🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 310 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. విలువైన దాన్ని అందుకోవడమన్నది ఉన్నత లక్ష్యం. కొంతమందే నిలుపుకుంటారు. కొంత మంది ఖాళీ చేతుల్తో వస్తారు. ఖాళీ చేతుల్తో వెళతారు. అందుకు సిగ్గుపడాలి. 🍀
చాలా వీలవుతుంది. ఐతే దాన్ని సాధ్యం చేయాలి. దానికి చైతన్యంతో పని చేయాలి. అదెలాంటిదంటే నీ దగ్గర కావలసినంత భూమి వుంది. కావలసినంత నీరు, కావలసినన్ని గింజలు వున్నాయి. కానీ నువ్వు పొలంలో విత్తనాలు వెయ్యలేదు. పూలు పూయవు, భూమి ఎడారిగానే వుంటుంది. గడ్డి పెరుగుతుంది. చెట్లు పెరుగుతాయి. పనికిమాలినవి అడ్డదిడ్డంగా పెరుగుతాయి. విలువైన దాన్ని అందుకోవడమన్నది ఉన్నత లక్ష్యం.
నువ్వేమీ చెయ్యకపోతే అడ్డదిడ్డంగా చెట్లు పెరుగుతాయి. అక్కడ గులాబీ పూలకోసం వెతికి లాభం లేదు. అందరూ గొప్ప హామీలతో వస్తారు. కొంతమందే నిలుపుకుంటారు. కొంత మంది ఖాళీ చేతుల్తో వస్తారు. ఖాళీ చేతుల్తో వెళతారు. అందుకు సిగ్గుపడాలి. కానీ నా సన్యాసులు పూర్తిగా సంతృప్తిగా వుంటారు. వాళ్ళు హామీలు నెరవేరుస్తారు. నిలుపుకుంటారు.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Comments