్తర ఫల్గుణి 28:29:08

వరకు తదుపరి హస్త

యోగం: వజ్ర 21:01:17 వరకు

తదుపరి సిధ్ధి

కరణం: కౌలవ 11:46:39 వరకు

వర్జ్యం: 10:11:24 - 11:55:56

దుర్ముహూర్తం: 12:39:37 - 13:31:56

మరియు 15:16:33 - 16:08:51

రాహు కాలం: 07:19:14 - 08:57:19

గుళిక కాలం: 13:51:33 - 15:29:37

యమ గండం: 10:35:23 - 12:13:28

అభిజిత్ ముహూర్తం: 11:47 - 12:39

అమృత కాలం: 20:38:36 - 22:23:08

సూర్యోదయం: 05:41:10

సూర్యాస్తమయం: 18:45:47

చంద్రోదయం: 13:37:06

చంద్రాస్తమయం: 01:30:38

సూర్య సంచార రాశి: వృషభం

చంద్ర సంచార రాశి: సింహం

యోగాలు: శ్రీవత్స యోగం - ధన

లాభం , సర్వ సౌఖ్యం 28:29:08 వరకు

తదుపరి వజ్ర యోగం - ఫల ప్రాప్తి

దిశ శూల: తూర్పు

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నిత్య ప్రార్థన 🍀*

*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*

*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*

*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*

*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*

*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*

*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీమద్భగవద్గీత - 377 / Bhagavad-Gita - 377 🌹*

*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 05 🌴*


*05. అహింసా సమతా తుష్టిస్తపో దానం యశోయశః |*

*భవన్తి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధా: ||*


🌷. తాత్పర్యం :

*అహింస, సమత్వము, సంతుష్టి, తపస్సు, దానము, యశస్సు, అపకీర్తి మున్నగు జీవుల వివిధగుణములు నా చేతనే సృష్టించబడినవి.*


🌷. భాష్యము :

*జీవుల శుభాశుభములైన వివధ గుణములన్నియును శ్రీకృష్ణుని చేతనే సృష్టింపబడినవి. ఆ గుణములే ఇచ్చట వివరింపబడినవి. ఓర్పు మరియు క్షమాగుణములను (క్షమ) అలవరచుకొని ఇతరుల సాధారణ అపరాధముల యెడ ఓర్పును కలిగి వారిని క్షమింపవలెను. ఇతరుల లాభము కొరకు వాస్తవములను ఉన్నవియున్నట్లుగా తెలియజేయుటయే సత్యమనుదాని భావము. వాస్తవములనెన్నడును తప్పుగా ప్రదర్శించరాదు.*


*ఇతరులకు నచ్చునదైనప్పుడే సత్యమును పలుకుట సాంఘికమర్యాదయైనను వాస్తవమునకు అది సత్యసంధత కానేరదు. కావున వాస్తవములను సర్వులు అవగాహన చేసికొను రీతిలో సత్యమును నిక్కచ్చిగా పలుకవలెను. దొంగను దొంగయని పలికి జనులను సావధానపరచుటయే సత్యము కాగలదు. సత్యము కొన్నిమార్లు రుచింపకపోయినను ఎవ్వరును దానిని పలుకుట యందు జంకును కలిగియుండరాదు. ఇతరుల లాభము కొరకు వాస్తవములను ఉన్నవియున్నట్లుగా ప్రదర్శించవలెనని సత్యసంధత కోరును. సత్యమునకు ఒసగబడు నిర్వచనమిదియే.*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Bhagavad-Gita as It is - 377 🌹*

*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*


*🌴 Chapter 10 - Vibhuti Yoga - 05 🌴*


*05. ahiṁsā samatā tuṣṭis tapo dānaṁ yaśo ’yaśaḥ*

*bhavanti bhāvā bhūtānāṁ matta eva pṛthag-vidhāḥ*


🌷 Translation :

*Nonviolence, equanimity, satisfaction, austerity, charity, fame and infamy – all these various qualities of living beings are created by Me alone.*


