top of page
Writer's picturePrasad Bharadwaj

🌹 30, SEPTEMBER 2023 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు 🌹

🍀🌹 30, SEPTEMBER 2023 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు 🌹🍀

1) 🌹 30, SEPTEMBER 2023 SATURDAY శనివారం, స్థిర వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹

2) 🌹. శ్రీమద్భగవద్గీత - 435 / Bhagavad-Gita - 435 🌹

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 21 / Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 21 🌴

3) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 796 / Sri Siva Maha Purana - 796 🌹

🌻. గణాధ్యక్షుల యుద్ధము - 7 / Description of the Special War - 7 🌻

4) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 48 / Osho Daily Meditations  - 48 🌹

🍀 49. వైఫల్యం / 49. FAILURE 🍀

5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 485 - 494 / Sri Lalitha Chaitanya Vijnanam - 485 - 494 🌹

🌻 485 నుండి 494వ నామము వరకు వివరణము - 1 / Description of Nos. 485 to 494 Names - 1 🌻


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 30, సెప్టెంబరు, SEPTEMBER 2023 పంచాంగము - Panchangam 🌹*

*శుభ శనివారం, Saturday, స్థిర వాసరే*

*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*


*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు🌻*


*🍀. శ్రీ వేంకటేశ సహస్రనామ స్తోత్రం - 16 🍀*

*30. వర్చస్వీ దానశీలశ్చ ధనుష్మాన్ బ్రహ్మవిత్తమః |*

*అత్యుదగ్రః సమగ్రశ్చ న్యగ్రోధో దుష్టనిగ్రహః*

*31. రవివంశసముద్భూతో రాఘవో భరతాగ్రజః |*

*కౌసల్యాతనయో రామో విశ్వామిత్రప్రియంకరః*


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నేటి సూక్తి : సరియైన భక్తి వుంటే - ఆధ్యాత్మిక శక్తి సామర్థ్యములలో నీ గురువు నీ కంటెను, ఇతర గురువులు కంటెను తక్కువాడు కావచ్చును. కాని, నీలో గనుక సరియైన భక్తి ఉంటే, సరియైన ఆధ్యాత్మిక దృష్టి ఉంటే, ఆయన ద్వారానే నీవు ఈశ్వర సంస్పర్శను పొందవచ్చు, ఆధ్యాత్మిక అనుభవాలను, ఆధ్యాత్మిక సంసిద్ధినీ ఆయన కంటే ముందుగా సైతం బడయవచ్చు. 🍀*


🌷🌷🌷🌷🌷


విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

వర్ష ఋతువు, దక్షిణాయణం,

భాద్రపద మాసం

తిథి: కృష్ణ పాడ్యమి 12:22:20

వరకు తదుపరి కృష్ణ విదియ

నక్షత్రం: రేవతి 21:09:05 వరకు

తదుపరి అశ్విని

యోగం: ధృవ 16:26:32 వరకు

తదుపరి వ్యాఘత

కరణం: కౌలవ 12:25:20 వరకు

వర్జ్యం: -

దుర్ముహూర్తం: 07:42:02 - 08:30:02

రాహు కాలం: 09:06:03 - 10:36:03

గుళిక కాలం: 06:06:01 - 07:36:02

యమ గండం: 13:36:04 - 15:06:05

అభిజిత్ ముహూర్తం: 11:42 - 12:30

అమృత కాలం: -

సూర్యోదయం: 06:06:01

సూర్యాస్తమయం: 18:06:05

చంద్రోదయం: 18:54:19

చంద్రాస్తమయం: 06:46:06

సూర్య సంచార రాశి: కన్య

చంద్ర సంచార రాశి: మీనం

యోగాలు: ధాత్రి యోగం - కార్య

జయం 21:09:05 వరకు తదుపరి

సౌమ్య యోగం - సర్వ సౌఖ్యం

దిశ శూల: తూర్పు

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నిత్య ప్రార్థన 🍀*

*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*

*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*

*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*

*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*

*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*

*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీమద్భగవద్గీత - 435 / Bhagavad-Gita - 435 🌹*

