top of page
Writer's picturePrasad Bharadwaj

🌹 31, MARCH 2023 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు 🌹

🍀🌹 31, MARCH 2023 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు 🌹🍀

1) 🌹 31, MARCH 2023 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹

2) 🌹. శ్రీమద్భగవద్గీత - 348 / Bhagavad-Gita - 348 🌹 🌴 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం / Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 10 వ శ్లోకము 🌴

4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 195 / Agni Maha Purana - 195 🌹 🌻. అధివాసనము - 2 / Preliminary consecration of an image (adhivāsana) - 2 🌻

4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 060 / DAILY WISDOM - 060 🌹 🌻 29. ద్వంద్వత్వం వల్ల భయం కలుగుతుంది / 29. Fear is Caused by Duality 🌻

5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 325 🌹

6) 🌹. శివ సూత్రములు - 62 / Siva Sutras - 62 🌹

🌻. 20. భూత సంధాన భూత పృథక్త్వా విశ్వ సంఘటః - 1 / 20. Bhūta sandhāna bhūta pṛthaktva viśva saṃghaṭṭāḥ - 1 🌻


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 31, మార్చి, March 2023 పంచాగము - Panchagam 🌹*

*శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday*

*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*


*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు🌻*


*🍀. శ్రీ మహాలక్ష్మీ సుప్రభాతం -38 🍀*


*38. భక్తాన్తరఙ్గగతభావవిధే నమస్తే రక్తామ్బుజాతనిలయే స్వజనానురక్తే ।*

*ముక్తావలీసహితభూషణభూషితాఙ్గి లక్ష్మి త్వదీయచరణౌ శరణం ప్రపద్యే ॥*


🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నేటి సూక్తి : ఏకాగ్రతా సాధన శ్రమ - ఆలోచనా కేంద్రమైన మెదడు నందు ఏకాగ్రతా సాధన ఒక తపశ్చర్య. దాని వలన శ్రమ కలుగక తప్పదు. ఆ కేంద్రమునుండి పూర్తిగా వెలికి రాగలిగినప్పుడే సాధకునకు ఆ సాధన శ్రమ లేకుండా పోతుంది. 🍀*


🌷🌷🌷🌷🌷


విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

వసంత ఋతువు, ఉత్తరాయణం,

చైత్ర మాసం

తిథి: శుక్ల-దశమి 26:00:43 వరకు

తదుపరి శుక్ల-ఏకాదశి

నక్షత్రం: పుష్యమి 25:58:51

వరకు తదుపరి ఆశ్లేష

యోగం: సుకర్మ 25:56:17 వరకు

తదుపరి ధృతి

కరణం: తైతిల 12:44:49 వరకు

వర్జ్యం: 07:59:20 - 09:47:12

దుర్ముహూర్తం: 08:39:18 - 09:28:27

మరియు 12:45:01 - 13:34:10

రాహు కాలం: 10:48:18 - 12:20:27

గుళిక కాలం: 07:44:01 - 09:16:10

యమ గండం: 15:24:44 - 16:56:53

అభిజిత్ ముహూర్తం: 11:56 - 12:44

అమృత కాలం: 18:46:32 - 20:34:24

సూర్యోదయం: 06:11:52

సూర్యాస్తమయం: 18:29:01

చంద్రోదయం: 13:44:27

చంద్రాస్తమయం: 02:28:13

సూర్య సంచార రాశి: మీనం

చంద్ర సంచార రాశి: కర్కాటకం

యోగాలు: ఉత్పాద యోగం - కష్టములు,

ద్రవ్య నాశనం 25:58:51 వరకు తదుపరి

మృత్యు యోగం - మృత్యు భయం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻


*🍀. నిత్య ప్రార్థన 🍀*

*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*

*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*

*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*

*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*

*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*

*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*

🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీమద్భగవద్గీత - 348 / Bhagavad-Gita - 348 🌹*

*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*


*🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 10 🌴*


*10. మయాధ్యక్షేణ ప్రకృతి: సూయతే సచరాచరమ్ |*

*హేతునానేన కౌన్తేయ జగద్విపరివర్తతే ||*


🌷. తాత్పర్యం :

