నిర్మల ధ్యానాలు - ఓషో - 364
- Prasad Bharadwaj
- Jun 20, 2023
- 1 min read

🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 364 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. నీ కేంద్రం పై శ్రద్ద పెట్టు. నీకు సమయం దొరికినపుడల్లా కళ్ళు మూసుకుని బాహ్య ప్రపంచం గురించి మరచిపో. నీ లోపలి కేంద్రం పై దృష్టి నిలుపు. లోపలి ఎదుగుదలకయినా, బాహ్యమయిన ఎదుగుదలకయినా శ్రద్ధ అన్నది ముఖ్యమయింది. 🍀
ఇటీవలి పరిశోధనల్లో లోపలి ఎదుగుదలకయినా, బాహ్యమయిన ఎదుగుదలకయినా శ్రద్ధ అన్నది ముఖ్యమయింది అని తెలిసింది. పసిబిడ్డకు తల్లిపాలు అవసరం. దాన్ని మించి బిడ్డపై తల్లి శ్రద్ధ ముఖ్యమైంది. తల్లి కేవలం పాలు మాత్రమే ఇచ్చి బిడ్డపై శ్రద్ధ పెట్టకపోతే బిడ్డ తను నిర్లక్ష్యానికి గురవుతున్నానని భావిస్తుంది. దాంతో ఎదుగుదల ఆగిపోతుంది. బిడ్డ తన మీద తను నమ్మకాన్ని కోల్పోతుంది. జీవితానికి అర్థాన్ని కోల్పోతుంది. సానుకూల పరిస్థితుల్లోనే అర్థం, పరమార్థం అవగతమవుతాయి.
ప్రపంచంలో జరుగుతున్నదదే. లోపలి ప్రపంచంలోనూ జరుగుతున్నదదే. మనం దాన్ని గురించి శ్రద్ధ తీసుకోవడం లేదు. పట్టించుకోవడం లేదు. నీ కేంద్రం పై శ్రద్ద పెట్టు. నీకు సమయం దొరికినపుడల్లా కళ్ళు మూసుకుని బాహ్య ప్రపంచం గురించి మరచిపో. నీ లోపలి కేంద్రం పై దృష్టి నిలుపు. అపుడు పూలు వికసించడం చూస్తావు. అదొక తోటపనిలాంటిదే. ఒకరకమయిన పొలం పనిలాంటిదే. ఆ చైతన్యసుమాలు విచ్చుకున్నపుడు జీవితం అర్థవంతమని తెలిసివస్తుంది.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
תגובות