top of page
Writer's picturePrasad Bharadwaj

నిర్మల ధ్యానాలు - ఓషో - 350



🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 350 🌹


✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ


🍀. సత్యాన్ని చూడకుండా వుండడానికి నీ కళ్ళ ముందు చిన్న తెర చాలు. జీవితం గొప్ప ఉపాధ్యాయుడు. అది ప్రతి మనిషినీ చీకటి నించీ వెలుగులోకి దూకడానికి సిద్ధం చేస్తుంది. తెరిచిన కళ్ళకి దేవుడు అస్తిత్వ అనుభవంగా ఆవిష్కారమవుతాడు. 🍀


నువ్వు కళ్ళు మూసుకుని వున్నపుడు అంతా చీకటిగా వుంటుంది. నువ్వు కళ్ళు తెరుచుకుని వుంటే జీవితం రాగరంజితంగా వుంటుంది. కాంతి నిండి వుంటుంది. తెరిచిన కళ్ళకి దేవుడు అస్తిత్వ అనుభవంగా ఆవిష్కారమవుతాడు. దేవుణ్ణి వ్యతిరేకించే వాళ్ళు వాళ్ళు అంధుల మంటారు. వాళ్ళు గుడ్డి వాళ్లు మాత్రమే కాదు మొండివాళ్ళు. వాళ్ళు తాము అంధులం కామని ఐతే దేవుడు లేడని అంటారు. మనిషి కళ్ళు మూసుకుని వుంటే ఎదురుగా ఆకాశంలో సూర్యుడున్నా కాంతి వున్నా చీకట్లోనే వుంటాడు. సత్యాన్ని చూడకుండా వుండడానికి నీ కళ్ళ ముందు చిన్న తెర చాలు. జీవితం గొప్ప ఉపాధ్యాయుడు. అది ప్రతి మనిషినీ చీకటి నించీ వెలుగులోకి దూకడానికి సిద్ధం చేస్తుంది.



సశేషం ...


🌹 🌹 🌹 🌹 🌹

1 view0 comments

Comments


bottom of page