🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 323 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. ప్రయత్నం కేవలం నీకు చైతన్యాన్ని కలిగిస్తుంది. అది నీకు ఆనందాన్ని యివ్వలేదు. ఐతే నువ్వు ఎప్పుడయితే ఆనందంగా వుంటావో ఆ ఆనందం పై నించి వచ్చిందని తెలుసుకో. 🍀
నువ్వు నీ సాధారణ, యాంత్రిక జీవితం జీవిస్తూ వుంటావు. నిన్ను చైతన్యవంతుణ్ణి చేయడానికి ప్రయత్నం అవసరం. ఐతే ప్రయత్నం కేవలం నీకు చైతన్యాన్ని కలిగిస్తుంది. అది నీకు ఆనందాన్ని యివ్వలేదు. ఐతే నువ్వు ఎప్పుడయితే ఆనందంగా వుంటావో ఆ ఆనందం పై నించి వచ్చిందని తెలుసుకో. ఆనందాన్ని అందుకున్న వాళ్ళు “మా ప్రయాత్నాలు మా హృదయాన్ని శుభ్రపరిచాయి. తలుపు తెరిచాయి. అడ్డంకుల్ని తొలిగించాయి.
అప్పుడు ఒకరోజు హఠాత్తుగా పై నించీ, అజ్ఞాత తీరాల నించీ ఆనందం మాలోకి ప్రవహించింది” అంటారు. నువ్వు వెనక్కి తిరిగి చూస్తే నీ ప్రయత్నాలు ఎంత అల్పమైనవో తెలుస్తుంది. ఈ అపూర్వ ఆనందం నీ అల్పమయిన ప్రయత్నం నించీ వచ్చింది కాదనీ తెలుస్తుంది.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Comments