
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 317 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. దైవత్వమన్నది ప్రేమలో ఒక భాగం. దేవుడు అన్న అభిప్రాయాన్ని పక్కన పెట్టినా ఫరవాలేదు. వ్యక్తి ప్రేమిస్తే అది చాలు. ప్రేమ దాంతో బాటు దైవత్వాన్నీ తీసుకు వస్తుంది. 🍀
ప్రేమే దేవుడు. దేవుడు రెండో స్థానంలో వుంటాడు. ప్రేమ ముందుంటుంది. దైవత్వమన్నది ప్రేమలో ఒక భాగం. దేవుడు అన్న అభిప్రాయాన్ని పక్కన పెట్టినా ఫరవాలేదు. వ్యక్తి ప్రేమిస్తే అది చాలు. ప్రేమ దాంతో బాటు దైవత్వాన్నీ తీసుకు వస్తుంది. మనం ఇప్పుడు ముందువారి కన్నా ఒకడుగు ముందుకు వెళ్ళాలి. ముందడుగు వేయడంలో మనం పాతవారిని గౌరవిస్తాం. వారు చేసిన పనే మనం చేస్తున్నాం. నీ హృదయాన్ని అనుసరించి జీవించు. నీ ప్రేమను బట్టి జీవించు. ప్రేమే నీకు కాంతి చూపనీ. నువ్వు ఎప్పుడూ తప్పు చేయవు.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Comments