🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 340 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. దిగులు నిండిన జనం ఎంత అపకారం చేశారంటే చెప్పడానికి వీలుపడదు. మానవజాతికి వాళ్ళు చేసినంత హాని ఎవరూ చేయలేదు. వీళ్ళే మానవత్వానికి శత్రువులు. 🍀
గతమంతా దిగులు నిండిన జనమే అధికారం చెలాయించారు. దిగులు నిండి వాళ్ళు అధికారం చెలాయించడంలో ఆనందిస్తారు. వాళ్ళకు యింకో ఆనందం లేదు. యితరుల స్వేచ్ఛని హరించడంలోనే వాళ్ళ ఆనందం. వాళ్ళు సంతోషంగా వున్న వాళ్ళంటే ఈర్ష్య పడతారు. ఆగ్రహిస్తారు. ఆడేవాళ్ళని, పాడేవాళ్లని చూసి కుళ్ళుతారు. దిగులు నిండిన జనం ఎంత అపకారం చేశారంటే చెప్పడానికి వీలుపడదు. మానవజాతికి వాళ్ళు చేసినంత హాని ఎవరూ చేయలేదు. వీళ్ళే మానవత్వానికి శత్రువులు.
ఇక్కడ నా ప్రయత్నం నూత్న మానవుణ్ణి సృష్టించడం. నూతన దృష్టి వున్నపుడే నవ్య మానవుడి సృష్టి వీలవుతుంది. నేను ప్రేమ మతాన్ని బోధిస్తాను. నవ్వుని, వుత్సవాన్ని బోధిస్తాను. ఇది నా అనుభవం, నువ్వు ఆనందంగా వుంటే నీకూ అస్తిత్వానికి మధ్య వంతెన ఏర్పడుతుంది. ఆనందాన్ని బోధించు పరమానందాన్ని బోధించు. ఇంకేమీ వద్దు.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Comments