🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 319 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. ఆనందం ఆంతర్యంలోనిది. వ్యక్తిగతం. దాన్ని నీలోనే చూడవచ్చు. దానికి ఎవరి సాయం అక్కర్లేదు. ఒకసారి దాన్ని దర్శిస్తే నువ్వు విజేతవు. జీవితం ధగధగ లాడుతుంది. 🍀
ఆనందాన్ని దర్శించని వ్యక్తి ఓటమిలో జీవిస్తాడు. అతని జీవితమంతా చిరాకు, వైఫల్యం. జనాల ముఖాల్ని చూడండి. పెద్దగా అనిపిస్తూ, ముఖాల్ని వేలాడేసుకుని వుంటారు. ముసలితనం ముంచుకొచ్చినట్లుంటారు. దిగులుగా వుంటారు. కోపంగా వుంటారు. కారణం వాళ్ళ కలలు చెడిపోయివుంటాయి. ఆ వైఫల్యం జీవితంలో వుండదు. బాధ్యత వాళ్ళదే. అర్థరహితమయిన వాటిని అందుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. అవి ధనం, గౌరవం, అధికారం. అవి అందుకోలేకపోతే ఆందోళనకు లోనవుతారు. అందుకుంటే మరింత ఆందోళనకు గురవుతారు. నిజానికి అందుకోవడం కన్నా అందుకోలేకపోవడం మేలు కనీసం అక్కడ ఆశ ఐనా వుంది. అందుకున్న వాడికి ఆశ వుండదు.
అందుకున్న వాటి మీదే అతడు సకల శక్తుల్నీ కేంద్రీకరిస్తాడు. వాటి నించీ బయటపడడు. ఆనందం ఆంతర్యంలోనిది. వ్యక్తిగతం. దాన్ని నీలోనే చూడవచ్చు. దానికి ఎవరి సాయం అక్కర్లేదు. ఒకసారి దాన్ని దర్శిస్తే నువ్వు విజేతవు. జీవితం ధగధగ లాడుతుంది. నీ అస్తిత్వ ఆకాశం నక్షత్రాల్లో నిండుతుంది. నీరసం లేని జీవితం జీవించినవాడు మరణంలోనూ నిండుగా వుంటుంది. మరణం ఒక విశ్రాంతి మాత్రమే. అది విశ్రాంతి సమయం. అనంతంలో ఐక్యమయ్యే సందర్భం.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
コメント