నిర్మల ధ్యానాలు - ఓషో - 334
- Prasad Bharadwaj
- Apr 18, 2023
- 1 min read

🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 334 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. వ్యక్తిత్వాన్ని సృష్టించు కోవడమే పొరపాటు. అది ద్వంద్వ ప్రవృత్తి. ఒక వ్యక్తి యిద్దరవుతాడు. నీ అసలు తత్వాన్ని, సహజతత్వాన్ని అణగదొక్కి యితరులు చేసిన కొన్ని పద్ధతులకు, నియమాలకు లొంగడం. 🍀
వ్యక్తిత్వాన్ని సృష్టించుకోవడమే పొరపాటు. అది ద్వంద్వ ప్రవృత్తి. ఒక వ్యక్తి యిద్దరవుతాడు. అక్కడ అణచివేత వుంది. అక్కడ నీ అసలు తత్వాన్ని, సహజతత్వాన్ని అణగదొక్కి యితరులు చేసిన కొన్ని పద్ధతులకు, నియమాలకు లొంగడం. వాళ్ళు ఈప్పొప్పుల్ని, మంచీ చెడ్డల్ని నిర్ణయిస్తారు. వాళ్ళు నీ కోసం టెన్ కమాండ్ మెంట్స్ ని యిస్తారు. నువ్వు వాటిని అనుసరించాలి.
అప్పుడు నువ్వు నీ సహజతత్వంతో ఏం చేస్తావు? నీ సహజతత్వాన్ని అణచేస్తావు. దాన్ని నిర్లక్ష్యం చేస్తావు. సహజతత్వాన్ని ఈ మార్గంలో మార్చలేవు. అది లోపలి నించీ నిన్ను గిల్లుతూ వుంటుంది. నువ్వు తయారు చేసుకున్న వ్యక్తిత్వానికి వ్యతిరేకంగా నిలబడుతుంది. యిదంతా హిపోక్రసీ.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Comments