🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 300 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. హృదయపూర్వకమైన నవ్వు అసాధారణమైంది. అదే నిన్ను పవిత్రీకరిస్తుంది. ప్రార్థన కన్నా నువ్వు ద్వారా నువ్వు అస్తిత్వానికి సన్నిహితం కావడం చూసి ఆశ్చర్యపోతావు. 🍀
ఉత్సాహంగా వుండు. మత భావనతో వుండడానికి నా నిర్వచనమది. విషాదంగా వుండడమంటే తప్పు చేసిన వాడుగా వుండడం. ఉత్సాహంగా వుండడమంటే సన్యాసిగా వుండడమే. నువ్వు హృదయపూర్వకంగా నవ్వితే నీ జీవితం పవిత్రం కావడం మొదలవుతుంది.
హృదయపూర్వకమైన నవ్వు అసాధారణమైంది. అదే నిన్ను పవిత్రీకరిస్తుంది. తల నించీ పాదం దాకా నవ్వు ప్రసరిస్తుంది. అది మరింత గాఢంగా నీ లోలోతుల్లో నీ అస్తిత్వ కేంద్రాన్ని తాకనీ. అప్పుడు నువ్వు ఆశ్చర్యపడతావు. ప్రార్థన కన్నా నువ్వు ద్వారా నువ్వు అస్తిత్వానికి సన్నిహితం కావడం చూసి ఆశ్చర్యపోతావు.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Comments