*ఓ కౌంతేయా! నా శక్తులలో ఒకటైన భౌతికప్రకృతి నా అధ్యక్షతన వర్తించుచు స్థావరజంగమములను సృష్టించుచున్నది. దాని నియమము ననుసరించియే ఈ జగత్తు మరల మరల సృష్టించబడుచు లయము నొందుచున్నది.*


🌷. భాష్యము :

*భౌతికజగత్తు కర్మలకు దూరముగా నున్నప్పటికి శ్రీకృష్ణభగవానుడే సర్వమునకు పరమాధ్యక్షుడని ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. ఈ సృష్టి వెనుక నున్న దివ్యసంకల్పము మరియు పూర్వరంగము ఆ దేవదేవుడే. కాని దాని నిర్వహణము మాత్రము భౌతికప్రకృతిచే కొనసాగించబడుచుండును. వివిధరూపములలో, జాతులలో నున్న సర్వజీవులకు తాను తండ్రినని శ్రీకృష్ణభగవానుడు భగవద్గీత యందే తెలిపియున్నాడు. సంతానము కొరకై తండ్రి తల్లి యందు బీజప్రదానము చేయునట్లు, భగవానడు కేవలము తన చూపు ద్వారా జీవులను ప్రకృతి గర్భములలో బీజరూపమున ఉంచగా వారు తమ పూర్వకోరికలు, కర్మల ననుసరించి వివిధరూపములలో మరియు జాతులలో జన్మింతురు. జీవులందరును శ్రీకృష్ణ భగవానుని వీక్షణము చేతనే జన్మించినను, తమ కర్మానుసారము మరియు కోరికల ననుసరించి వివిధ దేహములను పొందవలసివచ్చును. అనగా యా భగవానునికి ఈ భౌతికసృష్టితో ఎట్టి ప్రత్యక్ష సంబంధము లేదు. కేవలము అతని వీక్షణము చేతనే ప్రభావితమై సమస్తము శీఘ్రమే సృష్టింపబడుచున్నది.*


*ప్రకృతిపై భగవానుడు దృష్టి సారించుచున్నందున సృష్టి విషయమున అతడు కర్మనొనరించుచున్నాడన్న విషయము సందేహరహితమైనను, భౌతికజగత్తు వ్యక్తీకరణమునందు మాత్రము అతనకి ప్రత్యక్ష సంబంధముండదు. ఈ విషయమున స్మృతి ఒక చక్కని ఉపమానమును ఒసగుచున్నది. సువాసన కలిగిన పుష్పము మనుజూని ముందున్నప్పుడు దాని సుగంధము అతని ఘ్రాణశక్తిని చేరినను, మనుజుని ఘ్రాణశక్తి మరియు పుష్పములు ఒకదాని నుండి వేరొకటి విడివడియే యుండును. భౌతికజగత్తు మరియు భగవానుని నడుమగల సంబంధము సైతము ఇట్టిదియే. వాస్తవమునకు భౌతికజగత్తులో ఎట్టి సంబంధము లేకున్నను అతడు తన వీక్షణముచే దానిని సృష్టించి నియమించును. సారాంశమేమనగా శ్రీకృష్ణభగవానుని అధ్యక్షత లేనిదే ప్రకృతి ఏమియును చేయజాలదు. అయినను ఆ దేవదేవుడు సర్వవిధములైన భౌతికకర్మల యెడ అనాసక్తుడై యుండును.*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Bhagavad-Gita as It is - 348 🌹*

*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*


*🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 10 🌴*


*10 . mayādhyakṣeṇa prakṛtiḥ sūyate sa-carācaram*

*hetunānena kaunteya jagad viparivartate*


🌷 Translation :

*This material nature, which is one of My energies, is working under My direction, O son of Kuntī, producing all moving and nonmoving beings. Under its rule this manifestation is created and annihilated again and again.*


🌹 Purport :

*It is clearly stated here that the Supreme Lord, although aloof from all the activities of the material world, remains the supreme director. The Supreme Lord is the supreme will and the background of this material manifestation, but the management is being conducted by material nature. Kṛṣṇa also states in Bhagavad-gītā that of all the living entities in different forms and species, “I am the father.” The father gives seeds to the womb of the mother for the child, and similarly the Supreme Lord by His mere glance injects all the living entities into the womb of material nature, and they come out in their different forms and species, according to their last desires and activities. All these living entities, although born under the glance of the Supreme Lord, take their different bodies according to their past deeds and desires. So the Lord is not directly attached to this material creation. He simply glances over material nature; material nature is thus activated, and everything is created immediately.*


