🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 315 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. తర్కం మనసు చేసే వ్యాయామం. సిద్ధాంతకారులు పరిణిత మనస్కులు కారు. మహాత్ములు సిద్ధాంతకారులు కారు. నిజమైన గురువులు. గొప్ప ప్రేమికులు. ప్రేమ అన్నది ప్రార్థన. అస్తిత్వంతో చేసే సంభాషణ. 🍀
మతం సిద్ధాంతం కాదు. సిద్ధాంతం కేవలం తార్కికం. తార్కికంతో మతానికి సంబంధం లేదు. తర్కం మనసు చేసే వ్యాయామం. వెంట్రుకను చీల్చటం. మాటల్తో కోటలు కడుతుంది. ఇసుక మేడలు కడుతుంది. వాటి వల్ల ఉపయోగం లేదు. అది పసితనం. మత సిద్ధాంతకారులు పరిణిత మనస్కులు కారు. మహాత్ములు మత సిద్ధాంతకారులు కారు. నిజమైన గురువులు. సిద్ధాంతకారులు కారు. గొప్ప ప్రేమికులు. వారు సమస్త అస్తిత్వాన్ని ప్రేమిస్తారు.
ప్రేమ అన్నది ప్రార్థన. అస్తిత్వంతో చేసే సంభాషణ. విసుగు చెందే జనాలు తార్కిక ప్రపంచంలో జీవించే వాళ్ళు. తర్కం విసుగు పుట్టిస్తుంది. ప్రేమ విసుగు పుట్టించదు. ప్రేమ నిరంతరం నిన్ను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. నీ కవిత్వాన్ని, నాట్యాన్ని, నీ ఉత్సవాన్ని సజీవంగా నిలుపుతుంది. లేని పక్షంలో అందమయి నదంతా అంధకార బంధురమవుతుంది తర్కాన్ని వదిలించుకో. ప్రేమను దగ్గరికి తీసుకో.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Comments