
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 363 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. మనసు గతానికి, భవిష్యత్తుకు పరిగెడుతుంది. దాన్ని వర్తమానంలో నిలపాలి. అప్పుడు వ్యక్తి మెల్ల మెల్లగా యిక్కడ జీవించడం మొదలు పెడతాడు. మన నిజమైనతత్వం వర్తమానంలోొ వుంది. 🍀
మన లోపలి తత్వమే మన నిజమైనతత్వం. అదెక్కడో బయటలేదు. దానికోసం ఎక్కడో వెతకాల్సిన పన్లేదు. వ్యక్తి తన సొంత యింటికి రావాలి. ఇది ఇక్కడి నుండి అక్కడికి చేసే ప్రయాణం కాదు. దానికి భిన్నంగా అక్కడి నుండి యిక్కడికి చేసే ప్రయాణం. మనం ఇప్పటికే అక్కడున్నాం. మనం ఇక్కడికి చేరాలి. మనం ఎప్పుడూ 'అప్పుడు'లో వుంటాం. 'ఇప్పుడు'కి రావాలి.
కాబట్టి నీ మనసు ఎప్పుడు ఎక్కడికో బయల్దేరినా దాన్ని యిక్కడికి లాక్కు రావాలి. అది గతానికి, భవిష్యత్తుకు పరిగెడుతుంది. దాన్ని వర్తమానంలో నిలపాలి. అప్పుడు వ్యక్తి మెల్ల మెల్లగా యిక్కడ జీవించడం మొదలుపెడతాడు. మనం యిక్కడున్న క్షణం కలయిక జరుగుతుంది. బంధ మేర్పడుతుంది. మన నిజమైనతత్వం వర్తమానంలో వుంది.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Comments