*Because He glances over material nature, there is undoubtedly activity on the part of the Supreme Lord, but He has nothing to do with the manifestation of the material world directly. There is a similar connection between the material world and the Supreme Personality of Godhead; actually He has nothing to do with this material world, but He creates by His glance and ordains. In summary, material nature, without the superintendence of the Supreme Personality of Godhead, cannot do anything. Yet the Supreme Personality is detached from all material activities.*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 195 / Agni Maha Purana - 195 🌹*

*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*

*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*

*ప్రథమ సంపుటము, అధ్యాయము - 59*


*🌻. అధివాసనము - 2 🌻*


*బుద్ధి నుండి అహంకారము, అహంకారమునుండి మనస్సు జనించినది. మనస్సు నుండి శబ్ద-స్పర్శ-రూప-రస- గంధములనెడు సంకల్పాదియుక్తములగు ఐదు విషయములు ఉత్పన్నమైనవి.*


*వీటినుండి జ్ఞానశక్తి గల త్వక్‌-శ్రోత్ర-ఘ్రాణ-నేత్ర-జిహ్వలను ఐదు ఇంద్రియములావిర్భవించినవి. వీటికి జ్ఞానేంద్రియములని పేరు. పాద - పాయుపాణి - వాక్‌ - ఉపస్థలు పంచకర్మేంద్రియములు. ఇప్పుడు పంచభూతముల పేర్లు వినుము, ఆకాస వాయు తేజో - జల - పృథివులు పంచమహాభూతములు. అన్నింటికిని అధారమగు స్థూలశరీరము ఈ భూతముల నుండియే పుట్టుచున్నది. ఈతత్త్వములకు వాచకములగు ఉత్తమ బీజాక్షరములను న్యాసమునిమిత్తమైన చెప్పుచున్నాను. 'మం' అను బీజము జీవస్వరూపము (జీవతత్త్వవాచకము) ఇది శరీరమంతయు వ్యాపించయున్నదని భావనచేసి దీనిని సకల దేహవ్యాపకన్యాసము చేయవలెను 'భం' అనునది ప్రాణతత్త్వబీజము, ఇది జీవోపాధియందున్నది.*


*అందుచే దీనిని దానియందే న్యాసము చేయవలెను. బుద్ధితత్త్వవాచకమగు 'బం' అను బీజమును, విద్వాంసుడు హృదయముపై వ్యాసము చేయవలెను. అహంకారరూపమగు 'ఫం' అను బీజమును కూడ హృదయమునందే న్యాసము చేయవలెను. సంకల్ప కరణ భూతమనస్తత్త్వ రూపమగు 'పం' అను బీజమును గూడ హృదయమునందే న్యాసము చేయవలెను.*


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Agni Maha Purana - 195 🌹*

*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *


*Chapter 59*

*🌻Preliminary consecration of an image (adhivāsana) - 2 🌻*


11. Then intellect came into being associated with the prāṇa and with eight-fold modifications. Egoism was born then and the mind came out from it.


12. Then the five (abstract) things were born possessing determination. They are known as sound, touch, sight, taste and smell.


13. The sense-organs possessing consciousness were brought about by these. The skin, ear, nose, eyes, tongue are the senseorgans.


14. The feet, anus, arms, speech (mouth) and the genitals are the five organs of action. Listen (I shall describe) the five elements.


15. The ether, wind, light, water and earth (are the five elements). The gross body is composed of these elements and becomes the support for all.


16. (I shall presently) describe the mystic syllables signifying these and for being (mentally) placed on (the different parts of) the body. The letter ma which is the symbol of the inner self should be located to co-extend with (the body of) the deity.


17. The letter bha which is the emblem of life should be lodged in the differentiating individuality of the god. The letter ba which represents the intellect should be located in the region of the heart.


