🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 306 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. నీకు నీ గురువులో, తల్లిదండ్రులో చెప్పందే నీకు దేవుడి గురించి తెలీదు. దేవుడి గురించి ఆలోచనే రాదు. అందువల్ల నేను ఆనందమే దేవుడు, మరో దేవుడు లేడంటాను. తక్కిన యితర దేవతలందరూ సృష్టింప బడిన వాళ్ళే. 🍀
జనాలు దేవుడి గురించి ఆలోచిస్తూ, దేవుడి గురించి వాదిస్తూ వాళ్ళ జీవితాల్ని వ్యర్థం చేసుకుంటారు. ఎప్పుడూ వాళ్ళ హృదయ స్పందనల్ని వినరు. హృదయానికి దేవుడి గురించిన కోరిక లేదు. హృదయం కేవలం నాట్యం చేయాలంటుంది. పాట పాడాలంటుంది. ఆనందిచడాన్ని, జీవించడాన్ని, ప్రేమించడాన్ని, ప్రేమింపబడడాన్ని కోరుకుంటుంది. పరిమళభరితమయిన పువ్వులా జీవించడాన్ని కోరుకుంటుంది.
ఆకాశంలో పక్షిలా విహారించాలను కుంటుంది. జీవితాంధకారంలో కాగడాలా వెలగాలను కుంటుంది. దేవుడి గురించి ఆరాటపడదు. నీకు నీ గురువులో, తల్లిదండ్రులో చెప్పందే నీకు దేవుడి గురించి తెలీదు. దేవుడి గురించి ఆలోచనే రాదు. అందువల్ల నేను ఆనందమే దేవుడు, మరో దేవుడు లేడంటాను. తక్కిన యితర దేవతలందరూ సృష్టింప బడిన వాళ్ళే. వాళ్ళందరినీ వదిలేసి మనం సరయిన దిక్కులో వెళ్ళడం మేలు.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Comments