🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 311 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. అస్తిత్వమంటే అన్నీ కలిసి వుండడమే. మనందరం మన వంతుగా అస్తిత్వానికి చెయ్యవలసింది చేస్తాం. మన కవసరమయినవి అస్తిత్వం మనకందిస్తుంది. 🍀
నువ్వు అనంతం లేనిదే ఉనికిలో వుండవు. నువ్వు లేకుంటే అనంతం కూడా వుండదు. అస్తిత్వానికి నీ అవసరముందని నువ్వు వుండడాన్ని బట్టే చెప్పవచ్చు. అట్లాగే అస్తిత్వములో నువ్వొక అవసరాన్ని నెరవేర్చడానికి వున్నావు. అందుకనే వచ్చావు. ఒక చిన్ని గడ్డిపోచ కూడా నక్షత్రంతో సమానమయిందే. రెంటి అవసరమూ వుంది.
అది అస్తిత్వ స్థితి. అక్కడ ఏదీ ఉన్నతమైంది కాదు, ఏదీ అల్పమైంది కాదు. ఎవరూ గొప్ప కాదు, ఎవరూ తక్కువ కాదు. అందరికీ సమప్రాధాన్యముంది. అస్తిత్వమంటే అన్నీ కలిసి వుండడమే. మనందరం మన వంతుగా అస్తిత్వానికి చెయ్యవలసింది చేస్తాం. మన కవసరమయినవి అస్తిత్వం మనకందిస్తుంది. ఒకసారి అహాన్ని వదిలిపెడితే ఏదీ దారి తప్పదు. ఎప్పటికీ పొరపాటు జరగదు. ప్రతిదీ దాని స్థానంలో సరిగానే వుంటుంది. అదే దేవుడికి అర్థం.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Comments