18. The letter pha representing the sense of ego should also be located there itself. The letter pa representing the mind should be located in the mental resolve.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 60 / DAILY WISDOM - 60 🌹*

*🍀 📖. యోగా యొక్క తత్వశాస్త్రం నుండి 🍀*

*✍️. ప్రసాద్ భరద్వాజ*


*🌻 29. ద్వంద్వత్వం వల్ల భయం కలుగుతుంది 🌻*


*భౌతికంగా, రసాయనికంగా మరియు జీవశాస్త్రపరంగా మిమ్మల్ని తెలుసుకోవడం అంటే మిమ్మల్ని నిజంగా తెలుసుకోవడం కాదు. ఎందుకంటే భౌతికంగా, రసాయనికంగా మరియు జీవశాస్త్రపరంగా, ప్రతి వ్యక్తి ఒకలాగానే ఉంటారు. ప్రతి వ్యక్తిలో ఒకే పదార్ధం ఉంటుంది, ప్రతి వస్తువు-భూమి, నీరు, అగ్ని, గాలి మరియు ఆకాశం అనే పంచభూతాల సమాహారంతోనే ఏర్పడ్డాయి. కాబట్టి, ఒక శరీరాన్ని అధ్యయనం చేస్తే అన్నీ శరీరాల గురించి తెలుసుకున్నట్లే.*


*శరీర నిర్మాణంలో ప్రతిదీ సమానంగా ఉంటే, అనేక వ్యక్తులు మరియు అనేక వస్తువులు ఎందుకు ఉన్నాయి? శాస్త్రీయ పరిశీలన మన భౌతిక మరియు సామాజిక జీవితానికి తాత్కాలికంగా ఉపయోగపడుతుంది, కానీ అది నిజమైన జ్ఞానం కాదు; దాని ద్వారా ఏదీ తెలుసుకోలేము. నిజంగా మీకు బాహ్యంగానే ఉన్నట్లైతే ఒక్క పరమాణువును కూడా మీరు తెలుసుకోలేరు. బయట ఉన్న ఈ ప్రపంచం ఒక అద్భుత ప్రపంచం. దీనికి విపరీతమైన, భయంకరమైన ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే మీకు బాహ్యంగా ఉన్నదేదైనా మీకు భయం, ఆందోళన మరియు అభద్రత కలిగిస్తాయి. ద్వంద్వత్వం వల్లే భయం కలుగుతుందని ఉపనిషత్తులో ఒక గొప్ప సూక్తి ఉంది.*


*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 DAILY WISDOM - 60 🌹*

*🍀 📖 Philosophy of Yoga 🍀*

📝 Swami Krishnananda

📚. Prasad Bharadwaj


*🌻29. Fear is Caused by Duality 🌻*


*To know you physically, chemically and biologically is not to know you, because physically, chemically, and biologically, one would be the same as the other. The same substance is in each person, each thing—the earth, water, fire, air and ether are the components of the physical body of each and every individual in the world, so that to study one body would be equal to studying any other body.*


*Why are there many people and many things, if everything is equal in bodily structure? The scientific observation is tentatively useful for our physical and social life, but it is not real knowledge; by it nothing can be known, not even one atom, truly if it is ‘outside’. This world outside is a fantastic world. It has a tremendous, fearsome significance, for anything that is outside is a source of fear, anxiety and insecurity. There is a great saying in the Upanishad that fear is caused by duality.*


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 325 🌹*

*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*


*🍀. అస్తిత్వం ప్రతిక్షణం నీలో గొప్ప శక్తిని నింపుతుంది. నువ్వు ఎట్లా వేరు అని భావిస్తావు? నువ్వు పునర్జన్మించడానికి మరణిస్తావు. పునర్జన్మ వుంటుంది. పునరుత్థానం సంభవమే. 🍀*


