top of page
Writer's picturePrasad Bharadwaj

నిర్మల ధ్యానాలు - ఓషో - 302


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 302 🌹


✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ


🍀. నువ్వు సూర్యాస్తమయాన్ని చూసినపుడు నువ్వు ఆనందిస్తావు. అది అందమైన సూర్యాస్తమయం నించీ వచ్చిందని భావిస్తావు. అది నిజం కాదు. అది నీలోని ధ్యాన స్థితిని స్పర్శించింది. దాన్ని 'ఏక కాలచర్య' అన్నారు. 🍀


నువ్వు సూర్యాస్తమయాన్ని చూసినపుడు నువ్వు ఆనందిస్తావు. అది అందమైన సూర్యాస్తమయం నించీ వచ్చిందని భావిస్తావు. అది నిజం కాదు. అది నీలోని ధ్యాన స్థితిని స్పర్శించింది. అదెంత సౌందర్య భరితంగా వుందంటే నీ ఆలోచన ఆగిపోయింది. ఆశ్చర్య స్థితికి చేరుకున్నావు. దాన్ని 'ఏక కాలచర్య' అన్నారు. అది అందరికీ జరుగుతుదని కాదు. లక్షల మంది సూర్యాస్తమయాన్ని చూసి నిశ్చలనంగా వున్నారు. కొంత మంది ముఖాలు వేళ్ళాడేసుకుంటారు.


అది వాళ్ళ మానసిక స్థితి మీద ఆధారపడి వుంటుంది. వాళ్ళ మూడ్ మీద ఆధారపడి వుంటుంది. ఆనందమన్నది అక్కడ అనివార్య ఫలితమనిపించదు. ఒకసారి నువ్విది అర్థం చేసుకుంటే ప్రతి ఆనంద క్షణం నువ్వు తక్షణం ధ్యానస్థితికి వెళ్ళవచ్చు. ఆదిలో ధ్యానాన్ని అట్లాగే కనిపెట్టారు. అది ఎప్పుడు ఒకే స్థితి. ఆలోచన వుండదు. మనసు ఆగిపోతుంది. హఠాత్తుగా అక్కడ ఆనందం మొలకెత్తుతుంది.



సశేషం ...


🌹 🌹 🌹 🌹 🌹

0 views0 comments

Comments


bottom of page