నిర్మల ధ్యానాలు - ఓషో - 361
- Prasad Bharadwaj
- Jun 13, 2023
- 1 min read

🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 361 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. ధ్యానమంటే మనసులోని విషయాలనన్నిట్నీ ఖాళీ చెయ్యడం. ఖాళీ మనసు చైతన్యంతో నిండి వుంటుంది. కాబట్టి 'ఖాళీ' అన్న మాటకు భయపడకు. ఒకసారి అన్ని సరిహద్దుల్ని అధిగమించి నువ్వు స్వేచ్ఛ పొందితే ఆకాశంలా విస్తరిస్తావు. అనంతమవుతావు. 🍀
ధ్యానమంటే మనసులోని విషయాలనన్నిట్నీ ఖాళీ చెయ్యడం. జ్ఞాపకం, వూహా, దురభిప్రాయాలు, ఆలోచనలు, కోరికలు, ఆశలు, అనుభూతులు అన్నిట్నీ, నీకు బయటికి దేనినీ పంపాల్సిన పని లేని రోజు నీ జీవితంలో గొప్ప రోజు. అక్కడ స్వచ్ఛమైన ఖాళీ వుంటుంది. అక్కడ స్వచ్ఛమైన చైతన్యాన్ని చూస్తావు. మనసుకు సంబంధించి అక్కడ ఏమీ లేదు. కానీ అది పొంగి పొర్లేది. అస్తిత్వం తొణికిసలాడేది.
ఖాళీ మనసు చైతన్యంతో నిండి వుంటుంది. కాబట్టి 'ఖాళీ' అన్న మాటకు భయపడకు. అది వ్యతిరేకమయింది కాదు. అట్లా అనుకోవడం పాత అలవాటు. దాని వల్ల నష్టమెక్కువ. ఒకసారి అన్ని సరిహద్దుల్ని అధిగమించి నువ్వు స్వేచ్ఛ పొందితే ఆకాశంలా విస్తరిస్తావు. అనంతమవుతావు. అదే దేవుణ్ణి అనుభవానికి తెచ్చుకోవడం, లేదా బుద్ధునితత్వం, దాన్ని మరింకే పేరుతోనైనా పిలువు. ధర్మం, తావో, సత్యం, నిర్వాణం - అవన్నీ దాన్నే చెబుతాయి.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Comments