top of page
Writer's picturePrasad Bharadwaj

నిర్మల ధ్యానాలు - ఓషో - 341


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 341 🌹


✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ


🍀. మనం శరీరాన్ని ఒక్కదాన్నే అంటి పెట్టుకుంటే స్వర్గ న్యాయమైన దయ పని చేయదు. మనం లోపలికి ప్రయాణించడం అంటే ధ్యానంలోకి వెళ్ళడం. మనం శరీరం కాని దాని పట్ల స్పృహతో వుండాలి. అది శరీరంలో వుంది. కానీ అది శరీరం కాదు. శరీరం ఆలయం. కానీ దేవుడు కాడు. 🍀


రెండు పదాల్ని గుర్తుంచుకో. ఒకటి గురుత్వాకర్షణ. రెండోది దయ. మొదటిది భూమి లక్షణం అది. వస్తువుల్ని కిందకు లాగుతుంది. దయ స్వర్గ సంబంధి. అది వస్తువుల్ని పైకి లాగుతుంది. సైన్సు భూమ్యాకర్షణని కనిపెట్టింది. మతం దయను కనిపెట్టింది. మనం జన్మించి గురుత్వాకరణలో బతుకుతాం. మన జీవితమంతా కిందికి లాగబడుతూ వుంటుంది. సజీవంగా మొదలై మన బతుకు మరణంతో ముగుస్తుంది. వ్యక్తి తన లోపలికి ప్రయాణించకుంటే దయ తన పని ప్రారంభించదు.


మనం శరీరాన్ని ఒక్కదాన్నే అంటి పెట్టుకుంటే స్వర్గ న్యాయమైన దయ పని చేయదు. మనం లోపలికి ప్రయాణించడం అంటే ధ్యానంలోకి వెళ్ళడం. మనం శరీరం కాని దాని పట్ల స్పృహతో వుండాలి. అది శరీరంలో వుంది. కానీ అది శరీరం కాదు. శరీరం ఆలయం. కానీ దేవుడు కాడు. ఒకసారి నువ్వు లోపలి దేవుడి పట్ల స్పృహతో వుంటే రెండో న్యాయం అంటే స్వర్గసంబంధ న్యాయం పని చేయ్యడం ప్రారంబిస్తుంది. నిన్ను పైకి లాగుతుంది. జీవితం మరింత విశాలమవుతుంది. దానికి ఆకాశం కూడా హద్దు కాదు. ఆ రహస్యం ధ్యానంలో ఉంది.



సశేషం ...


🌹 🌹 🌹 🌹 🌹

1 view0 comments

Comments


bottom of page