🌹 Purport :

*The different qualities of living entities, be they good or bad, are all created by Kṛṣṇa, and they are described here. Asammoha, freedom from doubt and delusion, can be achieved when one is not hesitant and when he understands the transcendental philosophy. Slowly but surely he becomes free from bewilderment. Nothing should be accepted blindly; everything should be accepted with care and with caution. Kṣamā, tolerance and forgiveness, should be practiced; one should be tolerant and excuse the minor offenses of others. Satyam, truthfulness, means that facts should be presented as they are, for the benefit of others. Facts should not be misrepresented.*

🌹 🌹 🌹 🌹 🌹



🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 224 / Agni Maha Purana - 224 🌹*

*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*

*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*

*ప్రథమ సంపుటము, అధ్యాయము - 65*


*🌻. సభాగృహ స్థాపనము. - 3 🌻*


*''ఓం వసిష్ఠునిచే పాలింపబడిన ఓ నందా! ధనసంతానాదుల నొసగి నా ఆనందమును వృద్ధిపొందిపుము. ప్రజలకువిజయము నిచ్చు భార్గవనందినియైన జయా! నన్ను ధనసంపదలతో ఆనందింపచేయుము, అంగిరసుని పుత్రియైన ఓ పూర్ణా! నా మనోరథమునలు ఈడేర్పుము. నన్ను పరిపూర్ణకాముని చేయుము, కాశ్యపకుమారి యైన భద్రా! నా బుద్ధిని కల్యాణమయము చేయుము. అందరికిని ఆనందము నిచ్చు వసిష్ఠనందిని యైన నందా ! నీవు సమస్తబీజములతో, ఓషధులతో కూడి, సకలరత్నౌషధి పూర్ణురాలవై ఈ సుందర భవనమునందు ఆనలదపూర్వకముగ నివసింపుము.*


*కశ్యప్రజాపతిపుత్రివైన ఓ భద్రా ! నీవు సర్వవిధముల సుందర మైనదానవు, మహత్త్వము కలదానవు. సౌభాగ్యశాలినివి. ఉత్తమవ్రతమును పాలించుదానవు. నా ఇంటిలో ఆనందపూర్వకముగ నివసింపుము. దేవి! భార్గవీ! జయా! సర్వశ్రేష్ఠులైన ఆచార్యులు నిన్ను పూజించిరి. చందనపుష్పమాలాలంకృతురాల వైన నీవు ప్రపంచమునందలి సకలైశ్వర్యములను ఇచ్చుదానవు. నా గృహమునందు ఆనందపూర్వకముగ విహరింపుము. అంగిరసుని పుత్రి వైన పూర్ణా! నీవు అవ్యక్తరూపిణివి. ఓ ఇష్టకాదేవీ! నీవు నాకు అభిష్టవస్తువుల నిమ్ము. నా ఇంటిలో ఉండు మని కోరుచున్నాను. నీవు దేశప్రభువును గ్రామనగర ప్రభువులను, గృహప్రభువును అనుగ్రహించుదానవు. నా గృహమునందు జన-ధన-గజ-అశ్వ-గో-మహిష్యాదివృద్ధి కలుగు నట్లు చేయుము.*


*శ్రీ అగ్నిమహాపురాణమునందు సభాగృహస్థాపన మను అరువదియైదవ అధ్యాయము సమాప్తము.*


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Agni Maha Purana - 224 🌹*

*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *


*Chapter 65*

*🌻The building of pavilions in front of the temples (sabhā-sthāpana) - 3 🌻*


16-23. “Oṃ, O Mother Earth! related to Vasiṣṭha! you rejoice with the Vasus (semi-divine beings) and people. Glory be to the daughter of Bhārgava[2] (Śukra the preceptor of demons), the giver of success to her offsprings. The accomplished goddess! relative of Aṅgiras! You grant me my heart’s desire.


O auspicious one! related to (sage) Kaśyapa! make my intellect good. Endowed with all herbs! Surrounded by all gems and herbs! Shining one Joyous one! related to Vasiṣṭha! May you amuse here! Daughter of Prajāpati (Brahman)!


