🍀🌹 31, JULY 2023 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 31, JULY 2023 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 406 / Bhagavad-Gita - 406 🌹
🌴10వ అధ్యాయము - విభూతి యోగం - 34 / Chapter 10 - Vibhuti Yoga - 34 🌴
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 253 / Agni Maha Purana - 253 🌹
🌻. శివ పూజా విధి వర్ణనము - 9 / Mode of worshipping Śiva (śivapūjā) - 9 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 118 / DAILY WISDOM - 118 🌹
🌻 27. ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధం / 27. A Relationship between Two Persons 🌻
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 384 🌹*
6) 🌹. శివ సూత్రములు - 120 / Siva Sutras - 120 🌹
🌻 2-08. శరీరం హవిః - 2 / 2-08. śarīram havih - 2 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 31, జూలై, JULY 2023 పంచాంగము - Panchangam 🌹*
*శుభ సోమవారం, Monday, ఇందు వాసరే*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻*
*🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 41 🍀*
*83. భూతాలయో భూతపతి రహోరాత్ర మనిందితః*
*84. వాహితా సర్వభూతానాం నిలయశ్చ విభుర్భవః |*
*అమోఘః సంయతో హ్యశ్వో భోజనః ప్రాణధారణః*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : ప్రాణకోశ ప్రవృత్తి ఆవశ్యకత - దివ్య కర్మ విలసనకు ప్రాణకోశ ప్రవృత్తి అత్యంతావశ్యకం. అది లేకుండా జీవితానికి పూర్ణాభివ్యక్తి, పూర్ణ సాఫల్యం కలుగనేరవు. సాధన కవరోధాలు కల్పించే ప్రాణకోశపు కలగాపులగ స్థితిగా నేను పేర్కొనునది కామ దూషితము, అహంకార భూయిష్టమూనై, అవరోద్వేగముల కాలవాలమైన దాని బాహ్యతల స్వరూపం. 🍀*
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
వర్ష ఋతువు, దక్షిణాయణం,
శ్రావణ మాసం
తిథి: శుక్ల త్రయోదశి 07:28:06
వరకు తదుపరి శుక్ల చతుర్దశి
నక్షత్రం: పూర్వాషాఢ 18:59:01
వరకు తదుపరి ఉత్తరాషాఢ
యోగం: వషకుంభ 23:05:01
వరకు తదుపరి ప్రీతి
కరణం: తైతిల 07:26:06 వరకు
వర్జ్యం: 06:08:00 - 07:33:40
దుర్ముహూర్తం: 12:48:13 - 13:39:53
మరియు 15:23:13 - 16:14:53
రాహు కాలం: 07:31:47 - 09:08:39
గుళిక కాలం: 13:59:16 - 15:36:08
యమ గండం: 10:45:31 - 12:22:23
అభిజిత్ ముహూర్తం: 11:57 - 12:47
అమృత కాలం: 14:42:00 - 16:07:40
సూర్యోదయం: 05:54:55
సూర్యాస్తమయం: 18:49:52
చంద్రోదయం: 17:48:07
చంద్రాస్తమయం: 03:55:56
సూర్య సంచార రాశి: కర్కాటకం
చంద్ర సంచార రాశి: ధనుస్సు
యోగాలు: ఉత్పాద యోగం - కష్టములు,
ద్రవ్య నాశనం 18:59:01 వరకు తదుపరి
మృత్యు యోగం - మృత్యు భయం
దిశ శూల: తూర్పు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 406 / Bhagavad-Gita - 406 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 34 / Chapter 10 - Vibhuti Yoga - 34 🌴*
*34. మృత్యు: సర్వహరశ్చాహముద్భవశ్చ భవిష్యతామ్ |*
*కీర్తి: శ్రీర్వాక్చ నారీణాం స్మృతిర్మేధా ధృతి: క్షమా ||*
*🌷. తాత్పర్యం : సమస్తమును మ్రింగివేయునటువంటి మృత్యువును మరియు సృష్టింపబడుచున్న జీవులకు ఉద్భవమును నేనే అయి యున్నాను. స్త్రీల యందలి యశస్సు, వైభవము, మనోహరమగు వాక్కు, జ్ఞాపకశక్తి, బుద్ధి, ధృతి, ఓర్పును నేనే.*
