top of page

నిర్మల ధ్యానాలు - ఓషో - 337


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 337 🌹


✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ


🍀. జీవితం ప్రతిక్షణం కొత్తదే. అది పాతది కారు. అస్తిత్వమన్నది యిప్పుడు యిక్కడ వున్నదేదయితే వుందో అది. దాని గతంలో, భవిష్యత్తుతో సంబంధం లేదు. ఈ క్షణానికి నువ్వు అక్కడ వుంటావు. అక్కడ కలయిక వుంటుంది. అదే సత్యం. 🍀


జనం అనుకూలాల్లో జీవిస్తారు. వాళ్ళకు సత్యమక్కర్లేదు. వాళ్ళకు ఓదార్పు కావాలి. అందువల్ల వాళ్ళు మూఢ నమ్మకాలకు, సంప్రదాయాలకు, నిర్ణయాలకు కట్టుబడి వుంటారు. ఎందుకంటే మార్కెట్లో పాత'కు ఒకరకమయిన గౌరవం, గిట్టుబాటు వుంటుంది. వాళ్ళు పాతది బంగారంతో సమానమంటారు. అది నిజం కాదు. బుద్ధిహీనులకు, పిరికివాళ్ళకు పాతది బంగారంలా కనిపిస్తుంది. జీవితం ప్రతిక్షణం కొత్తదే. అది పాతది కారు.


అస్తిత్వమన్నది యిప్పుడు యిక్కడ వున్నదేదయితే వుందో అది. దాని గతంలో, భవిష్యత్తుతో సంబంధం లేదు. ఈ క్షణానికి నువ్వు అక్కడ వుంటావు. అక్కడ కలయిక వుంటుంది. అదే సత్యం. నేను సత్యాన్ని ప్రనేమతో కలవమంటాను. సత్యం ఎక్కడికి తీసుకెళితే అక్కడికి వెళ్ళమంటాను. అక్కడ ఏదయినా వదిలేయాల్సి వస్తే వదిలెయ్యాలి. అది సత్యం పట్ల ప్రేమ వున్నపుడే వీలవుతుంది. ప్రేమ ఏమయినా చేస్తుంది. ప్రేమ దేన్నయినా త్యాగం చేస్తుంది. సత్యం సంపూర్ణ త్యాగాన్ని కోరుతుంది.



సశేషం ...


🌹 🌹 🌹 🌹 🌹

Comments


  • Facebook
  • Twitter
  • LinkedIn

©2023 by Dailybhaktimessages2. Proudly created with Wix.com

bottom of page