🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 345 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. మృదువుగా, నెమ్మదిగా వున్న వృద్ధుడు అరుదుగా కనిపిస్తాడు. అట్లా సౌమ్యంగా వున్నాడంటే అతను నిజంగా ఆహ్లాదకరంగా జీవించాడని అర్థం. మేలుకున్న వ్యక్తి, చైతన్యవంతుడయిన వ్యక్తి మాత్రమే వృద్ధాప్యంలో జీవితాన్ని దాటి అనంతాన్ని ఆనందగా అందుకోడానికి అతను సంసిద్ధుడయి వుంటాడు. 🍀
వృద్ధులు కఠినంగా వుండడమన్నది యాదృచ్ఛికం కాదు. వృద్ధులు మీ తల్లిదండ్రులయినా వాళ్ళతో జీవించడం చాలా కష్టం. కారణం వాళ్ళ జీవితమంతా నిష్పలంలో నీరు గారింది. వాళ్ళు అది అర్థం లేనిదిగా భావించారు. వాళ్ళు ప్రతిదాని మీదా వ్యతిరేకతని ప్రదర్శిస్తారు. పిల్లలు సంతోషంగా వుండడాన్ని భరించలేరు. ఆనందాన్ని, ఆటను, పాటను, ఉల్లాసాన్ని తట్టుకోలేరు. జీవితమని దేన్నీ అంటామో దానికి పూర్తిగా వ్యతిరేకంగా వుంటారు. మృదువుగా, నెమ్మదిగా వున్న వృద్ధుడు అరుదుగా కనిపిస్తాడు. అట్లా సౌమ్యంగా వున్నాడంటే అతను నిజంగా ఆహ్లాదకరంగా జీవించాడని అర్థం.
అతను నిజంగా ఎదిగాడు అట్లా అందమమయిన అద్భుతమయిన జీవితం జీవించిన వృద్ధుల ముందు యవ్వనం బలాదూరు. అతనిలో పరిణితి వుంటుంది. పక్వత వుంటుంది. అతను చాలా చూశాడు. చాలా కాలం జీవించాడు. అతను అస్తిత్వం పట్ల కృతజ్ఞతతో వుంటాడు. అట్లాంటి వృద్ధుడు తటస్థపడడం కష్టం. అతను బుద్ధుడు, కృష్ణుడు. కేవలం మేలుకున్న వ్యక్తి, చైతన్యవంతుడయిన వ్యక్తి మాత్రమే వృద్ధాప్యంలో చిరునవ్వుతో వుంటాడు. మృదువుగా వుంటాడు. జీవితాన్ని దాటి అనంతాన్ని ఆనందగా అందుకోడానికి అతను సంసిద్ధుడయి వుంటాడు.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Comments