🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 344 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. రోజుకు ఇరవైనాలుగు గంటలూ నిరంతరం ధ్యానంలో వుంటే తప్ప నువ్వు రూపాంతరం చెందవు. అట్లా వుంటే ఒక రోజు అద్భుతం జరుగుతుంది. అప్పుడు వ్యక్తి ధ్యాన సంబంధమైన చైతన్యంతో నిద్రపోవచ్చు. శరీరం నిద్రపోతుంది. కానీ లోలోతుల్లో చైతన్య స్రవంతి సాగుతుంది. 🍀
మన సమస్త శక్తుల్నీ ధ్యానం మీద కేంద్రీకరించకుంటే అది కలగా మిగిలిపోతుంది. యథార్థంగా మారదు. ధ్యానం మన సంపూర్ణతని కోరుతుంది. దాన్ని పాక్షికంగా నిర్వహించలేం. ఎప్పుడో ఒకసారి నిర్వహించలేం. ఉదయాన్నే పదిహేను నిముషాలు సాయంత్రం పదిహేను నిముషాలు చెయ్యడం కుదరదు. రోజుకు ఇరవైనాలుగు గంటలూ నిరంతరం ధ్యానంలో వుంటే తప్ప నువ్వు రూపాంతరం చెందవు.
అట్లా వుంటే ఒక రోజు అద్భుతం జరుగుతుంది. అప్పుడు వ్యక్తి ధ్యాన సంబంధమైన చైతన్యంతో నిద్రపోవచ్చు. శరీరం నిద్రపోతుంది. కానీ లోలోతుల్లో చైతన్య స్రవంతి సాగుతుంది. నువ్వు నిద్రపోతున్నావని నీకు తెలుస్తుంది. ఆ స్థాయిలో కొనసాగితే వ్యక్తి ధ్యానంలోనే మరణించవచ్చు. ధ్యానంలో మరణించిన వ్యక్తి మళ్ళీ జన్మించడు. అనంత విశ్వంలో భాగమవుతాడు. మళ్ళీ శరీర చెరసాలకు రాడు.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Comments