🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 347 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. కేవలం ఒక అడుగు కూడా మనిషిని దేవుణ్ణి చేస్తుంది. బుద్ధుణ్ణి చేస్తుంది. చేస్తుంది. అది గాఢమయిన ప్రయత్నం మీద ఆధారపడి వుంటుంది. నీ దృఢ సంకల్పం మీద, నీ సమగ్రత మీద, నువ్వు లీనం కావడం మీద ఆధారపడి వుంటుంది. 🍀
పరిణామమంటే అభివృద్ధి, దానికి కోట్ల సంవత్సరాలు పట్టింది. విప్లవమంటే కూడా అభివృద్ధే కారణం అది చైతన్యం, అది పెద్ద అంగ, దూకడం. అది క్రమంగా జరిగేది కాదు. అడుగులో అడుగు వేస్తూ జరిగేది కాదు. అదంతా నీ మీద ఆధారపడి వుంటుంది. నువ్వెంత సాహసివన్న దాని మీద ఆధారపడి వుంటుంది. కేవలం ఒక అడుగు కూడా మనిషిని దేవుణ్ణి చేస్తుంది. బుద్ధుణ్ణి చేస్తుంది. అది గాఢమయిన ప్రయత్నం మీద ఆధారపడి వుంటుంది.
నీ దృఢ సంకల్పం మీద, నీ సమగ్రత మీద, నువ్వు లీనం కావడం మీద ఆధారపడి వుంటుంది. మనిషి సహజంగా, ప్రకృతి సహజంగా ఎదిగే అవకాశం ఏ మాత్రం లేదు. స్పృహతో వుద్దేశపూర్వకంగా ఎదగాలని మనిషి అనుకుంటే తప్ప మనిషి మనిషిగానే మిగిలిపోతాడు. అది విప్లవానికి ఆరంభం పరిణామాన్ని దాటి నీ జీవితంలో విప్లవాన్ని ఆరంభించు.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Comments