*🌻. భాష్యము : జన్మతోడనే మనుజుడు ప్రతిక్షణము మరణించుట ఆరంభించును. అనగా మృత్యువు జీవుని ప్రతిక్షణము కబళించుచున్నను దాని చివరి ఘాతమే మృత్యువుగా పిలువబడును. ఆ మృత్యువే శ్రీకృష్ణుడు. భవిష్యత్ పురోగతికి సంబంధించినంతవరకు జీవులు పుట్టుట, పెరుగుట, కొంతకాలము స్థితిని కలిగి యుండుట, ఇతరములను సృష్టించుట, క్షీణించుట, అంత్యమున నశించుట యనెడి ఆరువిధములైన మార్పులను పొందుచుందురు. ఇట్టి మార్పులలో మొదటిదైన గర్భము నుండి జననము శ్రీకృష్ణుడే. ఆ జన్మమే తదుపరి కర్మలకు నాందియై యున్నది.*
*కీర్తి, శ్రీ:, వాక్కు, స్మృతి, బుద్ధి, ధృఢత్వము, క్షమా అను ఏడు వైభవములు స్త్రీవాచకములుగా భావింపబడును. వానినన్నింటిని గాని లేక కొన్నింటినిగాని మనుజుడు కలిగియున్నచో కీర్తినీయుడగును. ఎవరైనా ధర్మాత్ముడని ప్రసాద్ది నొందినచో అతడు కీర్తివంతుడు, వైభవోపేతుడు కాగలడు. ఉదాహరణకు సంస్కృతము పూర్ణమైన భాషయైనందున వైభవోపేతమై యున్నది. ఏదేని విషయమును అధ్యయనమును చేసిన పిమ్మట మనుజడు దానిని జ్ఞప్తి యందుంచుకొనగలిగినచో అతడు చక్కని “స్మృతి”ని కలిగియున్నాడని భావము. పలువిషయములపై పెక్కు గ్రంథములు పఠించుటయే గాక, వాటిని అవగాహన చేసికొని అవసరమైనప్పుడు ఉపయోగించుట “మేధ” యనబడును. అది మరియొక విభూతి. చంచలత్వమును జయించుటయే దృఢత్వము (ధృతి) అని పిలువబడును. పరిపూర్ణయోగ్యత కలిగియుండియు నమ్రతను, మృదుస్వభావమును కలిగి సుఖదుఃఖములందు సమత్వమును కలిగియున్నచో మనుజుని ఆ లక్షణము (వైభవము) ‘క్షమా’ అనబడును.*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 406 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 10 - Vibhuti Yoga - 34 🌴*
*34. mṛtyuḥ sarva-haraś cāham udbhavaś ca bhaviṣyatām*
*kīrtiḥ śrīr vāk ca nārīṇāṁ smṛtir medhā dhṛtiḥ kṣamā*
*🌷 Translation : I am all-devouring death, and I am the generating principle of all that is yet to be. Among women I am fame, fortune, fine speech, memory, intelligence, steadfastness and patience.*
*🌹 Purport : As soon as a man is born, he dies at every moment. Thus death is devouring every living entity at every moment, but the last stroke is called death itself. That death is Kṛṣṇa. As for future development, all living entities undergo six basic changes. They are born, they grow, they remain for some time, they reproduce, they dwindle, and finally they vanish. Of these changes, the first is deliverance from the womb, and that is Kṛṣṇa. The first generation is the beginning of all future activities.*
*The seven opulences listed – fame, fortune, fine speech, memory, intelligence, steadfastness and patience – are considered feminine. If a person possesses all of them or some of them he becomes glorious. If a man is famous as a righteous man, that makes him glorious. Sanskrit is a perfect language and is therefore very glorious. If after studying one can remember a subject matter, he is gifted with a good memory, or smṛti. And the ability not only to read many books on different subject matters but to understand them and apply them when necessary is intelligence (medhā), another opulence. The ability to overcome unsteadiness is called firmness or steadfastness (dhṛti). And when one is fully qualified yet is humble and gentle, and when one is able to keep his balance both in sorrow and in the ecstasy of joy, he has the opulence called patience (kṣamā).*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 252 / Agni Maha Purana - 252 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 74*
