🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 360 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. అస్తిత్వం నిన్ను ప్రేమిస్తుంది. అది నీ పట్ల జాగ్రత్త తీసుకుంటుంది. అది నీకు శాపంలా కనిపించవచ్చు. కానీ అదెప్పుడూ వరమే. మన సంకుచితత్వం వల్ల అలా అనిపించవచ్చు. మరణం ఒక విశ్రాంతి. అంతం కాదు. గొప్ప జీవితానికి ఆరంభం.🍀
చాడీలు చెప్నే మనసు ఎప్పటికీ మత సంబంధమయిన మనసు కాలేదు. అసాధ్యం. కారణం అది ప్రాథమికమయిన యథార్థం పట్ల స్పృహతో వుండదు. అస్తిత్వం నిన్ను ప్రేమిస్తుంది. అది నీ పట్ల జాగ్రత్త తీసుకుంటుంది. అందువల్ల సూర్యచంద్రులు, గాలి, వర్షం నీతో స్నేహంగా వుంటాయి. ఏది ఏమైనా అది నీ పట్ల జాగ్రత తీసుకుంటుంది. అది నీకు శాపంలా కనిపించవచ్చు. అదెప్పుడూ వరమే. మన సంకుచితత్వం వల్ల అలా అనిపించవచ్చు. దాని వల్ల మనం సమగ్రంగా చూడలేం. దాని చర్యల్ని గుర్తించలేం. అట్లా చూడగలిగిన పక్షంలో మనం కృతజ్ఞతతో వుంటాం.
మరణించే సందర్భంలోనయినా అస్తిత్వాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి కృతజ్ఞతతో వుంటాడు. కారణం మరణం ఒక విశ్రాంతి. అంతం కాదు. గొప్ప జీవితానికి ఆరంభం. నిజమైన జీవితానికి మన జీవితం రీహార్సల్ లాంటిది. నిజమైన నాటకం మరణానంతరం మొదలవుతుంది. అర్థం చేసుకున్న వాళ్ళకి అది తెలుస్తుంది. అర్థం చేసుకోని వాళ్ళు రీహార్సలే. నిజమైన నాటకమనుకుంటారు. ఆ రీహార్సల్ ముగిశాక వాళ్ళు అరుస్తారు. ఏడుస్తారు. దాన్ని పట్టుకు వేళ్ళాడుతారు. వదిలిపెట్టడానికి యిష్టపడరు. ప్రతి ఈ ఆశీర్వాదమే.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Commenti