O Goddess! Handsome in all parts! Noble-minded! Beautiful one! The strict observer of disciplines! One who is related to Kaśyapa! May you enjoy in this house! O Adored by the great preceptors! Adorned with perfumes and garlands! Bestower of prosperity!


O Goddess! Daughter of Bhārgava! May you amuse in this house! The primordial element! The inexplicable one! Accomplished! O daughter of sage Aṅgiras! O Goddess of bricks! I establish you. You confer on me my desires! One surrounded by the lords of regions, place and the house! You be furtherer of men, wealth, elephant, horse and cow.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 89 / DAILY WISDOM - 89 🌹*

*🍀 📖. బృహదారణ్యక ఉపనిషత్తు నుండి 🍀*

*✍️. ప్రసాద్ భరద్వాజ*


*🌻 29. ధర్మశాస్త్రం 🌻*


*దేవుని చట్టం మరియు మనిషి యొక్క చట్టం అని రెండు చట్టాలు లేవు. విశ్వ నియమం మరియు వ్యక్తిగత నియమాలు అని రెండు వేరు వేరు నియమాలు లేవు. అక్కడ అలాంటిదేమీ లేదు. 'నా చట్టం' లేదా 'మీ చట్టం' వంటివి ఉనికిలో లేవు. అన్ని చోట్లా, సాకార, నిరాకార సృష్టిలో అన్ని సృష్టిలో, అన్ని రంగాలలో ఒకే ఒక నియమం ఉంది. ఖగోళ జీవులకు, మానవులకు మరియు అమానవీయ జీవులకు ఒకే చట్టం ఉంది. ప్రతి ఒక్కరూ ఒకే నిర్ణయాత్మకమైన సూత్రం ద్వారా నియంత్రించబడతారు.*


*దాన్నే ధర్మం అంటారు. ఇది భౌతిక స్థాయిలో గురుత్వాకర్షణగా పనిచేస్తుంది; ఇది మానసిక స్థాయిలో ప్రేమగా పనిచేస్తుంది; ఇది రసాయన స్థాయిలో రసాయనాలుగా పనిచేస్తుంది మరియు ఇది మన మానసిక స్థాయి, జ్ఞానం మరియు ఆలోచన స్థాయిలలో ఆలోచన యొక్క ఏకీకరణగా పనిచేస్తుంది. ఇది అంతిమంగా విషయం మరియు వస్తువు మధ్య అనుసంధానంగా పనిచేస్తుంది. దీని కారణంగా జ్ఞానం ఉంటుంది.*


*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 DAILY WISDOM - 89 🌹*

*🍀 📖 The Brihadaranyaka Upanishad 🍀*

📝 Swami Krishnananda

📚. Prasad Bharadwaj


*🌻 29. The Law of Dharma 🌻*


*There are no two laws—God’s law and man’s law; universal law and individual law. No such thing is there. Such thing as ‘my law’ or ‘your law’ does not exist. There is only one law operating everywhere, in all creation, visible or invisible, in all realms of being. The same law is there for the celestials, the humans and the subhuman creatures. Everyone is controlled by a single principle of ordinance.*


*That is called dharma. It operates as gravitation in the physical level; it operates as love in the psychological level; it operates as chemicals in the chemical level and it operates as integration of thought in our mental level, the level of cognition and thinking. It ultimately operates as the connecting link between the subject and the object, on account of which there is knowledge of anything at all.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 354 🌹*

*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*


*🍀. మనిషికీ దైవత్వానికీ మధ్య వున్న తేడా దైవత్వంలో పూర్తి చైతన్యం వుంటుంది. మనిషి కొద్దిగా చేతనలో వుంటాడు. 🍀*


