🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 328 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. వ్యక్తి రెండు విషయాల గుండా సాగాలి. మొదటిది మరణం. పాతదానికి మరణం, గతానికి మరణం. యిప్పటి దాకా జీవించిన దానికి మరణం. రెండోది పునర్జన్మ. తాజాగా మొదలు పెట్టు. ఈ రోజే పుట్టినట్లు ఆరంభించు. 🍀
భౌతికమయిన జన్మ వుంది. ప్రతి ఒక్కరూ దాని గుండా సాగుతారు. ఐతే అది నీకు సంక్లిష్టమయిన శారీరక మానసిక స్థితినిస్తుంది. అది నీకు ఆధ్యాత్మికంగా జన్మించడానికి అవకాశమిస్తుంది. పునర్జన్మ కలిగితే తప్ప నిజంగా జీవించినట్లు కాదు. ఒకటి కేవలం అవకాశం. బీజప్రాయం. వసంతం రానిదే బీజం మొక్కయి, పుష్పించదు. నా పూర్తి ప్రయత్నం మీకు సాధారణ మతాన్ని బోధించడం కాదు. కొత్త అస్తిత్వాన్ని, కొత్త మానవత్వాన్ని, కొత్త చైతన్యాన్ని యివ్వడం.
వ్యక్తి రెండు విషయాల గుండా సాగాలి. మొదటిది మరణం. పాతదానికి మరణం, గతానికి మరణం. యిప్పటి దాకా జీవించిన దానికి మరణం. రెండోది పునర్జన్మ. తాజాగా మొదలు పెట్టు. ఈ రోజే పుట్టినట్లు ఆరంభించు. అది కేవలం రూపకం కాదు. నిజంగా ఆరంభించు. ఆ భావన నీ అంతరాంతరాలలో పాదుకోనీ. అప్పుడు రాత్రి అంతమై దిగంతాలలో సూర్యుడు ఉదయిస్తాడు.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Comments