*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 21 🌴*


*21. అమీ హి త్వాం సురసఙ్ఘా విశన్తి కేచిద్భీతా: ప్రాంజలయో గృణన్తి |*

*స్వస్తీత్యుక్తా మహర్షిసిద్ధసఙ్ఘా: స్తువన్తి త్వాం స్తుతిభి: పుష్కలాభి: ||*


*🌷. తాత్పర్యం : దేవతా సమూహములన్నియును నిన్ను శరణువేడి నీ యందు ప్రవేశించుచున్నవి. వారిలో కొందరు ముగుల భయవిహ్వలులై దోసలియొగ్గి ప్రార్థనలను గావించుచున్నారు. మహర్షులు, సిద్ధసమూహములు “శాంతి, శాంతి” యని పలుకుచు వేదమంత్రములచే నిన్ను స్తుతించుచున్నారు.*


*🌷. భాష్యము : సర్వలోకముల యందలి దేవతలు అద్భుతమైన విశ్వరుపముచే మరియ దాని దేదీప్యమాన తేజముచే భయమునొంది తమ రక్షణ నిమిత్తమై ప్రార్థనలను కావించిరి.*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Bhagavad-Gita as It is - 435 🌹*

*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*


*🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 21 🌴*


*21. amī hi tvāṁ sura-saṅghā viśanti kecid bhītāḥ prāñjalayo gṛṇanti*

*svastīty uktvā maharṣi-siddha-saṅghāḥ stuvanti tvāṁ stutibhiḥ puṣkalābhiḥ*


*🌷 Translation : All the hosts of demigods are surrendering before You and entering into You. Some of them, very much afraid, are offering prayers with folded hands. Hosts of great sages and perfected beings, crying “All peace!” are praying to You by singing the Vedic hymns.*


*🌹 Purport : The demigods in all the planetary systems feared the terrific manifestation of the universal form and its glaring effulgence and so prayed for protection.*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 . శ్రీ శివ మహా పురాణము - 796 / Sri Siva Maha Purana - 796 🌹*

*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 21 🌴*


*🌻. గణాధ్యక్షుల యుద్ధము - 7 🌻*


*అపుడు మహాబలుడగు రాక్షసరాజు పరిఘను చేతబట్టి వేగముగా గెంతి వీరభద్రుని సమీపమునకు వచ్చెను. (48). మహాబలుడు, సముద్రపుత్రుడు, వీరుడు అగు ఆ జలంధరుడు మిక్కిలి పెద్ద పరిఘతో వీరభద్రుని శిరస్సుప్తె కొట్టి గర్జించెను (49).


*గణాధ్యక్షుడగు వీరభద్రుడు మిక్కిలి పెద్దదియగు పరిఘచే కొట్టబడి పగిలిన శిరస్సు గలవాడ్తె నేలప్తె బడెను. ఆతని తలనుండి చాల రక్తము స్రవించెను(50). వీరభద్రుడు నేల గూలుటను గాంచి రుద్రగణములు భయముతో ఆక్రోశిస్తూ యుద్దమును వీడి మహేశ్వరుని వద్దకు పరుగెత్తిరి (51). అపుడ చంద్రశేఖరుడు గణముల కోలాహలమును విని తన ప్రక్కన నిలబడియున్న వీరులగు గణనాయకులను ప్రశ్నించెను(52).*


*శంకురుడిట్లు పలికెను - నా గణములలో పెద్ద కోలాహలము చెలరేగుచున్నది. కారణమేమి? మహావీరులారా! పరిశీలించుడు. నేను నిశ్చయముగా ఈ కోలాహలమును శాంతింప జేయవలెను (53). ఆ దేవదేవుడు ఈ తీరును సాదరముగా గణాధ్యక్షులను ప్రశ్నించునంతలో, ఆ గణములు ప్రభువు సమీపమునకు వచ్చిరి (54). దుఃఖితులై యున్న వారిని గాంచి రుద్రప్రభుడు'కుశలమేనా?' యని ప్రశ్నించెను. ఆ గణములు జరిగిన వృత్తాంతమును యథా తథముగా విస్తరముగా చెప్పిరి (55). గొప్ప లీలలను చేయు భగవాన్‌ రుద్రప్రభుడు ఆ వృత్తాంతమును విని వారికి అభయమునిచ్చి వారిలో గొప్ప ఉత్సాహము వర్థిల్లు నట్లు చేసెను (56).*