*🌻. శివ పూజా విధి వర్ణనము - 8 / Mode of worshipping Śiva (śivapūjā) - 8 🌻*
*ఆసనముపై ఆసీనుడై యున్న శివుని దివ్యమూర్తి ముప్పదిరెండు లక్షణములతో ప్రకాశించుచున్నదని చింతనము చేయుచు, శివస్మరణము చేయుచు, ''ఓం హాం హాం హాం శిమూర్తయే నమః'' అను మంత్ర ముచ్చరించుచు నమస్కారము చేయవలెను, బ్రహ్మాది కారణ త్యాగ పూర్వకముగు మంత్రమును శివుని యందు ప్రతిష్ఠితము చేయవలెను. లలాట మధ్య భాగమున చంద్రుడు వలె ప్రకాశించుచున్న బిందు రూప పరమ శివుడు హృదయాదు లగు ఆరు అంగములతో సంయుక్తుడై పుష్పాంజలిలోనికి దిగి వచ్చి నట్లు భావన చేసి ఆయనను పూజింపనున్న మూర్తియందు స్థాపించవలెను. పిమ్మట ఆవాహనీముద్రతో ''ఓం హాం హౌం శివాయ నమః'' అను మంత్ర ముచ్చరించుచు, మూర్తిపై శివుని ఆవాహనము చేయవలెను. స్థాపనీముద్రచే స్థాపనము చేసి, సంనిధాపనీముద్రతో సన్నిహితుని చేసి, సంనిరోధనీముద్రతో ఆ మూర్తి పై కదల కుండు నట్లు చేయవలెను. పిమ్మట ''నిష్ఠురాయై కాలకల్యాయై ఫట్'' అను మంత్రము ఉచ్చరించుచు ఖడ్గముద్రతో భయమును చూపుచు విఘ్నములను పారద్రోలవలెను.*
*పిమ్మట లింగముద్రను చూపి నమస్కారము చేయవలెను. 'నమః' అని అవగుంఠనము చేయవలెను. ఇష్టదేవతను తన వైపునకు అభిముఖముగ నున్నట్లు చేయుటయే ఆవాహనము. దేవతను అర్చా విగ్రహముపై కూర్చుండబెట్టుట స్థాపనము, ''ప్రభూ! నేను నీవాడను'' అని పలుకుచు భగవంతునితో అతి సన్నిహిత సంబంధము నేర్పరచుకొనుటయే సంనిధానము''. శివపూజకు సంబంధించిన కర్మకాండ అంతయు పూర్తి అగువరకు భగవత్సంనిధాన ముండునట్లు చేయుట ''నిరోధము'' భక్తులు కాని వారికి శివతత్త్వము తెలియకుండు నట్లు చేయుట అవగుంఠనము. పిమ్మట సకలీకరణము చేసి 'హృదయాయ నమః' ఇత్యాదిమంత్రములతో హృదయాద్యంగములకు అంగులతో ఏకత్వమును స్థాపించుటయే 'అమృతీకరణము' చైతన్య శక్తి శంకరుని హృదయము, ఎనిమిది విధములైన ఐశ్వర్యము శిరస్సు, వశిత్వము శిఖ, అభేద్యమగు తేజస్సు కవచము, దుస్సహమైన ప్రతాపమే సమస్త విఘ్నములను నివారించు అస్త్రము హృదయముతో ప్రారంభించి ''నమః, స్వధా, స్వాహా, వౌషట్ అనునవి ఉచ్చరించుచు పాద్యాదులను నివేదించవలెను.*
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Agni Maha Purana - 252 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *
*Chapter 74*
*🌻 Mode of worshipping Śiva (śivapūjā) - 8 🌻*
52-54. The image of Śiva possessing thirty-two characteristics (should be installed) at the centre. Hāṃ, haṃ, hāṃ (salutations) to the image of Śiva. After having meditated upon the self-luminant Śiva, the mantra should be led to the spot sacred to Śiva after leaving below the place sacred to Brahmā. Then (the worshipper) having meditated upon that Supreme form of Śiva, effulgent with the splendour of the moon, as a luminous point at the middle of the forehead and being invested with the six constituents, with flowers in folded palms, should deposit (those flowers) on the form of (Goddess) Lakṣmī.
