నిర్మల ధ్యానాలు - ఓషో - 316
- Prasad Bharadwaj
- Mar 13, 2023
- 1 min read

🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 316 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. చైతన్యంగా వుండండి. స్పృహతో వుండండి. చైతన్యంతో జీవించండి. చైతన్యాన్ని మీ కరదీపికగా పెట్టుకోండి. బాహ్యం నించీ ఎలాంటి క్రమశిక్షణనూ విధించకండి. 🍀
నేను ఎట్లాంటి మతాన్నీ బోధించను. నేను నా వాళ్ళు మరింతగా బాహ్య, అంతర చైతన్యంతో వుండడానికి సహకరిస్తాను. నా బోధనల సారాంశమదే. చైతన్యంగా వుండండి. స్పృహతో వుండండి. చైతన్యంతో జీవించండి. చైతన్యాన్ని మీ కరదీపికగా పెట్టుకోండి. బాహ్యం నించీ ఎలాంటి క్రమశిక్షణనూ విధించకండి. అది లోపలి నించీ వసంతంలా విచ్చుకోనీ. అప్పుడు అంతా తాజాగా వుంటుంది. యవ్వనంతో వుంటుంది. అనురాగంతో వుంటుంది. ఆనందంతో జ్వలిస్తుంది. అదే ఆశీర్వాదం.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Comments