నిర్మల ధ్యానాలు - ఓషో - 333
- Prasad Bharadwaj
- Apr 16, 2023
- 1 min read

🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 333 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. అనంతం గాయాల్ని మాన్పడానికి ఎప్పుడ సిద్ధంగా వుంటుంది. కానీ మనల్ని మనం ప్రదర్శించాలి. అస్తిత్వం ముందు, అనంతం ముందు ఆంతర్యం విప్పాలి. దాచుకోకూడదు. వెంటనే గాయాలు మానడం మొదలవుతుంది. 🍀
మనిషి అహముంటే గాయం లాంటివాడు. అతను రోగి. ఎప్పుడూ గాయపడుతూ వుంటాడవు. బాధ వుంటుంది. కోపముంటుంది. దుఃఖముంటుంది. చీకటి వుంటుంది. పనికిమాలిన వాడవుతాడు. మనం ఆ గాయాన్ని అనుమతించకూడదు. కానీ మనం గాయాన్ని దాచిపెడతాం. దానిపై ఎండపడాలి, గాలి పడాలి. భ్రాంతులు పేరుకుని కోతి పుండు బ్రహ్మండమవుతుంది. చివరికి బ్లాక్కెల్ అవుతుంది. జనం అలా అవుతారు. అంతటికీ కారణమవుతారు.
ఈ నరకం వాళ్ళ స్వీయసృష్టి. అనంతం ఆ గాయాల్ని మాన్పడానికి ఎప్పుడ సిద్ధంగా వుంటుంది. కానీ మనల్ని మనం ప్రదర్శించాలి. అస్తిత్వం ముందు నగ్నంగా నిలబడాలి. వెంటనే గాయాలు మానడం మొదలవుతుంది. అనంతం ముందు ఆంతర్యం విప్పాలి. దాచుకోకూడదు. అది ఎంత అసహ్యమైనా ప్రదర్శించాలి. డాక్టర్ దగ్గర దాపరికం పనికి రాదు కదా! అప్పుడే గాయం మానడం ప్రారంభమవుతుంది.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Comments