top of page
Writer's picturePrasad Bharadwaj

నిర్మల ధ్యానాలు - ఓషో - 299


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 299 🌹


✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ


🍀. ప్రతి బిడ్డకూ ఆనందంగా ఎట్లా వుండాలో తెలుసు. దాన్ని మళ్ళీ నేర్చుకోవాలి. నిన్ను నువ్వు అస్తిత్వ ప్రేమికుడిగా మలచుకో. అప్పుడు అత్యున్నత శిఖరం దర్శనమిస్తుంది. 🍀


ప్రతి పసిబిడ్డకు ఎట్లా ప్రతిస్పందించాలో తెలుసు. అందుకనే పిల్లలందరూ అందంగా వుంటారు. ఆనందంగా వుంటారు. వాళ్ళ కళ్ళలోకి చూడు. ఎంత నిశ్శబ్దం! వాళ్ళ ఆనందాన్ని చూడు. ఎంతగా పొంగిపొర్లుతూ వుంటుంది ! ప్రతి బిడ్డకూ ఆనందంగా ఎట్లా వుండాలో తెలుసు. కానీ త్వరలోనే పసిబిడ్డ ఆనందాన్ని మరచిపోతుంది. లేదా మరచిపోయేలా మనం చేస్తాం. దాన్ని మళ్ళీ నేర్చుకోవాలి. ఆ కళని తిరిగి గ్రహించాలి.


ప్రతిస్పందించే తనాన్ని తెలుసుకోవాలి. అప్పుడు అంతా ఎప్పట్లాగే వుంటుంది. నిన్ను నువ్వు అస్తిత్వ ప్రేమికుడిగా మలచుకో. అప్పుడు అత్యున్నత శిఖరం దర్శనమిస్తుంది. దానికి పవిత్ర గ్రంథాల పరామర్శ అక్కర్లేదు. ఎందుకంటే ఈ అనంత విశ్వమే అపూర్వ పవిత్ర గ్రంథం. ప్రతిచోటా అస్తిత్వ సంతకముంది. మతాలన్నీ మానవ నిర్మితాలే.



సశేషం ...


🌹 🌹 🌹 🌹 🌹


0 views0 comments

Comments


bottom of page