top of page
Writer's picturePrasad Bharadwaj

నిర్మల ధ్యానాలు - ఓషో - 301


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 301 🌹


✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ


🍀. ప్రేమతో ప్రయోగాలు చేస్తే నువ్వు ప్రతిరోజు సంపన్నుడవుతావు. నీకు ప్రేమలో అనేక మార్గాలు తెలుస్తాయి. ఒక దశ వస్తుంది. అప్పుడు నువ్వు నిశ్శబ్దంగా కూచుంటావు. నీ నించీ ప్రేమ పొంగిపొర్లుతూ వుంటుంది. అది జ్ఞానోదయానికి ఆరంభం. 🍀


ఈ రోజు నేను తొంభయి అయిదేళ్ళ వృద్ధుడి గురించి చదివాను. అతన్ని ఎవరో యింత ఆరోగ్యంగా, యింతకాలం బతకడం వెనక రహస్యమేమిటని అడిగాడు. నేను నిజం చెప్పడానికి కొంత వెనకాడుతున్నా. నేను చెట్ల నించీ జీవితాన్ని తెచ్చుకున్నాను. నేను వాటిని కౌగిలించుకుంటే వాటిల్లో నించీ శక్తి నాలోకి ప్రవహిస్తుంది. అవి నన్ను సజీవ చైతన్యంతో వుంచుతాయి' అన్నాడు. నా పరిశీలన బట్టి కూడా అతను చెప్పింది కరక్టే. యిప్పుడు కాకున్నా భవిష్యత్తులోనైనా అది శాస్త్రీయంగా నిరూపించబడుతుంది.


నువ్వు చెట్టును ప్రేమిస్తే అది ప్రతిస్పందిస్తుంది. నువ్వు రాయిని ప్రేమించినా అది కూడా స్పందిస్తుంది. ప్రేమతో ప్రయోగాలు చేస్తే నువ్వు ప్రతిరోజు సంపన్నుడవుతావు. నీకు ప్రేమలో అనేక మార్గాలు తెలుస్తాయి. ఒక దశ వస్తుంది. అప్పుడు నువ్వు నిశ్శబ్దంగా కూచుంటావు. నీ నించీ ప్రేమ పొంగిపొర్లుతూ వుంటుంది. అది జ్ఞానోదయానికి ఆరంభం. అక్కడ సమస్తమూ సంపూర్ణంగా వుంటుంది. ఏదో కోల్పోయిన భావన వుండదు. అది వ్యక్తి జీవితంలో గొప్ప రోజు. నువ్వు ప్రతి క్షణాన్నీ పరిపూర్ణంగా అనుభవిస్తావు.

సశేషం ... 🌹 🌹 🌹 🌹 🌹

1 view0 comments

Commentaires


bottom of page