🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 312 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. మనకున్న వాటి గురించి మనమాలోచించం. లేని వాటి గురించి ఆలోచిస్తాం. ప్రేమికుడిగా వుండటానికి సాహసం కావాలి. కారణం ప్రేమ అహాన్ని వదులుకోమంటుంది. అప్పుడు అద్భుతం ఆరంభమవుతుంది. అప్పుడు ప్రేమ నిన్ను ముంచెత్తుతుంది. 🍀
ప్రపంచంలో ప్రేమ గురించి రాసినంత దేన్ని గురించీ రాయలేదు. దేవుడి కన్నా ఎక్కువ రాశారు. ఎన్నో పాటలు, ఎన్నో కల్పనలు, నవలలు, కథలు ప్రేమ పేరుతో వున్నాయి. ఎందుకని మనుషులు ప్రేమ పట్ల అట్లా అల్లాడతారు? సినిమాలు, టీవీ, పత్రికలు, సాహిత్యం అన్నిట్లో ప్రేమే. దాన్ని బట్టి చూస్తే మనిషికి ప్రేమ పట్ల చాలా ఆసక్తి. కానీ దాని బదులుగా వీటన్నిట్ని ఆశ్రయిస్తాడు. సినిమాకు వెళతాడు. అక్కడ ఎవరి ప్రేమనో చూస్తాడు. అన్ని చోట్లా ప్రేక్షక పాత్ర వహిస్తాడు. పాత్రల్ని సృష్టించి సంతోషిస్తాడు. కవిత్వం సృష్టించి తృప్తి పడతాడు. అది తన అనుభవమే అంటాడు.
ఇవన్నీ నిజమైన ప్రేమకు పేలవమైన ప్రత్యామ్నాయాలు. మనిషి నిజంగా ప్రేమలో అడుగుపెడితే ఈ చెత్తాచెదారం మాయమవుతుంది. గుర్తుంచుకోండి. ఆకలివున్న వాళ్ళే ఆహారం గురించి ఆలోచిస్తారు. నగ్నంగా వున్నవాళ్ళు బట్టల గురించి, ఇల్లు లేని వాళ్ళు ఇళ్ళ గురించి ఆలోచిస్తాడు. మనకున్న వాటి గురించి మనమాలోచించం. లేని వాటి గురించి ఆలోచిస్తాం. ప్రేమికుడిగా వుండటానికి సాహసం కావాలి. కారణం ప్రేమ అహాన్ని వదులుకోమంటుంది. అప్పుడు అద్భుతం ఆరంభమవుతుంది. అప్పుడు ప్రేమ నిన్ను ముంచెత్తుతుంది. చివరగా ప్రేమ అస్తిత్వానికి సంబంధించినవి, సత్యానికి సంబంధించిన నీ అనుభవంగా మారుతుంది.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Comments