*శ్రీ శివమహాపురాణములోని రుద్రసంహితయందు యుద్ధఖండలో విశేషయుద్ధవర్ణమనే ఇరువది ఒకటవ అధ్యాయము ముగిసినది (21).*


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 SRI SIVA MAHA PURANA - 796 🌹*

*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *


*🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 21 🌴*


*🌻 Description of the Special War - 7 🌻*


48. Then the king of the Daityas leapt up to him with a great iron club. That powerful warrior reached very near Vīrabhadra very quickly.


49. The heroic and powerful son of the ocean hit Vīrabhadra on his head with his great iron club. He then roared.


50. Vīrabhadra, the leader of the Gaṇas, fell on the ground with his head shattered by the iron club and shed much blood.


51. On seeing Vīrabhadra fallen, the terrified Gaṇas abandoned the battle ground shrieking and fled to lord Śiva.


52. On hearing the tumultuous uproar of the Gaṇas, the moon-crested lord asked the excellent Gaṇas, the heroes standing near him.


Śiva said:—

53. How is this tumultuous uproar among my Gaṇas? O heroes, let this be enquired into. Peace shall be established by me, of course.


54. Even as the lord of the gods was conducting the enquiry, the leaders of the Gaṇas approached the lord.


55. On seeing them dejected, the lord enquired after their health. The Gaṇas then intimated to him everything in detail.


56. On hearing it, lord Śiva, the expert in divine sports assured them of freedom from fear increasing their enthusiasm.


Continues....

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 49 / Osho Daily Meditations  - 49 🌹*

*✍️. ప్రసాద్ భరద్వాజ*


*🍀 49. వైఫల్యం 🍀*


*🕉. మీరు వైఫల్యం కాలేరు; జీవితం వైఫల్యాన్ని అనుమతించదు. మరియు లక్ష్యం లేనందున, మీరు నిరాశ చెందలేరు. 🕉*


*మీరు నిరుత్సాహానికి గురైతే, మీరు జీవితంపై విధించిన మానసిక లక్ష్యమే కారణం. మీరు మీ లక్ష్యాన్ని చేరుకునే సమయానికి, జీవితం దానిని విడిచిపెట్టింది; ఆదర్శాలు మరియు లక్ష్యాల యొక్క డొల్ల మిగిలి ఉంది. మీరు మళ్లీ విసుగు చెందుతారు. నిరాశను మీరు సృష్టించారు. జీవితం ఎప్పుడూ లక్ష్యానికి పరిమితం కాదని మీరు అర్థం చేసుకున్న తర్వాత, మీరు భయం లేకుండా అన్ని దిశలలో ప్రవహిస్తారు. ఎందుకంటే అపజయం లేదు, విజయం కూడా లేదు- ఆపై నిరాశ ఉండదు.*


*అప్పుడు ప్రతి క్షణం దానికదే ఒక క్షణం అవుతుంది; అది ఎక్కడికో దారి తీస్తున్నదని కాదు, ఏదో ఒక ముగింపు కోసం దానిని సాధనంగా ఉపయోగించాలని కాదు. అది అంతర్లీన విలువను కలిగి ఉంటుంది. ప్రతి క్షణం వజ్రం, మరియు మీరు ఒక వజ్రం నుండి మరొక వజ్రంలోకి వెళతారు. కాని ఏదీ అంతిమంగా ఉండదు. జీవితం సజీవంగానే ఉంటుంది... మరణం లేదు. అంతం అంటే మరణం, పరిపూర్ణత అంటే మరణం, లక్ష్యాన్ని చేరుకోవడం అంటే మరణం. జీవితానికి మరణం తెలియదు. అది తన రూపాలను, ఆకారాలను మార్చుకుంటూనే ఉంటుంది. ఇది అనంతం, కానీ లక్ష్యం లేదు.*


