🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 346 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. మనిషి మనిషిగా మారింది మొదలు పరిణామం ఆగిపోయింది. పరిణిత దశ వచ్చేసింది. మనిషి వేల సంవత్సరాలుగా మనిషిగానే వున్నాడు. ఎట్లాంటి ఎదుగుదలా లేదు. మనం పరిణామం నించి విప్లవానికి సాగాలి. పరిణామం అంటే అచేతన, విప్లవమంటే చేతన. 🍀
పరిణామవాదమన్నది అచేతన విషయం. అది సహజమయిన విషయం. సైంటిస్టులు మనిషి చేపగా సముద్రంలో జన్మించాడంటారు. చేపకు మనిషికి మధ్య కోట్ల సంవత్సరాలు గడిచిపోయాయి. మనిషి అన్ని రకాల జంతు స్థాయిల్ని దాటి వచ్చాడు. మనిషి చివరి దశ, మనిషికి ముందు దశ కోతి. ఇదంతా అచేతనంగా జరిగింది. అక్కడ ఎట్లాంటి ప్రయత్నమూ లేదు. మనిషి మనిషిగా మారింది మొదలు పరిణామం ఆగిపోయింది. పరిణిత దశ వచ్చేసింది.
మనిషి వేల సంవత్సరాలుగా మనిషిగానే వున్నాడు. ఎట్లాంటి ఎదుగుదలా లేదు. దీన్ని బట్టి ప్రకృతి ఏం చెయ్యాలో అదంతా చేసేసింది అని తెలుస్తుంది. ఇప్పుడు పరిస్థితిని మన చేతుల్లోకి తీసుకోవాలి. మనం పరిణామం నించి విప్లవానికి సాగాలి. పరిణామం అంటే అచేతన, విప్లవమంటే చేతన.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Comments