నిర్మల ధ్యానాలు - ఓషో - 355
- Prasad Bharadwaj
- May 31, 2023
- 1 min read

🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 355 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. మనసు ఎప్పుడూ శరీరంలో కానీ, ఆత్మలో కానీ భాగం కాలేదు. మనసులో కొంత చీకటి, కొంత వెలుతురు వుంటుంది. అందువల్ల మనసెప్పుడూ ఆందోళనలో వుంటుంది. 🍀
శరీరం చీకటిని, ఆత్మ వెలుగును కలిగి వుంటాయి. ఈ చీకటి వెలుగులు ఎక్కడ కలుస్తాయి? అవి మనసులో కలుస్తాయి. అది వాటి సరిహద్దు. కాబట్టి మనసులో కొంత చీకటి, కొంత వెలుతురు వుంటుంది. అందువల్ల మనసెప్పుడూ ఆందోళనలో వుంటుంది. కారణం వ్యతిరేక దిశల్లోకి అది లాగబడుతూ వుంటుంది.
శరీరం తన వేపుకు లాగుతుంది. ఆత్మ తన వేపుకు లాగుతుంది. ఆ రెండూ సమాన అయిస్కాంత కేంద్రాలు. అందువల్ల మనసు మధ్యలో వేలాడుతూ వుంటుంది. ఒకోసారి అది శరీరాన్ని ఎన్నుకుంటుంది. ఒకోసారి ఆత్మను ఎన్నుకుంటుంది. అది దేన్ని ఎన్నుకున్నా పొరపాటు అన్న భావనలో వుంటుంది. కారణం యింకోదాన్ని అది కోల్పోతుంది.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
コメント