top of page
Writer's picturePrasad Bharadwaj

నిర్మల ధ్యానాలు - ఓషో - 308


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 308 🌹


✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ


🍀. జీవితం అర్థరహితం కాదు. అసాధారణమయిన విలువ కలిగింది. కానీ దాన్ని మనం కనిపెట్టాలి. ధ్యానం కిటికీలు తెరిచి దేవుణ్ణి చూపిస్తుంది. కాంతి నిస్తుంది. 🍀


ప్రేమ దేవుడికి సంబంధించిన అంతిమ అనుభవం. అస్తిత్వం అర్థరహితం కాదని ప్రేమ నిరూపిస్తుంది. జీవితం అర్థవంత మయిందని చూపిస్తుంది. ప్రేమను అనుభవానికి తెచ్చుకోని వ్యక్తి జీవితం అర్థరహిత మనుకుంటాడు. యాదృచ్ఛిక మనుకుంటాడు. అజ్ఞాత, అచేతనమయిన సహజశక్తుల దయాదాక్షిణ్యాలు అనుకుంటాడు. భౌతికవాదులు జీవితాన్ని చూసే విధానమది. కేవలం పదార్థాల సమ్మేళనం అనుకుంటారు.


అప్పుడు జీవితం అర్థరహితం. అర్థరహితమైన, ప్రాముఖ్యత లేని జీవితం పాట పాడలేదు. నాట్యమాడలేదు. అర్థవంతం కాని జీవితాన్ని పిరికివాళ్ళు మాత్రమే బతుకుతారు. జీవితం అర్థరహితం కాదు. అసాధారణమయిన విలువ కలిగింది. కానీ దాన్ని మనం కనిపెట్టాలి. ప్రేమ నీకు మార్గాల్ని చూపిస్తుంది. కాంతి నిస్తుంది. ధ్యానపు ఛాయల్ని ప్రదర్శిస్తుంది. ధ్యానం కిటికీలు తెరిచి దేవుణ్ణి చూపిస్తుంది.



సశేషం ...


🌹 🌹 🌹 🌹 🌹

0 views0 comments

Comments


bottom of page