నిర్మల ధ్యానాలు - ఓషో - 348
- Prasad Bharadwaj
- May 16, 2023
- 1 min read

🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 348 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. నువ్వు ఈ క్షణం జన్మించినట్లు, ఇప్పుడే జీవించడం ఆరంభించినట్లు మొదలుపెట్టాలి. గతాన్ని మరచిపో. అది విషాదకరం. దాంతో బాధపడకు దాన్నించీ బయటపడి తాజాగా ఆరంబించు. 🍀
మంచి మానవ సమాజంలో మనం ప్రతి పసిబిడ్డకు 'నీ దగ్గర ప్రేమ, ఆనందం, సత్యం వీటికి సంబంధించిన బీజాలు వున్నాయి. అయితే అవి బీజాలు మాత్రమే. నీ సమస్త జీవితం వాటిని నాటడానికి ప్రయత్నించాలి. అవి పెరిగేలా చేసే కళను అభ్యసించాలి. వాటి ఫలాల కోసం ఎదురుచూడాలి. వాటి పుష్పాలకోసం ప్రార్థనాపూర్వకంగా ఎదురుచూడాలి. సరయిన రుతువు కోసం ఎదురుచూడాలి' అని చెప్పాలి. మనం యిక్కడ చేస్తున్నదదే.
లోపలలి ఫలసాయానికి మనం చేస్తున్న ప్రయోగం. ఇప్పటి దాకా మీరు చేసింది పొరపాటు అభిప్రాయాల ఆధారంగా చేసిందే. యిప్పుడు మనం ఆ దురభిప్రాయాల్ని దూరం చెయ్యాలి. వాటిని తుడిచేయ్యడం మొదలు పెట్టాలి. నువ్వు ఈ క్షణం జన్మించినట్లు, ఇప్పుడే జీవించడం ఆరంభించినట్లు మొదలుపెట్టాలి. గతాన్ని మరచిపో. లెక్కపెట్టకు. అది నీకు ఏమీ యివ్వలేదు. అది విషాదకరం. దాంతో బాధపడకు దాన్నించీ బయటపడి తాజాగా ఆరంబించు.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
コメント