*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Osho Daily Meditations  - 49 🌹*

📚. Prasad Bharadwaj


*🍀 49. FAILURE  🍀*


*🕉 . You cannot be a failure; life does not allow failure. And because there is no goal, you cannot be frustrated. 🕉*


*If you feel frustrated, it is because of the mental goal you have imposed on life. By the time you have reached your goal, life has left it; just a dead shell of the ideals and the goals remain, and you are frustrated again. The frustration is created by you. Once you understand that life is never going to be confined to a goal, goal oriented, then you flow in all directions with no fear. Because there is no failure, there is no success either-and then there is no frustration.*


*Then each moment becomes a moment in itself; not that it is leading somewhere, not that it has to be used as a means to some end-it has intrinsic value. Each moment is a diamond, and you go from one diamond to another-but there is no finality to anything. Life remains alive ... there is no death. Finality means death, perfection means death, reaching a goal means death. Life knows no death-it goes  on changing its forms, shapes. It is an infinity, but to no purpose.*


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 485 - 494 -1 / Sri Lalitha Chaitanya Vijnanam  - 490 - 494 - 1🌹*

*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*

*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*

*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*


*🍀  100. అనాహతాబ్జ నిలయా, శ్యామాభా, వదనద్వయా ।

దంష్ట్రోజ్జ్వలా, అక్షమాలాధిధరా, రుధిర సంస్థితా ॥ 100 ॥ 🍀*

*🍀  101. కాళరాత్ర్యాది శక్త్యోఘవృతా, స్నిగ్ధౌదనప్రియా ।

మహావీరేంద్ర వరదా, రాకిణ్యంబా స్వరూపిణీ ॥ 101 ॥ 🍀*


*🌻 485 నుండి 494వ నామము వరకు వివరణము - 1 🌻*


*హృదయమందు పండ్రెండు దళములతో అనాహత పద్మము యున్నది. అందుండు శ్రీమాతను 'రాకినీదేవి' అందురు. “షట్చక్ర నిరూపణము" న యిచ్చటి మాతను 'కాకిని' అని పిలుతురు. ఈమె నలుపు నీల వర్ణము (కృష్ణ వర్ణము) గలది. అందువలన 'శ్యామా' అని పిలువ బడుచున్నది. ఈ శ్యామలాదేవి పదహారు సంవత్సరములు వయస్సుగల స్త్రీ వలె గోచరించును. శ్రీకృష్ణుడు, శ్రీమాత పదహారేండ్ల వయస్సు గల వారిగ, నిత్య యౌవనులుగ కీర్తింపబడుటకు, అతనిని 'శ్యాం' అని పిలుచుటకు, ఆమెను 'శ్యామల' అని పిలుచుటకు అంతరార్థము తెలియనగును. వారెల్లప్పుడు హృదయము నందు వసించి యుండుటయే కారణము.*


*సశేషం...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 485 to 494 - 1 🌹*

*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*

*✍️ Prasad Bharadwaj*


*🌻100. Anahatabjanilaya shyamabha vadanadvaya

danshtrojvalakshamaladi dhara rudhira sansdhita॥ 100 ॥ 🌻*

*🌻101. Kalaratryadishaktyao-ghavruta snigdhao-dana priya

mahavirendra varada rakinyanba svarupini  ॥ 101 ॥ 🌻*


*🌻 Description of Nos. 485 to 494 Names - 1🌻*


*In the heart there is an Anahata Padma with twelve petals. Srimata who resides here is called 'Rakini Devi'. In 'Shatchakra nirupana' this mother is called 'Kakini'. She is black in color (Krishna Varna). Hence she is called 'Shyama'. This dark goddess appears as a sixteen year old woman. To glorify Lord Krishna, Srimata are glorified as sixteen-year-old, eternally youthful, hence he is called 'Shyam' and she 'Shyamala'. The reason is that they always reside in the heart.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Join and Share

🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹

Comments


bottom of page