*మనిషికీ జంతువుకీ మధ్య వున్న తేడా జంతువు పూర్తి అచేతనావస్థలో వుంటుంది. మనిషి కొద్దిగా చేతనలో వుంటాడు. మనిషికీ దైవత్వానికీ మధ్య వున్న తేడా దైవత్వంలో పూర్తి చైతన్యం వుంటుంది. మనిషి ఈ రెంటికీ మధ్యలో వుంటాడు. కేవల జంతు సంబంధ అనేతనత్వానికి కేవల దైవసంబంధ చైతన్యానికి మధ్య వుంటాడు. వ్యక్తి ముందుకు వెళ్ళొచ్చు. వెనక్కి జారవచ్చు. అది అతని మీద ఆధారపడి వుంటుంది.*


*సశేషం ...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శివ సూత్రములు - 091 / Siva Sutras - 091 🌹*

*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*

*2వ భాగం - శక్తోపాయ*

*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*


*🌻 2-05. విద్యాసముత్థానే స్వభావికే ఖేచరీ శివావస్తా - 3 🌻*

*🌴. భగవంతుని చైతన్యం యొక్క స్వచ్ఛమైన జ్ఞానం అప్రయత్నంగా పెరుగుతుంది. ఈ శివ స్థితి ఖేచరీ స్థితితో ఒకటిగా గ్రహించ బడుతుంది. 🌴*


*ఖేచరీ అనేది వామేశ్వరి అని పిలువబడే దైవిక శక్తిలో ఒక భాగం. ఆమె పరమశివుడు లేదా పరమశివుని పరమ చైతన్యం నుండి విశ్వం ఉద్భవించేలా చేస్తుంది కాబట్టి ఆమెను వామేశ్వరి అని పిలుస్తారు. పరమశివుని మించినది లేదు. అంతకు మించినది ఏదీ లేదు కాబట్టి ఏదైనా ఆధ్యాత్మిక ఎదుగుదల ఈ స్థాయికి మాత్రమే చేరుకోగలదు. వామేశ్వరి, పరమశివునితో సమానంగా ఉనికిలో ఉండడం వల్ల, శివ స్వభావాన్ని భిన్నమైన దృక్కోణంలో వెల్లడిస్తుంది. శివుని యొక్క సత్య స్వరూపం మాయ ఆమె స్వభావం కావడం చేత ఆమె ద్వారా బహిర్గతం కాలేదు. శక్తి శివుని కంటే తక్కువ కాదు, ఎక్కువా కాదని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అయితే అదే సమయంలో, శివుడు శక్తి లేకుండా ఉండగలడని అర్థం చేసుకోవాలి, కానీ ఆమె లేకుండా అతను జడత్వం పొందుతాడు. అయితే, శక్తి, శివుడు లేకుండా ఉనికిలో ఉండదు. ఈ రెండూ ఉంటే తప్ప సృష్టి జరగదు. ఇది సృష్టి యొక్క ప్రాథమిక సూత్రం.*


*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Siva Sutras - 091 🌹*

*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*

Part 2 - Śāktopāya.

*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*


*🌻 2-05. vidyāsamutthāne svābhāvike khecarī śivāvasthā - 3 🌻*

*🌴. The pure knowledge of God consciousness effortlessly rises and this state of Śiva is realized as one with the state of khecarī. 🌴*


*Khecarī is a part of divine Śaktī known as Vāmeśvarī. She is called Vāmeśvarī because She causes the universe to emerge from the Supreme consciousness of Parā-Śiva or Paramaśiva. There is nothing beyond Paramaśiva. Any spiritual aspirant can reach only up to this level as there is nothing beyond That. Vāmeśvarī, by incessantly co-existing with Paramaśiva, reveals the nature of Śiva in a different perspective. The essential or true nature Śiva is not revealed by Her due to Her own inherent nature of māyā. It is important to understand that Śaktī is neither inferior nor superior to Śiva. But at the same time, it is to be understood that Śiva can exist without Śaktī, but He becomes inert without Her, whereas, Śaktī, cannot exist without Śiva. Unless both of them are present, creation cannot happen. This is the fundamental principle of creation.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Join and Share

🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹

Comments


bottom of page