
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 332 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. సత్యాన్ని తప్పించుకోవడమంటే దుఃఖాన్ని ఆహ్వానించడమే. బాధ నీకు ఒక రకమయిన సుఖాన్నిస్తుంది. కాని అది తెలివితక్కువతనం. అబద్ధాలు వదిలి సత్యాన్ని అందుకున్నపుడే ఆనందకరమైన జీవితం సంభవం. 🍀
సత్యమంటే అనుభవం. సత్యం నమ్మకం కాదు. నమ్మకాలు ఎప్పుడూ అబద్ధాలే. అవి నీ జీవితాన్ని కొంత అనుకూలంగా మారుస్తాయి. అంతే అవి నెమ్మది పరుస్తాయి. సత్యం మెల్కొల్పుతుంది. మనిషికి నిద్రలోకి జారడం కాదు మేలుకోవడం కావాలి. మనిషి తరతరాలుగా మద్యానికి, యితర మత్తులకు బానిస. అనేకరకాలయిన మానసిక అభ్ఫిఆయాలకు బానిస. అవన్నీ సత్యాన్ని తప్పించుకోడానికే.
సత్యాన్ని తప్పించుకోవడమంటే దుఃఖాన్ని ఆహ్వానించడమే. బాధ నీకు ఒక రకమయిన సుఖాన్నిస్తుంది. కాని అది తెలివితక్కువతనం. అబద్ధాలు వదిలి సత్యాన్ని అందుకున్నపుడే ఆనందకరమైన జీవితం సంభవం. దురభిప్రాయాల్ని వదలినపుడే సత్యం ఆవిష్కారమవుతుంది. సత్యం ఆనందాన్ని తెస్తుంది. నా సమస్త ప్రయత్నం మిమ్మల్ని అన్వేషణలోకి పంపడం. సాధికారికమయిన పరిశీలన మనిషిని సత్యం దగ్గరకు తీసుకెళుతుంది. అపుడు ఆశీర్వాదము నీదే. ఆనందమూ నీదే.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
コメント