🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 339 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. మనం యాంత్రికత నించీ బయటపడాలి. ప్రతిపనిలో కొంత నెమ్మదించాలి. మెలకువతో వుండాలి. ప్రతిదీ నెమ్మదిగా నిర్వహించు. శాంతంగా, దయాన్వితంగా చేయి. అప్పుడు ప్రతిదీ చైతన్యవంతమయిన ధ్యానమవుతుంది. 🍀
మనిషి సాధారణంగా 'రోబోట్' లాగా జీవిస్తాడు. పనులు చేస్తూ పోతాడు కానీ అతడు అక్కడ వుండడు. తింటాడు. నడుస్తాడు. మాట్లాడతాడు, వింటాడు. కానీ అక్కడ వుండదు. మనసు ప్రపంచమంతా చక్కర్లు కొడుతూ వుంటుంది. బయట టేబుల్ దగ్గర కూచుని నువ్వు టిఫెన్ చేస్తూ వుండవచ్చు, కానీ లోపల నువ్వు చంద్రుడి మీద వుంటావు. లేదా యింకో పనికి మాలిన చోట వుంటావు. అక్కడ వుండకూకడదని కాదు. ఎక్కడయినా వుండవచ్చు. ఒకటి మాత్రం కచ్చితం. కానీ నువ్వు టుబుల్ దగ్గరయితే మాత్రం లేవు. యాంత్రికంగా వున్నావు. మనం యాంత్రికత నించీ బయటపడాలి. ప్రతిపనిలో కొంత నెమ్మదించాలి. మెలకువతో వుండాలి.
నువ్వు నడిస్తే పాత స్థలంలో వెనకటికి నడిచినట్లే నడవకు. నెమ్మదిగా నడువు. జాగ్రత్తగా నడువు. లేకుంటే వెనకట్లా నడుస్తావు. ప్రతిదీ నెమ్మదిగా నిర్వహించు. శాంతంగా, దయాన్వితంగా చేయి. అప్పుడు ప్రతిదీ చైతన్యవంతమయిన ధ్యానమవుతుంది. మన చర్యల్ని ధ్యానంగా పరివర్తింప చేయొచ్చు. ఉదయం నించీ సాయంత్రం దాకా జీవితం ధ్యానం గుండా సాగవచ్చు. ఆ నిద్ర లేస్తునే ఆ స్పృహతో వుండు. మెల్లమెల్లగా నీ తలుపు తట్టిన శబ్దం వినిపిస్తుంది. నీకు రహస్యపు తాళం చెవి అందుతుంది. అది చాలా ముఖ్యమయిన విషయం. అది చాలా ముఖ్యమయిన విషయం.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Comments