55-57. Oṃ, hāṃ, hauṃ salutations to Śiva. (The deity) should be invoked with the invoking hṛd (mantra). Having established Śiva with the sthāpanī (mudrā)[3], and placed near (that) should be checked with Niṣṭhurā and Kālakāntī concluding with phaṭ. After having removed obstructions by sending them away and making obeisance by (showing) the liṅgamudrā, it should be covered with the hṛd (mantra). The invocation should follow it. Then standing in front of the image he-should repeat. “Let you be located and firmly established. O lord! I am in your presence.”
58. The (rite of) avaguṇṭhana signifies the presence and supervision of the God and the exhibition of one’s devotion (to the God) from the commencement to the end of the act.
59. After having done the accomplishing act with the six mantras, the (rite of) amṛtīkaraṇa should be performed by mentioning different parts of the body along with the body.
60-61. The worshipper should permeate his heart with the energy of consciousness of Śambhu (Śiva). Similarly, (he should. contemplate) the tuft of hair of Śiva as formed of the eightfold glories. The worshipper should contemplate the invincible energy of God as forming his armour, the unbearable prowess of God which removes all impediments (and the words) salutations, svadhā, svāhā and vauṣaṭ (should be appended) in. order.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 118 / DAILY WISDOM - 118 🌹*
*🍀 📖 . ఆత్మ యొక్క ఆరోహణ నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🌻 27. ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధం / 27. A Relationship between Two Persons 🌻*
*సామాజికబంధం అనేది వ్యక్తిగతంగా అనుసంధానించబడిన వ్యక్తులతో సంబంధం లేకుండా పనిచేసే బాహ్య విషయంగా మాత్రమే ఉండి, వ్యక్తుల స్వభావానికి దగ్గరగా లేనంత కాలం సామాజికంగా ఉండే భద్రత మరియు స్నేహాలపై మీరు విశ్వాసం ఉంచలేరు. ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధం వారి మూల పదార్ధంలోకి ప్రవేశించాలి; అప్పుడే వారి మధ్య సంబంధం స్నేహపూర్వకంగా, సురక్షితంగా మరియు శాశ్వతంగా మారుతుంది.*
*కానీ ఈ సంబంధం కేవలం సంబంధమున్న వ్యక్తులపై బయట ఒత్తిడితో ఏర్పడిన ఒక రూపం మాత్రమే తప్ప వారి మూల పదార్థంలో భాగం కాకపోతే, ఆ బాహ్య ఒత్తిడి వీగిపోగానే వారి మధ్య ఆ సయోధ్య పోతుంది. దేశాలు అమలు పరిచే చట్టాలలో జీవం లేకుండా కేవలం యాంత్రికంగా ఉంటే ఇలాగే ఉంటుంది. హోబ్స్ చెప్పిన సిద్ధాంతాలు మనం అర్థ చేసుకుంటే అతను కేవలం సంపూర్ణ రాజ్యాధికారం ఉంటే తప్ప దేశాన్ని పరిపాలించడం వీలు కాదని అన్నాడు. అంటే అతను దేశాన్ని కేవలం యాంత్రికంగా మాత్రమే పరిపాలించవచ్చని ప్రతిపాదించాడు.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 118 🌹*
*🍀 📖 The Ascent of the Spirit 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
*🌻 27. A Relationship between Two Persons 🌻*
*Social security and friendship cannot be assured as long as social relationship remains merely an external connection operating independent of the individuals so connected, and not intrinsic to the nature of the individuals themselves. A relationship between two persons hasto enter into the very substance of which the two persons are made; it is only then that the relationship between them becomes friendly, secure and permanent.*
