top of page
Writer's picturePrasad Bharadwaj

DAILY WISDOM - 144 : 23. The Aim of Life is the Attainment of Moksha / నిత్య ప్రజ్ఞా సందేశములు - 144



🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 144 / DAILY WISDOM - 144 🌹


🍀 📖 . జీవితం యొక్క తత్వము నుండి 🍀


✍️. ప్రసాద్ భరద్వాజ


🌻 23. జీవిత లక్ష్యం మోక్ష సాధన 🌻


స్వామి శివానంద తత్వశాస్త్రం యొక్క ప్రధాన లక్ష్యం అత్యున్నత జీవితాన్ని గడపడం, అన్ని విషయాలను సక్రమంగా నిర్వర్తించే జ్ఞానంతో నిండిన జీవితాన్ని గడపడం. శాంతి మరియు సంతోషాలతో కూడిన జ్ఞానోదయమైన జీవితం అతని ఉత్కృష్ట తత్వశాస్త్రం యొక్క లక్ష్యం. ఈ ఆశీర్వాదం పరమాత్మలో మాత్రమే లభిస్తుంది. ధర్మం, నైతిక సంపద; అర్థ, పదార్థ సంపద; మరియు కామ, జీవ సంపద, అన్నీ అస్తిత్వపు అత్యున్నత సంపద అయిన మోక్షంపై ఆధారపడి ఉంటాయి. జీవిత లక్ష్యం మోక్ష సాధన.


స్వామి శివానంద వ్యవస్థ అనేది అందరి జీవితాలలో ఉండే ఒక ఆవశ్యకత కారణంగా ఉత్పన్నమయిన తత్వశాస్త్రం. అది కేవలం ఊహాజనిత ఆసక్తి మరియు ఆచరణాత్మక ఆకాంక్ష లేని ఆలోచనాపరుల ఉత్సుకత నుంచి వచ్చినది కాదు. జీవితంలో ఉండే చెడు, నొప్పి, బాధ, మరణాలను చూసిన తర్వాత అసలు జీవితంలో ఇవి ఎందుకు సంభవిస్తాయి అనే విచారణ తలెత్తుతుంది. తద్వారా అసలు జీవితం పట్ల, సత్యం పట్ల విచారణగా మారుతుంది. ఇది సైద్ధాంతిక సాధనలలో విద్యాపరమైన ఆసక్తి కాదు, కానీ సత్యాన్ని చేరుకోవాలనే ఒక బలమైన కోరిక. ఇది తత్వం అనే ఒక అద్భుతమైన వ్యవస్థకి దారితీస్తుంది.




కొనసాగుతుంది...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 DAILY WISDOM - 144 🌹


🍀 📖 The Philosophy of Life 🍀


📝 Swami Krishnananda

📚. Prasad Bharadwaj


🌻 23. The Aim of Life is the Attainment of Moksha 🌻


The central aim of the philosophy of Swami Sivananda is the living of the highest life, a life fixed in the knowledge of the principles which are the ultimate regulators of all things. An enlightened life of peace and joy is the goal of his sublime philosophy. And this blessedness can be attained only in the Divine Being. Dharma, the ethical value; artha, the material value; and kama, the vital value, are all based on moksha which is the supreme value of existence. The aim of life is the attainment of moksha.


Swami Sivananda’s system is a specimen of a type of philosophy that arises on account of a necessity felt by all in life, and not because of any curiosity characteristic of thinkers who have only a speculative interest and no practical aspiration. The sight of evil and suffering, pain and death, directs one’s vision to the causes of these phenomena; and this, in its turn, necessitates an enquiry into the reality behind life as a whole. It is not an academic interest in theoretical pursuits, but a practical irresistible urge to contact Reality, that leads to the glorious enterprise of true philosophy.




Continues...


🌹 🌹 🌹 🌹 🌹





コメント


bottom of page