top of page
Writer's picturePrasad Bharadwaj

నిర్మల ధ్యానాలు - ఓషో - 357


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 357 🌹


✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ


🍀. మనసు అరుస్తుంది. ఆ అరుపుకు ఫలితముండదు. హృదయం శబ్దం చెయ్యదు. ఆ నిశ్శబ్దం నిర్ణయాన్నిస్తుంది. మనసు నించీ హృదయానికి , వాదన నించి ఆమోదానికి దిగితే జీవితం హఠాత్తుగా మారిపోతుంది. 🍀


మనసు వాదించేది. అనంతవాదోపవాదాల్లో మునిగి వుంటుంది. అదెప్పుడూ మేలుకునే వుంటుంది. బిజీగా వుంటుంది. నీకు ఎట్లాంటి అంతిమ నిర్ణయాన్ని అందివ్వదు. ముగింపునివ్వదు. అది ముగింపు లేనిది. అది దాని& తత్వం. కాబట్టి తత్వశాస్త్రం మానవజాతికి ఎట్లాంటి పరిష్కారాన్నీ యివ్వలేకపోయింది. అది నిష్పలమైన వ్యాయామం. వేలమంది తెలివైన వాళ్ళు ఆ పనికి మాలిన పనిలో మునిగి తేలారు. మనసు వాదిస్తుంది. కానీ ఎట్లాంటి పరిష్కారానికీ రాదు.


హృదయం ఎట్లాంటి వాదోపవాదననీ చెయ్యదు. దానికి పరిష్కారం తెలుసు. అదే విషయం. జీవితంలోని ఒకానొక రహస్యమది. మనసు అరుస్తుంది. ఆ అరుపుకు ఫలితముండదు. హృదయం శబ్దం చెయ్యదు. ఆ నిశ్శబ్దం నిర్ణయాన్నిస్తుంది. మనసు నించీ హృదయానికి వాదన నించి ఆమోదానికి దిగితే జీవితం హఠాత్తుగా మారిపోతుంది. ఆ మార్పులో అర్థం, అందం, పరిమళం వుంటాయి. కాంతి ప్రేమ వుంటాయి. వాటన్నిటి కలయికే దైవత్వం.



సశేషం ...


🌹 🌹 🌹 🌹 🌹

1 view0 comments

Comments


bottom of page