నిర్మల ధ్యానాలు - ఓషో - 362
- Prasad Bharadwaj
- Jun 16, 2023
- 1 min read

🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 362 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. మనసంటే ఆలోచనల ధూళి. వ్యక్తి ఆలోచన నుండి బయటపడితే స్వచ్ఛత నందుకుంటాడు. స్వచ్ఛమైన హృదయం నీతిబద్ధమైందే. కానీ నీతిమంతునికి స్వచ్ఛతతో పనిలేదు. నీతిమంతుడు 'మనసు'లోనే నివసిస్తాడు. అతని నీతి అతని మనసుపై అధికారం చెలాయిస్తుంది. 🍀
మనిషి అస్తిత్వంతో సంబంధ మేర్పరచు కోడానికి స్వచ్ఛమైన హృదయముండాలి. స్వచ్ఛంగా వుండడంతో బాటు నీలో మనసు ఆధిపత్య ముండకూడదు. మనసులో అధికారముంటే హృదయంలో స్వచ్ఛత వుండదు. అద్దానికి దుమ్ము పట్టినట్లు హృదయం పై మనసు పేరుకుని వుంటుంది. మనసంటే ఆలోచనల ధూళి. వ్యక్తి ఆలోచన నుండి బయటపడితే స్వచ్ఛత నందుకుంటాడు. స్వచ్ఛతకు నీతితో సంబంధం లేదు.
స్వచ్ఛమైన హృదయం నీతిబద్ధమైందే. కానీ నీతిమంతునికి స్వచ్ఛతతో పనిలేదు. నీతిమంతుడు 'మనసు'లోనే నివసిస్తాడు. అతని నీతి అతని మనసుపై అధికారం చెలాయిస్తుంది. కారణం అది అమాయకమైంది కాదు. అందువల్ల అది స్వచ్ఛమైంది కాదు. ఫలితంగా నీతి స్వచ్ఛతకు దారి తీయదు. స్వచ్ఛత తప్పక నీతిమంతమైందే అయితే మొదట స్వచ్ఛత వస్తుంది. నీతి దాన్ని అనుసరిస్తుంది.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
تعليقات