*నువ్వు పునర్జన్మించడానికి మరణిస్తావు. శరీరం చనిపోతుంది. కానీ అది కేవలం అస్తిత్వం నుంచి శరీరాన్ని వేరు చెయ్యడమనే మాత్రమే అనే విషయాన్ని మరిచి పోతున్నారు. అస్తిత్వం ప్రతిక్షణం నీలో గొప్ప శక్తిని నింపుతుంది. నువ్వు ఎట్లా వేరు అని భావిస్తావు? నీ శ్వాస ఆగిపోతే నువ్వు చనిపోతావు. శ్వాసే కాదు అట్లాగే నువ్వు తాగే నీటిని, తిండిని ప్రతిరోజు వదిలేస్తున్నావు. అనుక్షణం జీవితం వస్తూ వుంటుంది. మృతవిషయాలు వెళ్ళిపోతూ వుంటాయి. అది మొదటి మరణానికి, మొదటి రోజుకు ప్రాధాన్యం వహిస్తుంది.*


*తరువాత మనసు, ఆలోచనలు అవి కూడా బయటినించీ వస్తాయి గాలి నీళ్ళలాగే, నీ మనసు ఆలోచనల్ని అన్ని వేపుల నించీ సేకరిస్తుంది. మనసు కూడా ప్రత్యేక రీతిలో మరణిస్తుంది. మూడో రోజు మరింత సున్నితమయిన విషయం జరుగుతుంది. అది ప్రతీకాత్మకాలు. అనుభూతి, ఉద్వేగం, హృదయం మరణిస్తుంది. అప్పుడు పునర్జన్మ వుంటుంది. పునరుత్థానం సంభవం. శరీరం, మనసు, హృదయం అదృశ్యమవుతాయి. అన్నీ అస్తిత్వంలో ఏకమవుతాయి. హఠాత్తుగా నువ్వు నీది కాని అనంత విశ్వాన్ని అనుభవానికి తెచ్చుకుంటావు.*


*సశేషం ...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శివ సూత్రములు - 062 / Siva Sutras - 062 🌹*

*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*

*1- శాంభవోపాయ*

*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*


*🌻. 20. భూత సంధాన భూత పృథక్త్వా విశ్వ సంఘటః - 1 🌻*

*🌴. సంకల్ప శక్తి ద్వారా యోగి తన అవగాహనను కేంద్రీకరించి పాంచభౌతికాంశాలను తన శరీరం నుండి మరియు ఇతరుల నుండి వేరు చేయగలడు. అతను స్థలం మరియు సమయం యొక్క పరిమితుల నుండి విముక్తి పొందగలడు. 🌴*


*భూత – జీవులు; సంధాన్ - చేరడం లేదా ఏకం చేయడం; భూత – జీవులు; పృథక్త్వా – వేరుచేయుట; విశ్వ – సార్వత్రిక; సంగతః - కలిసి చేరడం.*


*ఈ సూత్రం వాస్తవానికి మునుపటి సూత్రం యొక్క పొడిగింపు. యోగికి వచ్చే కొన్ని మానవాతీత శక్తుల గురించి శివుడు చర్చిస్తాడు. ఇంతకు ముందు సూత్రంలో, యోగి యొక్క ఆలోచనా ప్రక్రియ అత్యున్నత చైతన్యం తో శక్తిని పొందినప్పుడు, కావలసిన ప్రభావాలకు దారితీస్తుందని గమనించబడింది. ప్రస్తుత సూత్రం ప్రకారం, ఒక యోగి తన ఇష్టానుసారం ఏదైనా పాంచభౌతికాంశాన్ని తన స్వంత శరీరం లేదా వేరొకరి శరీరం నుండి ఏకం చేయవచ్చు లేదా వేరు చేయవచ్చు.*


*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Siva Sutras - 062 🌹*

*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*

Part 1 - Sāmbhavopāya

*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*


*🌻 20. Bhūta sandhāna bhūta pṛthaktva viśva saṃghaṭṭāḥ - 1 🌻*

*🌴. By will power the yogi can concentrate his awareness and separate the elements from his own body and that of others. He can become free from the limitations of space and time. 🌴*


*bhūta – living beings; sandhān – joining or uniting; bhūta – living beings; pṛthaktva – separating; viśva – universal; saṃghaṭṭāḥ - joining together.*


*This sūtra is virtually an extension of the previous sūtra. Śiva discusses certain superhuman powers that accrue to a yogi. In the last sūtra it was seen that the thought process of a yogi when energized with supreme consciousness, leads to desired effects. The present sūtra says that a yogi at his will can unite or separate any element from his own body or body of anyone else.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Join and Share

🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹

Comments


bottom of page