*But if this relationship is only a form taken by a pressure exerted by something else upon the individuals appearing to be related, then the individuals so related by an extrinsic power foreign to their own nature can fly at the throats of each other the moment this extrinsic pressure is lifted. This is what happens if the State enforcing the laws of the society is a machinery rather than an organism. With Hobbes we may think the State cannot be anything more than a machine externally operating upon the individual, whatever be the necessity felt to operate this machine.*
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 384 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. ఆట, పాట, ప్రేమ, సృజన, ఉత్సాహం, నువ్వు యివన్నీ పవిత్రతకు వ్యతిరేకం కావు. అవి సృష్టిలోని సహజభాగాలు. ప్రపంచానికి, పవిత్రమైన దానికి తేడా లేదు. 🍀*
*నిజమైన మతమున్న మనిషి భూమిపై నిలబడతాడు. నిలబడాలి. లేకపోతే అతనికి పునాదులుండవు. అందువల్లే నేను భూమిలో నిలదొక్కుకోవడం గురించే చెబుతాను. భూమిలో పునాదులుంటేనే ఆకాశంలోకి ఎదిగే వీలుంటుంది. భూమిలో లోతుల్లో వేర్లు వుంటేనే పూలు పూచే వీలుంది. అందువల్ల నాకు ప్రపంచానికి, పవిత్రమైన దానికి తేడా లేదు అని ఒకే నాణేనికి రెండు వైపులు. కాబట్టి ఆట, పాట, ప్రేమ, సృజన, ఉత్సాహం, నువ్వు యివన్నీ పవిత్రతకు వ్యతిరేకం కావు.*
*అవి దానిలో సహజభాగాలు. దానిలో సగభాగం. ఆ సగభాగాన్ని తక్కిన సగభాగం అనుసరిస్తుంది. అవి వేరు కాదు. గతంలో దానిలోని రెండో సగం ముఖ్యం. ఎంత ముఖ్యమంటే మొదటి సగం లేనేలేదు. మతం చనిపోయిన విధమిది. దేవుడు భూమిలో చనిపోయిన విధమిది. దేవుడు వేర్లు లేని చెట్టయ్యాడు. దేవుడు మళ్ళీ జీవించే వీలుంది. దేవుడికి భూమిలో వేర్లు నిలదొక్కుకోవాలి. ఆ వేరే పాట, ఆట, ఉత్సవం, ఉల్లాసం.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శివ సూత్రములు - 120 / Siva Sutras - 120 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*2వ భాగం - శక్తోపాయ*
*✍️. ప్రసాద్ భరధ్వాజ*
*🌻 2-08. శరీరం హవిః - 2 / 2-08. śarīram havih - 2 🌻*
*🌴. ఆత్మ శుద్ధి అనే యాగంలో దేహమే నైవేద్యంగా ఉంటుంది, అందులో పాల్గొనే శక్తులకు నైవేద్యంగా మనస్సు మరియు శరీరం యొక్క మలినాలను జ్ఞాన అగ్నిలో పోస్తారు. 🌴*
*దీనిని ఆటోమొబైల్ యొక్క టైర్ తో పోల్చవచ్చు. రబ్బరుతో చేసిన బాహ్య భాగం స్థూల శరీరం. లోపల గాలిని ఉంచే లోపలి గొట్టం సూక్ష్మ శరీరం. ఇక కనిపించని గాలి, ఏదైతే మూడింటిలో చాలా ముఖ్యమైనదో, మిగిలిన రెండూ మాత్రమే కాకుండా, ఆటోమొబైల్ మరియు దాని ప్రయాణీకులు కూడా కదలిక కోసం ఆధారపడతారో, అన్నింటికంటే సూక్ష్మమైనది. సూక్ష్మమైన గాలి లేకుండా ఆటోమొబైల్ ఉపయోగం లేదు. మానవ శరీరం విషయంలో కూడా అలాగే ఉంటుంది మరియు మానవ శరీరంలో అత్యంత సూక్ష్మమైనది ఆత్మ. స్థూలం కంటే సూక్ష్మమైనది ఎక్కువ శక్తిని కలిగి ఉంటుందని కూడా ఇది సూచిస్తుంది.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Siva Sutras - 120 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 2 - Śāktopāya.
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*
*🌻 2-08. śarīram havih - 2 🌻*
*🌴. The body is the oblation in the sacrifice of self-purification in which the impurities of the mind and body are poured in to the fire of knowledge as an offering to the shaktis who participate in it. 🌴*
*This can be compared to a tyre (tier) of an automobile. The exterior part made of rubber is the gross body. The inner tube that holds air within is the subtler body and the air that is invisible, but is the most important of the three, on which not only the other two depend upon, but also the automobile itself and its passengers also depend for mobility is the subtlest of all. There is no use of an automobile without the subtlest air. Same is the case with the human body and the subtlest of human body is the soul. It also signifies that the subtlest has more potency than the gross.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
コメント